E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి..మీనాక్షికి నిజం చెప్పిన అవని.. సెంటిమెంట్ సీన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి..మీనాక్షికి నిజం చెప్పిన అవని.. సెంటిమెంట్ సీన్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 25th: రాత్రి అవ్వగానే అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఆ టైంలో పల్లవికి మీనాక్షి సాంబార్ వడ్డిస్తుంది. పల్లవి నువ్వేమి నాకు వడ్డించదు నువ్వు వడ్డిస్తే అసలు తినను కూడా తినను అని అక్కడి నుంచి లేచిపోతుంది. అయినా కూడా మీనాక్షి వదలకుండా తనకోసం పాలు తీసుకొని లోపలికి వెళ్తుంది. అది చూసినా పల్లవి నువ్వంటేనే నాకు అసహ్యం అలాంటిది నువ్వు ఏం తెచ్చిన నేను ఎలా తాగుతాను అని అనుకుంటున్నావు అంటూ గోరంగా అవమానిస్తుంది. ఇక మీనాక్షి తన కూతుర్లాంటి పల్లవి తనని ఇలా మాట్లాడుతుంది అని బాధపడిపోతూ ఉంటుంది.

పల్లవి మాటతో మీనాక్షి కన్నీళ్లు..

పల్లవి భోజనం చేయమని మీనాక్షి ఎంతగా బ్రతిమలాడుతున్న సరే అస్సలు వినకుండా నాకొద్దు అని లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మీనాక్షి బాధపడుతుంది అవని నువ్వేమీ బాధపడదు అమ్మ పల్లవి గురించి తెలిసింది కదా అని అంటుంది.. అయితే మీనాక్షి పల్లవి కోసం పాలు తీసుకుని గదిలోకి వెళ్తుంది. మా పల్లవి సగం కడుపుతో పడుకోకూడదు అమ్మ నీకు నష్టం కలుగుతుంది ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అని చాలా గొప్పగా చెప్తుంది.. మీనాక్షి మాటలు వింటున్న పల్లవి కోపంతో రగిలిపోతుంది. నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు.. నీ మాటను వింటానని అస్సలు అనుకోవద్దు అని పల్లవి అంటుంది.. నువ్వు వెళ్ళిపోతేనే నేను మనశ్శాంతిగా ఉంటాను అప్పుడే కడుపునిండా భోజనం చేస్తాను.. నువ్వు ముందు ఆ పని చేస్తే నేను చాలా సంతోషంగా ఉంటాను అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది..

పల్లవి మాటతో వెళ్లిపోయిన మీనాక్షి..

Advertisement

పల్లవి తనని ఎంతో బాధ పెట్టింది అని మీనాక్షి బాధ పడిపోతుంది.. కన్న తల్లి లాంటి దాన్ని అని కూడా చూడకుండా మీనాక్షిని ఘోరంగా అవమానించడంతో పల్లవికి దూరంగా వెళ్లిపోవాలి అని అనుకుంటుంది.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోతుంది. అలా వెళ్ళిపోయినా మీనాక్షిని వెతుక్కుంటూ చక్రధర్ ఇల్లంతా చూస్తాడు.. చక్రధర్ మీనాక్షి ఎక్కడ కనిపించలేదు అవి కూడా ఇంట్లో లేదు కదా ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు.. అయితే ఎదురుగా అవని రావడంతో చక్రధర్ మీ అమ్మ ఇంట్లో లేదమ్మా ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్లిందో నాకు కంగారుగా ఉంది అని అంటాడు. ఎక్కడికి వెళ్ళింది నాన్న మీకు ఏమైనా చెప్పిందా అని అవని టెన్షన్ పడుతుంది.. అలాగే అన్న మాటలకి బాధపడి బయటికి వెళ్లిపోయినట్లు ఉంది అని చక్రధర్ చెప్పగానే అవని షాక్ అవుతుంది..

మీనాక్షి కోసం టెన్షన్ పడ్డ అవని..

పల్లవి దారుణంగా అవమానించడం వల్లే మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటుంది అని అవని తనకోసం వెతుకుదాం పదండి అని చక్రధర్అవని ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు.. ఊరంతా జల్లెడ పట్టి మీనాక్షి కోసం వెతుకుతూ ఉంటారు.. మీనాక్షి ఎక్కడ కనిపించకపోవడంతో ఇద్దరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు.. మీనాక్షి ఎక్కడ ఉంది అని చక్రధర్ కూడా టెన్షన్ పడిపోతూ తనని వెతికే ప్రయత్నం చేస్తారు. ఒకచోట మీనాక్షి కనిపించడంతో అమ్మ ఎక్కడుంది నాన్న అని తన దగ్గరికి వెళ్తారు. ఇక మీనాక్షి దగ్గరికి వెళ్ళగానే తను మాత్రం బయటకు వెళ్ళిపోతుంది.. అమ్మ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చావు అని అవని అడుగుతుంది.

మీనాక్షికి నిజం చెప్పిన అవని..

Advertisement

మీనాక్షి నేను ఆ ఇంట్లో ఉండలేను పల్లవి నన్ను దారుణంగా అవమానిస్తుంది అని చెప్పడంతో.. నువ్వు నేను ఏదైనా ఒక మాటంటే బాధపడతావా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావ్ అమ్మ పల్లవి నీ కన్ను కూతురు తను ఒక మాటంటే తను నిన్ను అర్థం చేసుకునేలా చేసుకోవాలి అని అవని చెప్తుంది.. మొదట మీనాక్షి నమ్మకపోవడంతో… చక్రధర్ అసలు నిజాన్ని బయట పెట్టడంతో మీనాక్షి తన కూతురు కోసం కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మీనాక్షి పల్లవి తన కూతురే అని తెలుసుకొని తనకోసం కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేస్తుంది.. ఈ ఎపిసోడ్ కి ఇదే ఎమోషనల్ సీన్.. ఇక తర్వాత రోజు నుంచి పల్లవి తన కూతురిని తెలుసుకున్న మీనాక్షి తనని ఎలాగైనా సరే తన ప్రేమతో తన వైపు తిప్పుకోవాలని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :సీరియల్స్ కు డబ్బులు ఎలా వస్తాయో తెలుసా..? ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చేసిందిగా..

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×