Gundeninda GudiGantalu Today episode july 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా మంచి అమ్మాయి, తనకున్న బంగారాన్నే ఇంట్లో పెట్టేసిందని, తనకు అలాంటి బుద్ధి లేదని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ శృతి వాళ్ల నాన్న సురేంద్ర సత్యంపై మాటలు జారుతూనే ఉంటాడు. అంతే కాకుండా మీనాను కూడా దొంగ దొంగ అంటూ అవమానిస్తారు. ఇక మీనా గురించి తెలుసుకున్న తర్వాత కూడా బాలుపైనే ఫైర్ అవుతుంది. అందరు ఇంటికి వెళ్తారు.. శృతి రానని అంటుంది. రవిని వదిలేసి వెళ్తారు.. ఇంటికి వెళ్ళగానే ప్రభావతి బాలు పై రెచ్చిపోయి మాట్లాడుతుంది. వాడు వస్తే ఎంత పెద్ద గొడవ జరుగుతుందో అర్థమైందా? ఇప్పటికైనా మీకు కళ్ళు తెరుచుకొని కొడుకేంటి వాడి పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోండి అని ప్రభావతి సత్యం పై సీరియస్ అవుతుంది.. కానీ సత్యం మాత్రం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసు కదా మరి ఆ సురేందర్ గురించి మాట్లాడకుండా బాలు గురించి మాట్లాడతావా అని అరుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు మీనా ఇంటికి వస్తే ప్రభావతి పెద్ద రచ్చ చేస్తుంది. చేసినంత చేసి మల్ల ఇంటికి ఏ మొహం పెట్టుకొని వచ్చారు అని ప్రభావతి బాలు పై రెచ్చిపోయి మాట్లాడుతుంది. అంత పెద్ద మనిషిని అంత మంది ముందర కొడితే ఎవరికైనా కోపం రాదా అసలు కొట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది. ఆయన చేసిన తప్పేంటి అత్తయ్య అని మీనా అంటుంది. ఈ గొడవన్నటికీ కారణం నువ్వేనే నీవల్లే వాడు కొట్టాల్సి వచ్చింది అని మీనా పై కూడా సీరియస్ అవుతుంది ప్రభావతి.
ఇంటి కోడల్ని ఒకడు వచ్చి దారుణంగా మాట్లాడుతుంటే వారిని నాలుగు పీకాల్సింది పోయి నన్ను మీరు అంటున్నారని మీనా ఫీల్ అవుతుంది. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు మళ్లీ మీరు ఇలా మాట్లాడుతున్నారంటే ఏమనుకోవాలి అని మీనా అంటుంది. మీనా అన్నదాంట్లో తప్పేంటి అని సత్యం సపోర్ట్ చేస్తాడు. ఇంటి కోడల్ని అంటుంటే నాకే ఒళ్ళు మండిపోయింది అలాంటిది కట్టుకున్న భార్యను ఒకడు వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఎవరికైనా ఒళ్ళు మండకుండా ఉంటుందా అందుకే వాడు కొట్టాడు. దాంట్లో తప్పేమీ లేదు అని సత్యం అంటాడు.
అదంతా నాకు తెలియదండి వీళ్ళిద్దరూ నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి అంటుంది.. ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారు ఏం మాట్లాడుతున్నావ్ తెలుసా నీకు అసలు అని సత్యం అంటాడు. నా కొడుకు కోడల్ని ఇంట్లో లేకుండా పంపించేశారు. అలాంటిది వీడు వీడి పెళ్ళాం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి మొండికేసుకుంటుంది. వాళ్ళిద్దరూ నీకు కొడుకు కోడలు అయితే మరి నేను ఎక్కడి నుంచి ఊడిపడ్డానా ఆకాశం నుంచి ఏమైనా అని బాలు అంటాడు.
అయితే మీనా వాళ్ళిద్దరూ మీకు కొడుకు అయినప్పుడు ఈయన మీ కొడుకు కాదా అని అడుగుతుంది. సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని ప్రభావతి అంటుంది. సరే మేమిద్దరం ఇంట్లోంచి వెళ్లడమే కదా నీకు కావాలి పదమీనా బట్టలు సర్దుకొని వచ్చేద్దామని బాలు అంటాడు. ఇప్పుడు కచ్చితంగా మనం ఇంట్లోంచి వెళ్లాలంటే ఎక్కడకి వెళ్తామండి. మీరు కాసేపు ఆగితే మామయ్య మాట్లాడుతారు కదా అని మీనా అంటుంది. నేను పోషించుకోలేనంత దరిద్రపు స్థితిలో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా మరేం పర్లేదు నేను కచ్చితంగా పోషించుకుంటాను అని బాలు అంటాడు.
ఇక బ్యాగులు సర్దుకొని మీనా బాలు కిందకి వస్తారు.. వాళ్ళిద్దరు వెళ్లిపోతారని మనోజ్ రోహిణి చాలా సంతోషంగా ఉంటారు. అయితే వెళ్ళొస్తావ్ మావయ్య అని అంటుంది. బాలు ఆయనకు చెప్తున్నావేంటి? ఆయన కూడా మనతోపాటు వస్తున్నాడు కదా మా నాన్న లేని నేను ఉండలేను నన్ను చూడండి ఆయన ఉండలేడు అందుకే అందరం కలిసి వెళ్లిపోదామని అంటాడు. అవును నేను ఇక్కడ ఉండలేను పోయి బ్యాగ్ సర్దుకొని వస్తానని సత్యం అనగానే బాలు నీ బ్యాగ్ కూడా ఆల్రెడీ సర్దుకుని వచ్చాను నాన్న వెళ్ళిపోదాం పదండి అని అంటాడు.
Also Read :‘హరిహర వీరమల్లు ‘ రన్ టైం ఇంతేనా..? ఫ్యాన్స్ లో కొత్త టెన్షన్..
ప్రభావతి ఈ వయసులో మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నావా ఆయన లేనిది నేను ఉండను అని అంటుంది.. మొత్తానికైతే బాలు మీనా ఇంట్లో ఉండడానికి ప్రభావతి ఒప్పుకుంటుంది. రవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే శోభా సురేంద్ర ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోతాడు. అటు సంజయ్ మౌనికను పిలిచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను పెళ్లయిన తర్వాత ఇన్ని రోజులకి ఇంత హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలుసా అని అంటాడు. ఏమైందండీ ఎందుకు అని అంటే ఇది నీకు బ్యాడ్ న్యూస్ కావచ్చు అని మౌనికతో అంటాడు సంజయ్. మీ ఇంట్లో వాళ్ళు గొడవపడ్డారు అంట ఫంక్షన్ ఆగిపోయింది అంట అని అనగానే మౌనిక ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..