E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణ మాటతో కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్.. చక్రీ మాటతో ఫుల్ హ్యాపీ.. హైలెట్ సీన్..

Podarillu Today Episode : నారాయణ మాటతో కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్.. చక్రీ మాటతో ఫుల్ హ్యాపీ.. హైలెట్ సీన్..
Advertisement

Podarillu Today Episode august 10th: నువ్వు మా అమ్మ లాగా చూసుకుంటావు.. మా కోసం ఎన్నెన్నో చేసావు. నాకు మా అమ్మ కూడా అన్నం పెట్టలేదు కానీ నా ఆకలిని గుర్తించి నువ్వు నాకు అన్నం పెడుతున్నావు.  మీరు రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను రా పెద్దోడా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు లేకుంటే నన్ను ఎవరు చూసుకుంటారు రా నాకు ఎవరు అన్నం పెడతారు అని నారాయణ బాధతో తన కొడుకుని నిలదీస్తాడు. ఈ ఎపిసోడ్ కి ఈ సీను హైలెట్ గా నిలుస్తుంది. కన్నీళ్లు పెట్టించేలా మాట్లాడే ఈ సీను జనాలని కూడా కన్నీళ్లు పెట్టిస్తుంది.. అన్నదమ్ముల సెంటిమెంటు తండ్రీ కొడుకుల అనుబంధం ఈ ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది.. ఎవరు ఎలా ఉన్నా సరే నా కొడుకు నాతో ఉన్నాడన్న ధైర్యం నాలో ఉండేది కానీ నీ మాటతో ఆ ధైర్యం కూడా పోయింది అని నారాయణ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. నారాయణ బాధని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడతారు.

నారాయణ మాటకు కొడుకులు కన్నీళ్లు..

నువ్వు లేకుండా మేము ఎలా ఉంటాం అన్నయ్య ఆలోచించుకుంటున్న వాళ్ళ ఎలా వెళ్ళిపోతావు అని అందరూ బాధపడడం చూసి మాధవ్ కూడా బాధపడిపోతాడు. ఈ ఎపిసోడ్ కి అన్నదమ్ముల సెంటిమెంట్ సీను ప్రేక్షకులను కంటతడి పెట్టించేస్తుంది. ఇలా మాధవ్ మాటలు విన్న తమ్ముళ్లు కూడా మా అన్నయ్య మనసు ఎంత మంచిదో మాకోసం అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయాడు అని అందరూ అనుకుంటారు. ఇక అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్ తో ఈ ఎపిసోడ్ మాత్రం ప్రతి ఒక్కరిని కదిలించివేసింది. ఇలాంటి అన్నదమ్ములు ఈ రోజుల్లో ఉంటారా అన్న ఆలోచనలోకి జనాలని తీసుకెళ్లింది ఈ సీరియల్. కొంచమైనా మేము గుర్తుకు రాలేదా మీ స్వార్థం మీరు చూసుకొని వెళ్ళిపోతారా అని మహాలక్ష్మి అడుగుతుంది. నువ్వు లేని ఒక్క రాత్రి నేను ఎంత భయపడ్డాను బాధపడ్డాను మీకు తెలుసా? నా తండ్రి మరోసారి మిస్ అయ్యాడు అని నా నుంచి దూరమయ్యాడు అని బాధపడ్డాను. మీరు ఎప్పుడు ఇలాంటి తప్పు చెయ్యొద్దు పెద్ది.

మనీషాల మారిన చక్రీ..

Advertisement

పెద్ధి వెళ్ళిపోయి వచ్చాడు కదా ఇప్పుడు ఉండడం ఎందుకు సరదాగా ఉంటే బాగుంటుంది.. ఇప్పుడు పెద్ది వచ్చేసాడు. కాబట్టి మనం చాలా సంతోషంగా ఉండాలి అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే.. అందరూ మాత్రం తమ అన్నయ్య మళ్లీ ఎక్కడ వెళ్ళిపోతాడు అని కంగారు పడిపోతూ ఉంటారు.. ఎందుకు అందరూ ఇంత దిగులుగా ఉండాలి మీరు ఏదో ఒకటి చేసే అందరినీ ఈ మూడ్లోంచి బయటకు తీసుకురావచ్చు కదా అని మహాలక్ష్మి అంటుంది. చక్రి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని మనిషా లాగా ఒక చున్ని వేసుకొని చపాతీ కర్ర పట్టుకుని వస్తాడు. మనిషా చేసినట్లే చపాతీ చేసి అనడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా చక్రీని చూసి ఒక్కసారిగా నవ్వుతారు. అయితే చక్రి మనిషా లాగా మారడం చూసిన మాధవతో సహా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా ఉంటారు.

