Intinti Ramayanam Today Episode june 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ఇంట్లోంచి వెళ్ళపోవడంతో ఆ విషయం తెలుసుకున్న అవని రాజేంద్రప్రసాద్, భరత్, అందరూ కలిసి బయటకు వచ్చి వీధులు వెతుకుతారు.. కానీ వాళ్ళు కనిపించరు. అవనిని చూసిన శ్రీకర్ కమల్ అక్కడికి వెళ్తారు.. అమ్మ వాళ్ళు ఎక్కడ కనిపించలేదు అని అందరూ అనుకుంటారు.. అయితే అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అవని అడుగుతుంది. కచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ఉంటారని అనుకుంటారు.. ఆ తర్వాత కమల్, అవని, శ్రీకర్ అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్ ఇంటికి వెళ్ళారేమో చూడాలని వెళ్తారు. అయితే అందరు అనుకున్నట్లుగానే అక్షయ్ వాళ్లు అక్కడే ఉంటారు. అవని వెళ్ళగానే భాస్కర్ వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారా ఇది ఏమైనా హోటల్ అని మాట్లాడుతుంది.. మాటలు వినగానే అవని అత్తయ్య గారు మన ఇల్లు ఉండగా మీరు అక్కడే ఉండమని చెప్పిన కూడా ఎందుకు ఇలా వచ్చారు అని అంటుంది. అయినా అక్షయ్ వాళ్లు వినకుండా మమ్మల్ని ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా అని అవని పై అక్షయ్ సీరియస్ అవుతారు. అక్షయ్ పార్వతి అవని వాళ్ళని వెతుక్కుంటూ భాస్కర్ ఇంటికి రావడంతో వాళ్లు చాలా ఫీల్ అయిపోతారు. మమ్మల్ని ఇక్కడికి వచ్చిన వదలట్లేదా.. మేము ఎక్కడున్నామో మీకు తెలిసిపోకుండా ఉండడానికి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాం అయినా కూడా వదలవా అని పార్వతి అవనిని అందరి ముందర దారుణంగా అవమానిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి, శ్రీయాలు అవని జన్మలో ఇంటికి రాదని ఫిక్స్ అవుతారు. ఇక నగల కోసం కొట్టుకుంటారు.. ఇదంతా కాదు మనిద్దరం సగం, సగం పంచుకుందామని చెబుతారు. నగలను పంచుకుంటారు. ఇంట్లోకి రాగానే అవని నగలను శ్రీయ పల్లవి పంచుకుంటారు.. అది వినగానే శ్రీకర్ కమల్ ఇద్దరూ షాక్ అవుతారు.. కమల్ మా వదిన కూడా వస్తుంది. కాళ్లు చెయ్యి ఒకరు పంచుకోండి సరిపోతుంది అని అంటాడు. అవని అక్క ఇప్పట్లో మీ ఇంటికి వచ్చేలా లేదు అందుకే నగలను మేము వేసుకోవాలి అనుకున్నం అందులో తప్పేముంది అని పల్లవి అంటుంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు ఊడవలేదు.. కిచెన్లో గిన్నెలు కిచెన్ లోనే ఉన్నాయి. ఎక్కడివి అక్కడే ఉన్నాయి అవి పట్టించుకోకుండా మీరిద్దరూ నగలను పంచుకుంటున్నారు. అమ్మ వదిన ఉన్నప్పుడు ఇంట్లో దేవుడి గదిలో ఎప్పుడు దీపం వెలిగేది.
