Intinti Ramayanam Today Episode july 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటర్వ్యూ కోసం వెళ్లిన అవని నిదానంగా లోపలికి వెళ్ళగానే అక్కడున్న వార్డు బాయ్ ను నా పేరు పిలిచారంట నేను ఇంటికి వెళ్లొచ్చా అని అడుగుతుంది. అతను లేదమ్మా ఒకసారి పేరు పిలుస్తారు రెండో సారి పిలవరు అని అంటాడు. ఆ మాట వినగానే అక్షయ్ నవ్వుతాడు.. మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అవని అడుగుతుంది. ఒకసారి పిలిచిన వాళ్ళని రెండోసారి పిలవాలని తెలియదా అయినా నువ్వు లేట్ వస్తావా అని అక్షయ్ అంటాడు. అవని నాకు జాబ్ రాకపోయినా పర్వాలేదు ఇది వస్తే బాగుండు అని అనుకున్నాను కానీ రాలేదు ఆయనకైనా వస్తే బాగుండు అని అనుకుంటుంది. ఇంటర్వెల్ కి వెళ్లిన అక్షయ్ ని అక్కడ వాళ్ళు ముందు ఏం చేశారని అడిగితే రాజేందర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చెప్తారు.. ఎందుకు ఆ కంపెనీ నుంచి వచ్చారు అని అడిగితే అక్కడ జరిగిన విషయాన్ని మొహమాటం లేకుండా అక్షయ్ చెప్తాడు.. ఒక అమ్మాయిని సెలెక్ట్ అయ్యావని చెప్తారు. కానీ అక్షయ్ నా పేరు చెప్పలేదండి అని అడుగుతారు. అయితే అక్షయ్ నా పేరు ఎందుకు పిలవలేదు అని లోపలికి వెళ్లి ఆఫీసర్లతో గొడవ పెట్టుకుంటారు. భార్య మాట వినకుంటే పరిస్థితి ఇదే అని అక్షయ్ కు క్లాస్ పీకుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతూ ఉంటుంది.. దిగాలిగా కూర్చున్న అవనిని చూసినా రాజేంద్రప్రసాద్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతున్నావా అవని అని అడుగుతాడు.. నేను సెలెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు మామయ్య ఆయన సెలెక్ట్ అవ్వలేదని నాకు బాధగా ఉంది అని అవని అంటుంది. ఒక ఇంటర్వ్యూ కాకపోతే మరో ఇంటర్వ్యూలు అయినా జాబ్ వస్తుంది ఆ సంగతి పక్కన పెట్టండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అది కాదు మామయ్య ఆయన పరిస్థితి మీకు తెలిసిందే కదా.. ఈ జాబ్ ఆయనకి వచ్చి నేను చాలా బాగుండేది కానీ అక్కడ మన కంపెనీ గురించి అడిగి ఆయన్ని అవమానించారు అని అవని అంటుంది..
పదిమంది కోసం ఇంటర్వ్యూకి పిలిస్తే 100 మంది వస్తారు. వందమందికి ఇంటర్వ్యూ ఉందని పిలిస్తే పది వేల మంది వస్తారు ఇది కామనే ఎవరికి అదృష్టం ఉంటే వాళ్లకే ఉద్యోగం అనేది వస్తుంది అంటూ రాజేంద్రప్రసాద్ సలహా ఇస్తాడు.. ఈ ఉద్యోగం కాకపోతే మరొక ఉద్యోగం లే అమ్మ నువ్వు వెళ్లి తిను అని స్వరాజ్యం అంటుంది.. భానుమతి అక్కడికి వచ్చి రాజేంద్ర అని అరుస్తూ వస్తుంది.. ఏమైందమ్మా ఎందుకలా అరుస్తున్నావని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.. పార్వతికి మందులు అయిపోయాయి రా కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మందులు వేసుకోకుండా ఉంటే అసలు బాగోదని నీకు తెలుసు కదా అని భానుమతి అంటుంది.
