E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి క్లాస్ పీకిన భానుమతి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..ఆస్తి కోసం రచ్చ..

Intinti Ramayanam Today Episode: పల్లవికి క్లాస్ పీకిన భానుమతి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..ఆస్తి కోసం రచ్చ..
Advertisement

Intinti Ramayanam Today Episode july 7th: ఉదయం లేవగానే అవని బాబును తీసుకొని బయట ఎండలో కూర్చుంటుంది.. బాబుకి ఇలా ఎండలో కూర్చోబెడితే చాలా మంచిది అని శ్రేయ కి చెప్తుంది.. అవని అక్క చాలా మంచిది నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటుంది.. ఇక బాబుతో మీ పెద్దమ్మ లాగే నువ్వు కూడా ఉండాలి అని అంటుంది. పార్వతి వాళ్ళిద్దరికీ టీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అన్ని పనులు అవనినే చేస్తున్నప్పుడు నేను కొన్ని నా చేయాలి కదా అని పార్వతి అవని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇక వీళ్ళందరిని చూసి కుళ్లుకున్న పల్లవి అక్కడికి వస్తుంది. ఫోన్ చార్జర్ కనిపించలేదు ఎవరు తీసుకున్నారు అని అడుగుతుంది. మాకు తెలీదు అని పార్వతి అంటున్న సరే అందరిని పిలుస్తుంది పల్లవి. కానీ పల్లవి మాటని ఏ ఒక్కరు కూడా పట్టించుకోరు. పల్లవి నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అని కోపంగా లోపలికి వెళ్తుంది. ఇక లోపల మళ్లీ భానుమతి క్లాస్ పీకుతుంది.. ఆస్తులు వచ్చేశాయి.. లాయర్ వచ్చి మీకు పిల్లలు పుట్టారు కదా ఇవాల్టితో మీ ఆస్తి మీకు వచ్చేసింది అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఇక మీ ఇంటికి వెళ్లొచ్చు మీ ఆస్తులని మీరు అనుభవించవచ్చు అని చెప్పగానే అందరూ నవ్వుకుంటారు. అయితే పల్లవికి మాత్రం పిల్లలు పుట్టలేదు కాబట్టి ఫీలవుతూ ఉంటుంది. ఇక ఆస్తులు వచ్చాయని అక్షయ్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. పల్లవి కూడా మారిపోతే బాగుంటుంది అని అవని అంటుంది.

పల్లవి నాపై కోపంగా ఉంది.. 

అవని పల్లవిని మార్చడానికి నా దగ్గర ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేశాను కానీ ఇప్పటివరకు పల్లవిలో ఏ మార్పు కనిపించడం. మనకి పిల్లలు పుట్టారు. శ్రేయ వాళ్లకు కూడా పిల్లలు పుట్టారు కదా ఇక ఆస్తి తనకు రాలేదని చాలా కోపంగా ఉంది. ఇందులో నన్ను ఆస్తికి గార్డియన్ గా చేశారు కదా దానికి ఇంకాస్త బాధ పడిపోతుంది అని అవని అక్షయతో చెబుతుంది.. ఇద్దరికి కూడా పిల్లలు పుట్టి ఉంటే.. తన ఆస్తి తనకొచ్చేది పల్లవి సంతోషంగా ఉండేది కదా కానీ మావయ్య గారు నన్ను ఆస్తికి ఒక సెక్యూరిటీగా పెట్టడం నాకు నచ్చలేదండి అని అంటుంది.. ఆ మాట వినగానే అక్షయ్ మా నాన్న చాలా దూరం ఆలోచించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అవని నువ్వేమీ బాధపడకు అని ఓదారుస్తాడు.. కానీ పల్లవి నా మీద కోపంగా ఉండడం నాకు నచ్చలేదండి తనని ఎలా మార్చాలో నాకు అర్థం కావడం లేదు అని అవని అంటుంది.. ఏదానికైనా ఒక టైం ఉంటుంది ఇప్పుడు శ్రేయ ఎలా మారిపోయిందో పల్లవి కూడా అలానే మారిపోతుంది అని అక్షయ్ అంటాడు.

పల్లవి ఘోర అవమానం..

