E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode August 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు షాక్ ఇచ్చిన జ్యోత్స్న   

Karthika Deepam 2 Serial Today Episode August 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో వాళ్లకు షాక్ ఇచ్చిన జ్యోత్స్న   
Advertisement

Karthika Deepam 2 serial today Episode: కాంచన, శ్రీధర్‌, కార్తీక్‌, దీప ఇంట్లో కూర్చుని సూరజ్‌, జ్యోత్స్నల పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా సరే సూరజ్‌, జ్యోత్స్నలను కలిపే బాధ్యత తమదే అంటాడు కార్తీక్‌.. అవును అంటుంది దీప. ఇంతలో ఒకసారి సూరజ్‌కు కాల్ చేయాలి అంటూ దీప కాల్‌ చేస్తుంది. జ్యోత్స్నతో పెళ్లి గురించి నువ్వు ఊహించలేదు కదా అని అడిగితే… సూరజ్‌ అవునంటాడు. నువ్వు రిజెక్ట్‌ చేస్తావని కూడా మేము ఊహించలేదు.. కానీ నువ్వు అవుట్‌ హౌస్‌కు పరిమితం కావొద్దు ఆఫీసుకు రావాలి. నీకో మంచి భవిష్యత్తు ఉంది. పర్సనల్‌ విషయాలు నేను మాట్లాడను కానీ నువ్వు మాత్రం నేను సీఈవోగా ఉన్నంత కాలం కలిసి పని చేయాలి ఇది నీ వదినగా నేను వేస్తున్న ఆర్డర్‌ అంటూ చెప్పగానే..

వదిన నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదా..? అనగానే.. భలేవాడివే మరిది జ్యోత్స్న లాంటి వారినే ఒక ఆట ఆడుకునే నిన్ను నేను ఆట పట్టిస్తానా..? అంటుంది దీప. దీంతో సూరజ్‌ నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు వదిన అనగానే.. ఇంకేం ఆలోచించకుండా భోజనం చేసి పడుకో.. ఉదయమే ఆఫీసుకు రావాలి అక్కడ మిగతా విషయాలు మాట్లాడుకుందాం అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. వదిన కోసమైన నేను ఆఫీసుకు వెళ్లాలి అని సూరజ్‌ డిసైడ్‌ అవుతాడు.

Advertisement

తనను రిజెక్ట్‌ చేసిన సూరజ్‌ మాటలే మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని బాధపడుతుంటుంది జ్యోత్స్న. సూరజ్‌ వెళ్లి ఏంటి ఇక్కడ కూర్చున్నావు అని అడగ్గానే.. నా ముఖం నీకు ఇప్పుడు చూడాలి అనిపించిందా..? అని అడగ్గానే.. కళ్లేంటి చింతనిప్పుల్లా ఉన్నాయి.. మామూలుగా అయితే జరిగిన దానికి నువ్వు ఈ పాటికి అవుట్‌ హౌస్‌ మీద దండయాత్ర చేయాల్సింది. కానీ అలా జరగలేదు అంటే ఏదో జరుగుతుంది అంటూ సూరజ్‌ అడగ్గానే.. ఇంకా నువ్వు ఇక్కడే ఎందుకు ఉన్నావురా అంటూ జ్యోత్స్న తిడుతుంది. మీ అమ్మ చెప్పిన మాటలు గుర్తులేవా..? అందుకే ఇక్కడే ఉండిపోయాను అని చెప్తాడు సూరజ్‌. నేను రిజెక్ట్‌ చేశాను అని చెప్పగానే.. నువ్వు కూడా నన్ను రిజెక్ట్‌ చేయోచ్చు కానీ అలా చేయలేదంటే.. మనసులో ఇంకేదో ఉన్నట్టుంది అంటాడు సూరజ్‌. అందుకు జ్యోత్స్న కోపంగా సూరజ్‌ను తిడుతుంది.

కార్తీక్‌ దగ్గరకు వెల్లిన దీప ఇంత జరిగాక మనకే ఇలా ఉంటే జ్యోత్స్న, సూరజ్‌ లకు ఎలా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. అందుకే సూరజ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాను.. రేపటి నుంచి ఆఫీసుకు రమ్మని చెప్పాను అంటూ జ్యోత్స్నకు కాల్‌ చేయమని చెప్తుంది. కార్తీక్‌ కాల్‌ చేస్తే జ్యోత్స్న కట్‌ చేస్తుంది. ఇప్పుడు నా ఫోన్‌ నుంచి చేస్తే లిఫ్ట్‌ చేస్తుంది చూడు అంటూ దీప కాల్‌ చేయగానే.. జ్యోత్స్న లిఫ్ట్‌ చేస్తుంది. ఏంటో చెప్పు అని అడగ్గానే.. దీప చూశావా బావ నా ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది అనగానే.. అయితే నా మీద కోపం బాగా ఉన్నట్టుంది అంటాడు కార్తీక్‌. దీంతో ఇద్దరి మధ్య సూరజ్‌ గురించి పెళ్లి గురించి చర్చ జరుగుతుంది. జ్యోత్స్న కోపంగా దీపను సూరజ్‌ను తిట్టి కాల్‌ కట్‌ చేస్తుంది.

Advertisement

తర్వాతి రోజు జ్యోత్స్నను తీసుకుని ఆఫీసుకు వెళ్లడానికి ఇంటికి వెళ్తారు కార్తీక్‌, దీప. జ్యోత్స్న శారీ కట్టుకుని చాలా పద్దతిగా కిందకు వస్తుంది. జ్యోత్స్నను చూసిన సుమిత్ర చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇవాళ సూరజ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికే రెడీ అయి వస్తుందేమో అనుకుంటుంది. ఇంతలో కిందకు వచ్చిన జ్యోత్స్న తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది. సూరజ్‌ను చేసుకోవడం ఇష్టం లేదా అని సుమిత్ర అడిగితే అసలు పెళ్లే చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుంది. ఆ మాటలకు అందరూ షాక్ అవుతారు. ఎవరేం చెప్పినా వినకుండా తనకు నచ్చినట్టు తనను బతకనివ్వమని జ్యోత్స్న చెప్తుంది. ఆస్థులు అంతస్తులు వద్దని.. ఆఫీసులో తనకు ఇచ్చిన జాబ్‌ చేస్తానని ఇక మీదట ఇలాగే ఉంటానని పాత జ్యోత్స్న ఇక లేదని వెళ్లిపోతుంటే.. పారిజాతం వెళ్లి ఆపబోతుంటే.. ఆఫీసుకు టైం అవుతుందని వెళ్లిపోతుంది. సుమిత్ర, శివనారాయణ షాక్‌ అవుతారు జ్యోత్స్న ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందని కంగారుపడతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

బిగ్ బాస్10 లోకి ముగ్గురు వైల్డ్ కార్డు ఎంట్రీస్.. వచ్చి రావడంతోనే గొడవలు!

గుప్పెడంత మనసు జగతి మేడం కొత్త రూట్.. ఫీజు మాత్రం చాలా తక్కువ!

పాట అంటే ఇదిరా సామి.. ‘సువ్వి సువ్వి’ రీక్రియేషన్ చూసి తీరాల్సిందే!

కడుపునిండా తిండి పెట్టి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

జబర్దస్త్ లో ఉన్న ఎవరికి కామెడీ రాదు..కమెడియన్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ ఆదిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కృష్ణుడు..వ్యూస్ కోసమే అంటూ!

బిగ్ బాస్ రివ్యూయర్ గా మారిన ప్రభాకర్… సృష్టి పై ప్రశంశలు!

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

Big Stories

Advertisement
×