నాకు చెప్పొచ్చు కదా అమ్మమ్మ గారు నేను తెప్పిచ్చేదాని కదా అని అవని అంటుంది. మీ అత్తగారి గురించి నీకు తెలుసు కదా అమ్మ ఆత్మ అభిమానం ఎక్కువ ఎవరికీ తన గురించి ఏది చెప్పదు అని భానుమతి అంటుంది. నువ్వు సముద్రాలవని నాకు తెలుసు అవని. అందరూ మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండేలా నువ్వే చేయాలి అమ్మ అని భానుమతి అవని రిక్వెస్ట్ చేస్తుంది.. మీరేం బాధపడకండి అమ్మమ్మ గారు ఆ సంగతి నేను చూసుకుంటాను అని అవని భరోసా ఇస్తుంది.
కమల్ శ్రీకర్ ఇద్దరు తాగేసి ఇంటికి వస్తారు. శ్రియ పల్లవిలను పిలిచి ఈరోజు వంట ఏం చేశారు అని అడుగుతారు. మజ్జిగ పులుసు, పచ్చి పులుసు అని చెప్పడంతో తాగొచ్చిన మొగుడికి మజ్జిపులుసు పచ్చిపులుసు పెడతారా? మీకు కొంచమైనా బుద్ధుందా? చాపల పులుసు, మటన్ పులుసు లాంటివి చేయకుండా ఇలా చేస్తారని వీపు విమానం మోత మోగిస్తారు. శ్రియ పల్లవిలు ఎంత బ్రతిమలాడినా కూడా పట్టించుకోకుండా ఇద్దరినీ దారుణంగా కొట్టేస్తారు. ఈ విషయాన్ని అవని కి చెప్తారు.. మేము తాగు వచ్చామనుకొని వాళ్ళు నిజంగానే భయపడిపోయారు వదిన. కచ్చితంగా రేపు అమ్మని అన్నయ్యని ఇంటికి తీసుకొస్తారు అని అంటారు.
వాళ్ళు భయపడ్డారంటే నాకు నమ్మకం కలగలేదు కన్నయ్య ఏమవుతుందో రేపు చూద్దాంలే అని అవని అంటుంది.. తర్వాత రోజు ఉదయం పాల ప్యాకెట్ కోసం అవని, అక్షయ్ షాప్ వద్దకు వెళ్తారు.. ఇక్కడ ఒకే పాల ప్యాకెట్ ఉండడంతో షాప్ అతను ఇద్దర్నీ స్టేరో సగం పంచుకోమని చెప్తాడు. నాకు కాఫీ తాగపోతే ఏమి తోచదు. అయితే నాకు కాఫీ పెట్టివ్వండి అని అవని పాల ప్యాకెట్ ని అక్షయ్ కు ఇస్తుంది. అయితే అవని అక్షయ్ ఇంటికి వెళుతుంది.. అక్షయ్ అవనీని భరించలేను అని కాఫీ పెట్టడానికి కూర్చో తీసుకొని వస్తానని లోపలికి వెళ్తాడు..
Also Read: అరెరె.. అడ్డంగా బుక్కయిన సాగర్.. శ్రీవల్లి ఫ్యామిలీ గుట్టు రట్టు.. దొరికిపోయిందే..?
అవని మాత్రం వంటగదిలోకి వచ్చి మీరు కాఫీ ఎలా పెడుతున్నారో చూడాలి అని అంటుంది.. కాఫీ ఎలా పెట్టాలో మీకు తెలుసా అని అడుగుతుంది. అక్షయ్ చెయ్యి కాల్చుకోవడంతో అవని నేను పులిని అది ఇది అన్నారు కాఫీ కూడా పెట్టలేరా అని అంటుంది.. అక్షయ్ మళ్ళీ అవని ప్రేమలో పడిపోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పార్వతి బాధపడుతూ ఉంటుంది. శ్రేయ పల్లవిలు పార్వతి దగ్గరికి వచ్చి ఇంటికి రావాలని బ్రతిమలాడుతారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…