E-Paper
Advertisement

హైదరాబాద్ ప్రజల వాస్తవాలు.. ఏడాదికి 200 గంటలు వృథా, ఊహించని విషయాలు

హైదరాబాద్ ప్రజల వాస్తవాలు.. ఏడాదికి 200 గంటలు వృథా, ఊహించని విషయాలు
Advertisement

Hyderabad People: హైదరాబాద్ నగరానికి ఏమైంది? ఓ వైపు ట్రాఫిక్ రద్దీ.. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. సగటు జీవులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీని కారణంగా నగరవాసులు ఏటా 200 గంటలు కోల్పోతున్నారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు చేపట్టిన అధ్యాయనాల్లో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

 

హైదరాబాద్ నగరానికి ఏమైంది?

Advertisement

అంతర్జాతీయ నగరంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ సిటీకి సంబంధించి రెండు అధ్యయనాల్లో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు ట్రాఫిక్ రద్దీ.. మరోవైపు పెరుగుతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా నగర జీవుడు ప్రతి ఏడాది దాదాపు 200 గంటల సమయాన్ని కోల్పోతున్నాడట. ఆ లెక్కన దాదాపు ఏడాదికి ఎనిమిది రోజులు కోల్పోతున్నారన్నమాట. దీనివల్ల వారు అంతకంతకూ నిద్రకు దూరమవుతున్నారు.

 

అంతర్జాతీయ సంస్థల అధ్యాయనాల్లో నిజాలు

Advertisement

నెదర్లాండ్స్‌కు చెందిన ట్రాఫిక్ అనలిటిక్స్ సంస్థ టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్-అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థలు వేర్వేరుగా చేసిన అధ్యాయనాల్లో కఠోరమైన వాస్తవాలు బయటపడ్డాయి. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం.. హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఏడాదికి సుమారు 123 గంటలు కోల్పోతున్నారు. దాదాపుగా ఐదు పూర్తి రోజులు అన్నమాట. నగరంలో రద్దీ స్థాయి 55.5 శాతంగా నమోదు అయ్యింది. 10 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి సగటున 32.37 నిమిషాల సమయం పడుతోందట. అదే సాయంత్రం సమయంలో 39.5 నిమిషాలు పడుతోంది.

 

పగలు-రాత్రి వేళలో హైదరాబాద్ పరిస్థితి?

దీనిబట్టి నగరంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం సమయం వృథా కాదు, మానసిక ఒత్తిడి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఇప్పటివరకు మనం చెప్పింది కేవలం పగటి వేళ మాత్రమే. రాత్రి విషయానికి వద్దాం. నగరవాసులకు రాత్రివేళ సరైన విశ్రాంతి కరవవుతోంది. కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ సిటీ, అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతోందని క్లైమేట్ సెంట్రల్ అధ్యయనం బయటపెట్టింది. పగటి వేళ భవనాలు-రోడ్లు పీల్చుకున్న వేడిని రాత్రిపూట విడుదల చేయడంతో ఉష్ణోగ్రతలు వేడిగా ఉంటోంది. దీని కారణంగా నగరవాసులు ఏటా సగటు 75 గంటల నిద్రకు దూరమవుతున్నారు.

ALSO READ: బిగ్ టీవీ ఛైర్మన్ వెన్నం విజయ రెడ్డితో BRICS కల్చరల్ మీడియా ఫోరం ప్రతినిధులు భేటీ

ఇలాగే కంటిన్యూ అయితే రానున్న రోజులు మరింత కష్టంగా మారడం ఖాయమనే సంకేతాలు ఇచ్చాయి. కేవలం గణాంకాలు కాదు.. అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ సిటీ, పౌరుల జీవన నాణ్యత ఎంత వేగంగా క్షీణిస్తోందో చెప్పడానికి ఇదొక ఎగ్జాంఫుల్. ప్రభుత్వం దీనిపై ఫోకస్ చేసి ప్రజా రవాణాను పటిష్ఠం చేయడం, పచ్చదనాన్ని పెంచడం వంటి సమగ్ర చర్యలు చేపట్టాలి. లేకుంటే భవిష్యత్తులో హైదరాబాద్ సిటీలో నివసించడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు  పలువురు పర్యావరణ వేత్తలు.

Related News

నిమజ్జనాల్లో అమ్మాయిలను వేధిస్తే ఇదే గతి.. 1,530 మందిపై కేసులు నమోదు

తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరినీ వదలం.. కోర్టులో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!

దమ్ముంటే రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లు.. సీఎం రేవంత్‌కు రాంచందర్ రావు సవాల్!

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలారా.. సిగ్గుతో తలదించుకోండి: బండి సంజయ్

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

Big Stories

Advertisement
×