పెద్దిని ఇంట్లోనే పెట్టిన తమ్ముళ్లు..

ఉదయం లేవగానే కన్నా వదిన పెద్దన్న ఎక్కడికి వెళ్ళాడు అని వెతుకుతూ ఉంటారు. నేను వంటగదిలోనే ఉన్నాను రా నేను ఎక్కడికి వెళ్ళలేదు అని మాధవ్ చెప్పగానే.. నువ్వు ఎక్కడికో వెళ్లిపోయావని రాత్రంతా కళ్ళు తెరిచే చూస్తున్నాము.. అని మిగిలిన వాళ్ళందరూ కూడా అనడంతో మాధవ్ కోసం కన్నా అంతగా బాధపడిపోతున్నారని అనుకుంటారు. ఇక చక్రి వల్ల కూడా మాధవ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు అని మధ్యలో చూస్తున్నారు అని చెప్పగానే అందరూ బాధ పడిపోతూ ఉంటారు.. అప్పుడే కేశవా చక్రీ కూరగాయలు తీసుకొని లోపలికి వస్తారు. అసలు ఏమైంది. అసలు కూరగాయలు మీరెందుకు తెచ్చారురా పుచ్చులు సచ్చులు తెచ్చారని అనడంతో నువ్వు బయటికి వెళ్లి ఆడవాళ్ళతో ముచ్చట్లు పెట్టడం నాకు నచ్చలేదు అన్నయ్య అందుకే మేమే తీసుకొని వచ్చాము అని చెప్తారు. అంతే కాదు తాయారు వచ్చిందన్న విషయాన్ని కూడా చెప్పడంతో మాధవ్ మీద మొత్తం ఉన్న అభిమానం అలాంటిది అని మహాలక్ష్మి అంటుంది..

మాధవ్ కోసం చక్రీ నిర్ణయం..?

Advertisement

నువ్వు ఈ జాతకం చూసి బాధ పడిపోతున్నావ్ కదా అన్నయ్య నీకోసం నేను పదిమంది జ్యోతిష్యులు తీసుకొని వస్తాను. వాళ్ళు ఏం చెప్తారో చూసి వాళ్ళ మాట ప్రకారం చేద్దాము అని మాధవతో చక్రి అనగానే సరే అని అంటాడు చక్రి. ఇక మాధవ్ కోసం ఉదయం లేవగానే వరుసగా జ్యోతిష్యులను తీసుకొని వస్తాడు చక్రి.. వాళ్ళందరూ కూడా మాతో జాతకం చూసి అతని దోషం ఏమీ లేదు చాలా మంచి జాతకం మీరేమీ కంగారు పడకండి కానీ మీ నాన్నగారి వల్లే అతని జాతకంలో దోషం వచ్చింది అని చెప్తారు ఒక ముక్కు తీర్చుకుంటే ఆ దోషం పోతుంది అని చెప్పగానే ముందుగా అందరూ సంతోషపడిన ఆ తర్వాత నారాయణ మాత్రం ఆ మొక్క గురించి ఆలోచించి భయపడి పోతాడు.. ఆ ఊరిలో తీసుకోవాల్సిన మొక్కు గురించి తనలో తానే ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటాడు నారాయణని చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైంది అని అనుకుంటారు. ఆ ఊరు గురించి తెలుసుకున్న నారాయణ ఒక్కసారిగా భయపడిపోతాడు. ఆ ఊరికి అంటే కష్టం అని అనుకుంటాడు. నారాయణని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైందో అని కంగారు పడతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన విశ్వం.. భద్రకు నిజం చెప్పిన వల్లి..ప్రేమ, ధీరజ్ కలుస్తారా..?

Related News

యష్మీ గౌడ నెలకు అంత సంపాదిస్తుందా? సీరియల్స్ గుడ్ బై చెప్పేస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం బాధపడ్డ రోహిణి.. మనోజ్ దెబ్బకు కానిస్టేబుల్ షాక్.. బాలు ఎంతైనా గ్రేట్ అబ్బా..

Karthika Deepam 2 Serial Today Episode August 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు షాక్ ఇచ్చిన జ్యోత్స్న   

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను రెచ్చగొట్టిన విశ్వం.. భద్రకు నిజం చెప్పిన వల్లి..ప్రేమ, ధీరజ్ కలుస్తారా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. అశ్విన్ దెబ్బకు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today Episode August 10th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీని అవమానించిన పెళ్లి వాళ్లు   

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ హీరో.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్..!

Big Stories

Advertisement
×