BigTV English

Viral Video: బైక్‌పై హగ్గులు, కిస్‌లు.. అరేయ్‌ ఏంట్రా ఇది

Viral Video: బైక్‌పై హగ్గులు, కిస్‌లు.. అరేయ్‌ ఏంట్రా ఇది

Viral Video: ప్రేమ హద్దు మీరుతోందా? అంటే ఈ మధ్య జరుగుతున్నకొన్ని ఘటనలను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల కాలంలో ప్రేమజంటలు రెచ్చిపోతున్నారు. బహిరంగంగా రోడెక్కుతూ రచ్చచేస్తున్నాయి. నడిరోడ్డుపై బైక్ రైడింగ్‌లో రొమాన్స్ చేస్తూ విమర్శల పాలవుతున్నాయి. తరుచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. రోజు వేలాది ప్రేమ జంటలు బైక్‌లపై నగర వీధుల్లో తిరగడం సహజం. ప్రియుడు బైక్ నడుపుతుంటే.. ప్రియురాలు అతని వెనక కూర్చొని గట్టిగా హత్తుకోవటం.. ఎప్పుడూ చూసేదే. కానీ.. ఇక్కడ మాత్రం ఓ జంట పైత్యం శ్రుతి మించినట్టు కనిపించింది. ప్రియుడు బైక్ నడుపుతుంటే.. ప్రియురాలు అతని వెనక కాకుండా.. ముందు, అతనికి ఎదురుగా కూర్చుని.. రన్నింగ్‍లోనే ముద్దులతో ముంచెత్తటమే ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ అయ్యింది.


ఏమైంది అసలు ఘటన?
హైదరాబాద్ నగరంలో ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌పై ఓ యువకుడు బైక్ నడుపుతూ, పైన కూర్చున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించటం, రొమాన్స్ చేయడం నగర వాసులను, సోషల్ మీడియాలోని నెటిజన్లను షాక్‌కు గురిచేసింది. ఇది కేవలం ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించడమే కాకుండా, ప్రజా ఆచారాలకు భంగం కలిగించినట్లే.

ఈ దృశ్యాలు ఓ ప్రయాణికుడి తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశడు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.


పోలీసుల స్పందన
వీడియో వైరల్ అయ్యాక, ట్రాఫిక్ పోలీసులు ఈ జంటను గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ట్రాఫిక్ సీసీటీవీల ఆధారంగా వారి బైక్ నంబర్‌ను ట్రేస్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు పలు నగరాల్లో సంభవించడంతో.. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లను కూడా ప్రారంభించారు.

అయితే.. సిగ్గు విడిచి రోడ్డుపై ఆ జంట చేస్తున్న ఈ రొమాన్స్ వాళ్లకు బాగానే ఉండొచ్చు కానీ.. వాళ్ల వల్ల మిగతా వాహనదారులను మాత్రం ఇబ్బంది కలిగిస్తోంది. పక్కన జనాలు ఉన్నారు అన్న విషయాన్ని ఆ జంట పూర్తిగా మర్చిపోయారు. ప్రియురాలి ముద్దుల్లో మునిగిపోయి.. ఆ ప్రియుడు బైకును తీసుకెళ్లి ఎవరికో ఢీకొట్టటమో.. వాళ్లే ప్రమాదానికి గురవటమో జరిగిదన్న ధ్యాస వారికి లేకపోవటం గమనార్హం. అయితే.. ఈ వీడియోలో బైక్‌ నెంబర్ కూడా స్పష్టంగా కనిపిస్తుండటంతో.. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

నెటిజన్ల స్పందన
ఈ వీడియో రీల్స్ పైత్యంతోనే చేశారేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ.. ఇన్ స్టా, యూట్యూబ్ రీల్స్ కోసం చేసినప్పటికీ.. వాళ్లపై చర్యలు తీసుకుంటేనే.. మళ్లీ ఇంకొకరు చేసేందుకు సాహసించరని పోలీసులకు కొందరు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.  ఇది కేవలం ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాదు. ఇది పబ్లిక్ ఇండిసెన్సీ కింద కూడా పరిగణించబడుతుంది. ఇలాంటి చర్యలకు కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే అంటూ.. అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Related News

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Leopard Attack: సఫారీ రైడ్‌లో బాలుడిపై చిరుత అటాక్.. పరిగెత్తుకుంటూ వచ్చి మరీ.. వీడియో వైరల్

Viral Video: ఈ రెస్టారెంట్‌ లో గాల్లో ఎగురుతూ వడ్డిస్తారు.. భలే ఉందే!

Big Stories

×