Advertisement

పల్లవి ఒంటరిగా ఉంటూ ఆస్తి తనకు రాలేదని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆస్తి మొత్తానికి అవని దిక్కుగా పెట్టడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని బాధ పడిపోతూ ఉంటుంది.. అటు శ్రేయ కూడా బాబు పుట్టడంతో మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు.. నాకు బిడ్డలు పుట్టింటే నేను కూడా ఆస్తిని అనుభవించడానికి కదా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని అనగానే పల్లవి ఒక్కసారిగా అరుస్తుంది.. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళిద్దరికీ అంతగా ఇంట్లో గౌరవం దక్కింది నాకెందుకు ఇక్కడ గౌరవం దక్కలేదు అని పల్లవి అడుగుతుంది. ఇద్దరికీ పిల్లలు పుట్టారు ఈ ఇంటికి ఒక గౌరవం తీసుకొచ్చారు అందుకే వాళ్ళని మీ అత్తయ్య కూడా నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. నువ్వు నీ మొగుడుతోనే కాపురం లేక పోయావు ఏం మాట్లాడుతున్నావే ఆడది తలుచుకుంటే మొగుడితో ఎలా కాపురం చేయాలో తెలియదా అని భానుమతి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. మిగిలిన ఏ పని నువ్వు చేయకపోయినా పర్వాలేదు కానీ నీ మొగుడిని నీ వైపు తిప్పుకోవడం అదొకపనా ఆడదానికి అతి సులువైన పని మొగుడిని కొంగును కట్టేసుకోవడం అని భానుమతి సలహా ఇస్తుంది.. భానుమతి సలహా మేరకు పల్లవి ఎలాగైనా సరే కమల్ని తన వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తుంది..

పల్లవికి బెల్ట్ దెబ్బ..

అందరూ కొత్త ఇంటికి వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అవని అక్షయలు తమ లగేజ్ ని సద్దేసుకున్నారు అయితే అవని శ్రేయ దగ్గరికి వెళ్లి తన లగేజ్ ని సర్దుతాను అని అంటుంది.. పార్వతి కూడా శ్రేయ కే సహాయం చేస్తారు.. వాళ్ళందరూ కూడా కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటారు. లగేజ్ సర్దుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే పల్లవి మాత్రం లగేజ్ ని సర్దుకోకుండా అలానే కూర్చొని ఉండటం చూసి కమల్ సీరియస్ అవుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతిని చూసి ఏంటే ముసలిదానా? నీ లగేజ్ ను ప్యాక్ చేసుకున్నావు కానీ నీ మనవరాలు లగేజ్ ని నువ్వే ప్యాక్ చేయాలి లేదంటే నీకు ఈ బెల్టు తగ్గిపోతుంది అని వార్నింగ్ ఇస్తాడు. ఆ మాట విన్న పల్లవి వెంటనే లగేజ్ సద్ది మొత్తం పెట్టేసుకుంటుంది. పల్లవికి ఎక్కడ స్విచ్ నొక్కలో అక్కడ నొక్కితే అర్థమవుతుంది అని కమలనుకుంటాడు..

నేను ఆ ఇంటికి రాను.. 

Advertisement

రాత్రి శ్రీకర్ తీసుకొచ్చిన బిర్యాని తిని అందరూ చాలా సంతోషంగా పడుకుంటారు. మన ఆస్తులు మనకు వచ్చేస్తాయి ఆ ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని అందరూ అనుకుంటారు.. ఈ విధంగా ఆ ఇంట్లో లగేజ్ నంతా ప్యాక్ చేసుకొని మొత్తం ఎక్కించేసిన తర్వాత పల్లవి ఇంకా రాలేదు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది పల్లవి రెడీ కాకుండా అలానే ఉండడంతో అవన్నీ ఏమైందని షాక్ అవుతుంది.. నాకు ఏమి కాలేదు నేనైతే ఆ ఇంటికి రాను అని చెప్తుంది. మీకు పిల్లలు పుట్టారు. మీరు ఆస్తిని అనుభవిస్తారు కానీ నాకు పిల్లలు పుట్టలేదు. నా మొగుడు నన్ను దగ్గర కూడా రానివ్వలేదు.నాతో కాపురం చేయడం లేదు నేను ఆ ఇంటికి రాను అని తెగేసి చెప్తుంది. నా మొగుడు నాతో కాపురం చేస్తేనే నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని పల్లవి ఫిట్టింగ్ పెడుతుంది. అవని మాత్రం నీ భర్తతో సంతోషంగా ఉండాలని నువ్వు ప్రయత్నించాలి ఒకరు చెప్తే రాదు అని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పల్లవి ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి…

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×