E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని పై శ్రీయ కామెంట్స్.. అక్షయ్ ఫుల్ హ్యాపీ.. అడ్డంగా దొరికిపోయిన పల్లవి..

Intinti Ramayanam Today Episode: అవని పై శ్రీయ కామెంట్స్.. అక్షయ్ ఫుల్ హ్యాపీ.. అడ్డంగా దొరికిపోయిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Today Episode july 28th: అవని గతంలో తను తాకట్టు పెట్టిన నగలని తీసుకోవాలి అని నగల షాప్ కి వెళ్తుంది. అక్కడ నగలను తాకట్టు పెట్టినవి తీసుకోవాలి అని అన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది.. అదే షాప్ కి పల్లవి అశ్విన్తో కలిసి వెళుతుంది.. పల్లవి అవనీను చూసి అక్కడ నుంచి మెల్లగా వెనక్కి వచ్చేస్తుంది.. కానీ అశ్విన్ మాత్రం పల్లవి టెన్షన్ పడితే నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటాడు.. మీ అక్క నన్నేమీ చూడలేదు కదా మాకేమి పరిచయం లేదు కదా.. ఇద్దరం కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా లేవు కదా.. నేను వెళ్ళా నగలను తీసుకొని వస్తాను అని అశ్విన్ పల్లవికి టెన్షన్ పెడుతూ అక్కడికి వెళ్తాడు.. ఎలాగైనా సరే పల్లవిని అవని దగ్గర ఇరికించాలి అనుకుని అనుకుంటాడు అశ్విన్.. కానీ అవని మాత్రం అశ్విన్గమనించుకున్న వెళ్ళిపోతుంది.. పల్లవి సేఫ్ అని అనుకుంటుంది.

శ్రీయ ఎంతమారిపోయిందో..?

రాజేశ్వరితో పాటుగా శ్రీయ శ్రీకర్ అందరూ కూడా బాబుతో కూర్చుని ఆడుకుంటూ ఉంటారు. అవని వదిన నాన్నగారి పేరు పెట్టి చాలా మంచి పని చేసింది అని అందరూ తనపై పొగుడుతూ ఉంటారు.. అవునురా నిజంగానే అవని ఏం చేసినా ఆలోచించి చేస్తుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది అని పార్వతి కూడా అవని వై ప్రశంసలు కురిపిస్తుంది.. ఇక శ్రీయ కూడా ఒకప్పుడు అవని పై అరుస్తూ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అవని అక్క నిజంగానే గ్రేట్ అంటూ తనపై పొగడ్తల వర్షం కురిపించింది.. అక్క ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో అది చేస్తుంది అందుకే నిజంగా అక్క గ్రేట్ అంటూ శ్రేయ పొగుడుతూ ఉంటుంది అప్పుడే అవని సడన్గా ఎంట్రీ ఇస్తుంది..

పల్లవికి షాకిచ్చిన కమల్..

Advertisement

అత్తయ్య నేను షాప్ కి వెళ్ళాను. మొన్న తాకట్టు పెట్టిన నగలని మొత్తం విడిపించి తీసుకొని వచ్చాను అని అవని అనగానే అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అసలు చెప్పకుండా నువ్వు ఒక్కదానివే నగలను తీసుకురావడానికి ఎందుకు వెళ్లావు అవని అని పార్వతి అడుగుతుంది. నన్నైనా పిలవాల్సింది వదిన నేను తోడుగా వచ్చేవాడిని కదా అని శ్రీకర్ కూడా అరుస్తాడు. మీరు అన్నమాట వాస్తవమే కాకపోతే నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో మీకు తెలుసు కదా అందుకే ఆ డబ్బులని కట్టి నగలను తీసుకొని వచ్చాను అని ఎవరి నగలను వాళ్ళకి ఇస్తుంది అవని. అయితే ఎవరు కూడా మా దగ్గర ఉండడం కంటే నీ దగ్గర ఉండడమే మంచిది అని అనడంతో అవని సరే అని అంటుంది. ఇక కమల్ ని పిలిచి పల్లవి నగలను తీసుకోమని చెప్తే కమల్ కూడా ఆ నగలు నీ దగ్గర ఉంటేనే మంచిది వదినా అని అంటాడు..

అక్షయ్ కు ఫుల్ హ్యాపీ..

కమల్ అక్షయ అన్నయ్యకు బాక్స్ కట్టివ్వు వదిన నేను తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఇక కమల్ అక్షయ్ కి తీసుకెళ్లిన బాక్స్ ను చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎలాగైతే కాకరకాయ పెట్టిందో ఇవాళ కూడా ఆ చేతులు నేను భరించాలని కంగారు పడిపోతూ ఉంటాడు. కమల్ ఇక్కడే ఉంటే నా పరువు తీసేస్తాడు వాడిని అక్కడ బయటికి పంపించి అందులో ఏముందో చూడాలి అని అనుకుంటాడు. ఇక కమ్మలు లోపలికి వెళ్ళగానే ఆ బాక్స్ తీసి చూసి షాక్ అవుతాడు అక్షయ్. నిన్నలాగా కాకరకాయ కాకుండా ఇవాళ తనకి ఇష్టమైన రకరకాల వంటలు చేసి పెడుతుంది అవని. మునక్కాయ చేసింది అంటే అన్నిటికి మంచిదే కదా రాత్రి అవినీతి ఏం చేయాలో అది చేస్తాను అని అక్షయ్ చాలా సంతోషంగా లొట్టలు వేసుకుంటూ తినేస్తాడు.

అడ్డంగా దొరికిపోయిన పల్లవి..

Advertisement

పల్లవి ఎక్కడికి వెళ్లిందో ఏంటో అని భానుమతి కంగారు పడిపోతూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి ఇంట్లోకి రావడం చూసి ఏంటి పల్లవి నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదు కదా ఎందుకు బయట ఊరికే తిరుగుతూ ఉంటావు అని భానుమతి అడుగుతుంది.. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లాను అవన్నీ నీకు చెప్పాలా ఏంటి అని పల్లవి అడుగుతుంది.. అయితే పల్లవి లోపలికి వెళ్లి అవనికి నగలు ఇస్తూ ఉండగా కమల్ చూసేసి అందరికీ నిజం చెప్పాలని అనుకుంటాడు. అయితే అందరిని పిలిచి కమ్మలు చేసిన రచ్చతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఆ తర్వాత తను దొంగతనం చేయలేదు అని అవని క్లారిటీ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన పల్లవి..

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. డోంట్ మిస్..

Illu Illalu Pillalu Today Episodes: నర్మద అనుమానమే నిజమే.. సుక్కు ప్లాన్ సక్సెస్.. వల్లికి మరో టెన్షన్..

Gundeninda GudiGantalu Today episode: బారుకు వెళ్లిన రోహిణి.. మనోజ్ దెబ్బకు షాక్.. మీనాకు నిజం తెలుస్తుందా..?

Podarillu Today Episode : నారాయణ సీన్లోకి ఎంట్రీ.. మాధవ్ పై తాయారు సీరియస్.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..?

Intinti Ramayanam Today Episode: రాజేంద్రప్రసాద్ కు పిండం.. కన్నీళ్లు పెట్టుకున్న భానుమతి.. పల్లవి ప్లాన్ రివర్స్..

Ninnu kori Serial Today Episode September 11th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సర్జరీ తర్వాత గతం మర్చిపోయిన విరాట్ – షాక్ లో చంద్ర 

Nindu Noorella Saavasam Serial Today Episode September 11th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన అమర్‌   

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు..ఆ 4 డోంట్ మిస్..

Big Stories

Advertisement
×