Kalthi Kallu: కల్తీ కల్లు ఘోరం. మరోసారి ప్రాణాల మీదికి ముప్పు తెచ్చింది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. 40 మందిని నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. బాధితులందరూ విరోచనాలు, వాంతులు, లోబీపీతో బాధపడుతున్నారు. మొదట వారిని స్థానిక రాందేవ్‌రావు ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు అధికారులు. DMHO ఉమ, బాలానగర్ DCP సురేష్‌కుమార్ బాధితులను పరామర్శించారు. పరిస్థితిపై ఆరా తీశారు. ఇప్పుడు బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది అన్నారు. సమీపంలోని కల్లు దుకాణాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించామని ఉమ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ కల్లు దందాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Also Read: రాముడు మావాడే.. శివుడూ మావాడే.. నేపాల్ ప్రధాని సంచలనం
ఈ ఘటనపై స్పందించిన శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ బాధితులకు మెరుగైన సహాయం అందించేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఈ ఘటనకు కారణమైన కల్లు దుకాణాలతో పాటు వాటి నిర్వాహకులపైన కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.