ఇప్పుడు మీరిద్దరూ ఉండడంవల్ల ప్రయోజనం ఏంటి అని కమల్ సీరియస్ అవుతాడు. ముందు వెళ్లి అర్జెంట్గా దీపం పెట్టి దేవుడి దగ్గర దండం పెట్టుకోండి అని కమలంటాడు. కమల్ మాట విని ఇద్దరు కోడలు లోపలికి వెళ్తారు. వీళ్ళని ఇలా అయితేనే కంట్రోల్లో పెట్టొచ్చు అన్నయ్యని శ్రీకర్ తో కమలంటాడు. పల్లవి శ్రియ కమల్ చెప్పినట్లుగానే పూజ చేసి హారతి తీసుకుని వచ్చి ఇద్దరికీ ఇస్తారు. ఇలా బుద్ధిగా ఆడవాళ్లు చేసే పనులు లాగా మీరిద్దరు చేయాలి అని ఆర్డర్ వేస్తారు. పల్లవి మాత్రం ఇంట్లో అందరూ వెళ్లిపోయిన వీడి గోల తట్టుకోలేకపోతున్నానని మనసులో అనుకుంటుంది.
పల్లవి వాళ్ళ నాన్న చక్రధరి ఇంటికి వెళ్లడం చూసిన శ్రీకర్ అక్కడికి వచ్చి కిటికీలో ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అనుకుంటారు.. శ్రీకర్ రాకముందు ఆ ఇంటిని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలని మాట్లాడిన పల్లవి శ్రీకర్ వింటుండడం చూసి ప్లేట్ ఫిరాయించి కుటుంబం కోసం బాధపడుతున్నట్లు మాట్లాడుతుంది. ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. చక్రధర్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడం చూసి శ్రీకర్ మా వాళ్ల గురించి పాజిటివ్ గా పల్లవి మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..
అక్షయ్ తన ఫ్రెండ్ భాస్కర్ ఇంట్లో అన్నం తింటూ ఉండగా ఆయన భార్య తక్కువ చేసి మాట్లాడడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముగ్గురు రోడ్డున నడుచుకుంటూ వెళ్తారు. ఇకమీదట నడవడం మా వల్ల కాదురా ఆటోని పిలువు అనేసి పార్వతి అంటుంది. భానుమతి కూడా నా వల్ల కావట్లేదు రా నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది. కానీ అక్షయ్ మాత్రం ఎక్కడికి వెళ్లాలో తెలిస్తే కదా ఆటు మాట్లాడడానికి అదే వెతుకుతున్నానమ్మా అని అంటాడు. ఇక పక్కనే ఉన్న గుడిని చూసిన భానుమతి కాసేపు గుడిలో రెస్ట్ తీసుకుని వెళ్దామని అంటుంది.
పార్వతి అక్షయ్ భానుమతి ముగ్గురు గుడిలోకి వెళ్తారు. అక్షయ్ తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి అడిగిన ప్రయోజనం లేకపోతుంది. ఎవరు కూడా డబ్బులు సాయం చేసేందుకు ముందుకు రారు. పార్వతి మన దగ్గర డబ్బులు విలువ ఉన్నప్పుడే ఫ్యామిలీ అయినా స్నేహితులైన మన దగ్గరే ఉంటారు అని అంటుంది. భానుమతి గుడిలో పెట్టే ప్రసాదం కోసం వెళ్లి క్యూలో నిలిచి ఉంటుంది. అది చూసిన పార్వతీ అక్షయ్ బాధపడతారు. భానుమతి వాళ్ళిద్దరు కూడా ప్రసాదం తీసుకుని వచ్చి ఇస్తుంది. నాకు షుగర్ ఉంది కదా ఎక్కువసేపు తినకుండా ఉండలేకపోతున్నాను కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగో మీరు కూడా తినండి అని వాళ్ళిద్దరికీ ప్రసాదం ఇస్తుంది..
ఇక గుడికి వచ్చిన అవని తన కుటుంబ సభ్యులు ఇలా చెల్లాచెదురుగా అయిపోవడం చూసి దేవుడితో బాధపడుతూ మొరపెట్టుకుంటుంది. ఇకమీదటైనా అక్షయ్ తప్పు తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అని దండం పెట్టుకుంటుంది. అప్పుడే గుడిలో ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు ఎలా అయిపోయారు అని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవనివల్ల వాళ్ళింటి ఎదురుగా ఉన్న ఇంటికి అద్దెకు వస్తారు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..