BigTV English

Gundeninda GudiGantalu Today episode: బాలును బుక్ చేసేందుకు ప్లాన్.. ప్రభావతికి కొత్త టెన్షన్..రోహిణికి షాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలును బుక్ చేసేందుకు ప్లాన్.. ప్రభావతికి కొత్త టెన్షన్..రోహిణికి షాక్..

Gundeninda GudiGantalu Today episode july 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనాను ప్రభావతి నోటికి వచ్చినట్లు మాటలు అంటుంది. దానికి సత్యం క్లాస్ పీకుతాడు. మన ఇంట్లో ఇన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి. నీ పుట్టింటి తరపు నుంచి ఎవ్వరూ ఇవ్వలేదు నీ పుట్టింటి వాళ్లకు ఏమాత్రం ఆస్తులు ఉన్నాయని మీన అడిగితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు. అప్పుడే కామాక్షి అక్కడకు వచ్చి ఏంటి అప్పుడే గొడవ అప్పుడే ఆగిపోయింది నేను మిస్ అయిపోయాను వదిన అని అంటుంది. ప్రభావతి ఏంటి మేము వియ్యపురాలు ఇద్దరం కొట్టుకుంటే చూడాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఆ తర్వాత మనోజ్ అక్కడికి రాగానే ఫంక్షన్ ఏంటమ్మా ఇంకా స్టార్ట్ అవ్వలేదని అడుగుతాడు. రోహిణి పెద్ద కోడలు కదా.. ముందు తనకే చేయాలి. మీ మామగారు ఎక్కడ వరకు వచ్చారు రోహిణి వెళ్లి కనుక్కొని ప్రభావతి పంపిస్తుంది. బాలు మాత్రం తనను కొట్టిన వాళ్లని గుర్తుపెట్టుకుని కొట్టాలని ఫోటోలను రాజేష్ కి పంపిస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఫంక్షన్ లోబాలుని ఎంత రెచ్చగొట్టినా సరే నువ్వు వెళ్ళు అని చెప్పగానే వెళ్ళిపోతాడు. ఇక శోభన మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు అని రెచ్చిపోతుంది. ఆ ఫ్యామిలీని మా ఫ్యామిలీ నుండి దూరం చేయడానికి నాకు ఒక్క నిమిషం చాలు వెళ్లి ఇంకా గట్టిగా ప్రయత్నించండి అని శోభన అంటుంది.. ఇక బాలు ఆ వ్యక్తి ఫోటోని కూడా పంపించి రాజేష్ కి చూపిస్తాడు.. ఎలాగైనా కొట్టాలి అని బాలు రాజేష్ తో చెప్పడం మీనా వింటుంది. అదేంటండి మీరు కామ్ గా ఉన్నారని అనుకున్నాను కానీ ఇలా ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ అంటుంది. అయితే బాలు లోపలికి వెళ్లి మౌనంగా ఉంటాడు.

బాలు కాలును శృతి వాళ్ల అమ్మ ఏర్పాటు చేసిన మనుషులు ప్రాణం పోయేలా తొక్కుతారు. అయినా కూడా బాలు అంత మౌనంగా ఉండడంతో వాళ్ళిద్దరు షాక్ అవుతారు. ఇక శృతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి బాలు అసలే కోపం తెచ్చుకోవడం లేదని చెబుతారు. అప్పటికే వాళ్ళు చేసిందంతా చూసిన శృతి వాళ్ళ అమ్మ కాలు తొక్కితే ఎందుకు కోపం వస్తుందని అడుగుతుంది. దాంతో బాలు కాలు తొక్కిన వ్యక్తి శృతి వాళ్ళ అమ్మ కాలును కూడా గట్టిగా తొక్కుతాడు. దాంతో ఆమె దగ్గరగా అరుస్తుంది. మిమ్మల్ని తొక్కిన దానికంటే పది రెట్లు ఎక్కువ బలంతో తొక్కానని అయినా బాలు కావాలనే కోపాన్ని అనుచుకుంటున్నాడని చెబుతాడు. ఇంట్లో వాళ్లకి గొడవకు వెళ్లకూడదని ఒట్టు వేసుకున్నట్టు కనిపిస్తుందని చెబుతాడు. ఏదేమైనా మీరు బాలుతో కచ్చితంగా గొడవపడాల్సిందేనని శృతి వాళ్ళ అమ్మ శోభ అంటుంది..


