Big Blow For Usman Tariq : ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ ( The Hundred Men’s Competition 2026 ) ఉత్కంఠ భరితంగా సాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లకు అడుగడుగున అవమానాలే ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ ప్లేయర్లను అసలు మనుషులుగా కూడా చూడడం లేదు ది 100 లీగ్ టోర్నమెంట్ లో ఆడే క్రికెటర్లు. ఇప్పటికే కావ్య పాప ఏది కోరి కొనుగోలు చేసిన అబ్రార్ అహ్మద్ కు సరిగ్గా బౌలింగ్ ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ లీడ్స్ జట్టులో అవమానాల భరించుకుంటూ అబ్రార్ అహ్మద్ ముందుకు వెళుతున్నాడు.
ఇక లేటెస్ట్ గా ఇదే పరిస్థితిని పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usman Tariq) కూడా ఫేస్ చేస్తున్నాడు. ఆదివారం రోజున లండన్ స్పిరిట్ వర్సెస్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ (London Spirit vs Birmingham Phoenix ) జట్ల మధ్య 28వ మ్యాచ్ జరగగా.. సరైన సమయంలో ఉస్మాన్ తారిక్ కు బౌలింగ్ ఇవ్వకుండా కెప్టెన్ డోనోవన్ ఫెరీరా ( Donovan Ferreira ) పరువు తీశాడు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇక ఈ సంఘటనపై నేపథ్యంలో కెప్టెన్ డోనోవన్ ఫెరీరాపై సీరియస్ అవుతున్నారు పాక్ ఫ్యాన్స్.
ది హండ్రెడ్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( The Hundred Men’s Competition 2026 ) భాగంగా లండన్ స్పిరిట్ వర్సెస్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ (London Spirit vs Birmingham Phoenix ) మధ్య నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో లండన్ స్పిరిట్స్ అద్భుతంగా ప్రాణించి 7 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఉస్మాన్ తారిక్ కు ( Usman Tariq) సరైన సమయంలో బౌలింగ్ ఇవ్వలేదని విమర్శలు వస్తున్నాయి. లివింగ్ స్టోన్ ( Livingston) అలాగే డెవాల్డ్ బ్రెవిస్ ( Dewald Brevis ) ఇద్దరు అర్ధ సెంచరీలు చేసి మ్యాచ్ గెలిపించారు. ఈ ఇద్దరికీ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేసి.. ముప్పతిప్పలు పెట్టాడు. ఇతని బౌలింగ్ లో 14 బంతులు ఎదుర్కొన్న డెవాల్డ్ బ్రెవిస్, లివింగ్ స్టోన్ కేవలం ఏడు పరుగులు మాత్రమే సాధించారు.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు
50 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. మిగిలిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు బౌలర్లు 47 బంతులు సందిస్తే… ఇద్దరు క్రికెటర్లు 114 పరుగులు సాధించారు. అంత పొదుపుగా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేశాడు. అయితే ఉస్మాన్ తారిక్ ను సరైన సమయంలో కెప్టెన్ డోనోవన్ ఫెరీరా ( Donovan Ferreira ) బౌలింగ్ చేయించలేదు. ఈ క్రమంలోనే బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు ఓడిపోయింది. ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ క్రికెటర్లను ఎవరు పట్టించుకోవడంలేదని.. సరిగ్గా బౌలింగ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.