మరోవైపు ప్రభావతి రోహిణి వాళ్ల నాన్న మలేషియా నుండి ఇంకెప్పుడు వస్తారని ప్రశ్నిస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని, ఫ్లైట్ దిగగానే నానే ఫోన్ చేస్తారని చెప్తుంది. ఇలా ఇంకెంతకాలం సమాధానాలు చెబుతావని ప్రభావతి మరొకసారి రోహిణి పై మండిపడుతుంది. ఇక రోహిణి మౌనంగా ఉంటుంది. సరే త్వరగా ఫంక్షన్ కి రెడీ అవ్వమని చెప్పి వెళ్తుంది. మెడలో నగలు కూడా లేవని, తన మెడలోని చైన్ తీసి ఇస్తుంది. మీ నాన్న బంగారం తీసుకొని వస్తారు కదా వచ్చాక నా చైన్ నాకు ఇష్టం లే అని చెప్పి వెళ్ళిపోతుంది. కామాక్షి మీ అత్తయ్య పిలుస్తుంది మీనా అనేసి అంటుంది. బాలు మాత్రం మీనా వెళ్లిపోతే నేను సహనాన్ని కోల్పోతాను అనేసి ఎంత చెప్పినా మీనా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది..

మీనా లేకపోతే కచ్చితంగా నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను అని అనుకుంటాడు. శోభన ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులు బాలు ఒంటరిగా ఉన్నాడు చిరోపక్కన వెళ్లి మనం కాలు తొక్కుతామని అనుకుంటారు.. బాలు మాత్రం వాళ్ళ నాన్నని రంగమాయని పక్కన పెట్టుకొని మీ ఇద్దరితో మాట్లాడక చాలా రోజులైంది అని ఏవో సాకులు చెప్తూ మాటలు మొదలు పెడతాడు.. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి వచ్చి మీరు ఆ సురేంద్ర తో మాటలు కలపండి ఇదే మంచి సమయమని అంటుంది.

Also Read:  ఇదేం ట్విస్ట్.. హిందీలో భారీ ధరకే శాటిలైట్ రైట్స్..!

అయితే సత్యం రంగ ఇద్దరు సురేందర్ తో మాట్లాడదాం పదరా అనేసి అనుకుంటారు. సురేంద్ర నేను ఒక వెల్లని కడుతున్నాను అగ్గి పెట్టి లాంటి కొంపలో లేను అంటూ సత్యం ను అవమానిస్తాడు. అయితే సత్యం వల్ల పెద్ద ఆఫీసరు అక్కడికి వచ్చి సత్యంతో మర్యాదగా మాట్లాడతాడు. అది విన్న సురేంద్ర షాక్ అవుతాడు. మీరు వయసులో పెద్దవారు చాలా నిజాయితీపరులు అని ఆఫీసర్ చెప్పడంతో రంగా సురేందర్ కి కౌంటర్ పడిందని అనుకుంటాడు.. రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాలేదని ప్రభావతి మనోజ్ పై సీరియస్ అవుతుంది.. అయితే రోహిణి అడగడానికి మనోజ్ అక్కడికి వెళ్తాడు. శోభన రోహిణి వాళ్ళ నాన్న వస్తాడా లేదా అని అడుగుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Brahmamudi Serial Today September 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఒకరి గోడు ఒకరికి చెప్పుకున్న అపర్ణ, ధాన్యలక్ష్మీ – నవ్వుకున్న ఇంద్రాదేవి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..

Tv Serial Actress : తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న  హీరోయిన్స్ రియల్ ఏజ్ ఎంతో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. పవన్ ఫ్యాన్స్ కు పండగే..

Big Stories

×