Intinti Ramayanam Today Episode june 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. కమల్ ను కూల్ చేయకుంటే నా ప్లాన్ అంతా వేస్ట్ అవుతుందని పల్లవి ఫీల్ అవుతుంది. ఎలాగైనా ఈ తింగరోడిని కూల్ చేయాలి తన మాయలో వేసుకోవాలని పల్లవి రొమాంటిక్ యాంగిల్ లోకి తీసుకెళ్తుంది. ఇక కమల్ కోపం మొత్తం పోతుంది. ఇద్దరు కలిసి సరదాగా సరసాలు ఆడుకుంటుంటే భానుమతి కూడా అక్కడికి వచ్చి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. నా భర్త కూడా నాకోసం వస్తే బాగుండు ఒక ముద్దు ఇచ్చి వెళ్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటుంది. కమల్ ను రొమాన్స్ తో కూల్ చేస్తుంది పల్లవి.. భానుమతి సిగ్గు పడుతుంది. ఇంట్లో పెత్తనం ఎలాగైనా నా గుప్పెట్లోకి రావాలని శ్రీయ అనుకుంటుంది. శ్రీకర్ తో గొడవ పడుతుంది. ఇంట్లో రెండో కోడలుగా పెత్తనం నాదే ఉండాలి అని శ్రియ అనుకుంటుంది. ఈ విషయాన్ని పార్వతితో తేల్చుకోవాలని ఫిక్స్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. భానుమతి పార్వతిని పిలుస్తుంది. అటు పార్వతి శ్రీయా అని పిలుస్తుంది. అతను ఆరోగ్య సమస్య సరిగ్గా లేకపోవడంతోనే ఇక్కడ మానేసాడు అమ్మ తన కూతురు పెళ్లి దీక్ష చేసుకున్నాడు. తనకి పల్లవి దగ్గర తాళాలు తీసుకుని ఒక 50,000 తీసుకొచ్చి ఇవ్వు అని అంటుంది. అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవి తాళాలు అతనికొక 50 వేలు ఇవ్వాలంటే తెచ్చిస్తాను అని శ్రియ అడుగుతుంది. ఇంకెందుకమ్మా పల్లవి వచ్చింది కదా పల్లవిని తీసుకొచ్చిందిలే అని పార్వతి అంటుంది.. మీకు పల్లవి అంటేనే ఇష్టం కదా అత్తయ్య ఎందుకంటే ఆమె మేనకోడలు కాబట్టి ఇంత పక్షపాతం చూపిస్తున్నారు..
అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది. అవని యొక్క తర్వాత నిండా కోడలుగా ఆ హక్కులన్నీ నాకే ఉంటాయి కదా అత్తయ్య మరి మీరు ఎందుకు పల్లవిని పెత్తనం చెలాయించమని చెప్తున్నారు అని శ్రేయ అడుగుతుంది. ఇప్పుడు ఇదంతా గోడవెందుకమ్మా.. పల్లవి శ్రీయా అన్నది కూడా నిజమే కదా.. నువ్వు నా మేనకోడలు కాబట్టే నీకు పెత్తనం ఇచ్చానని అనుకుంటుంది ఆ తాళలేవో శ్రియాకి ఇచ్చేయమ్మా అనేసి పల్లవి కే షాక్ ఇస్తుంది పార్వతి.. ఇక శ్రేయ కి పల్లవి తాళాలు ఇచ్చేస్తుంది.
పెత్తనం చేతికొచ్చిన సంతోషంలో శ్రేయ పార్వతి అడిగిన డబ్బులను ఇవ్వడానికి లాకర్ దగ్గరకు వెళ్లి సంతోష్ పడుతూ డబ్బులు ఇస్తూ ఉంటుంది అప్పుడే పల్లవి అక్కడికి వస్తుంది.. తాళాలు నీ చేతికి వచ్చాయని నువ్వు సంతోషపడుతున్నావ్ అంతవరకే ఉండు నా మీద పెత్తనం చెలాయించాలని చూసావనుకో.. అసలు నువ్వే ఉండవు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.. నీకోసం మీ నాన్న సపోర్ట్ చేస్తూ మాట్లాడడంటే మీరు ఇద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నారని అర్థమైంది.. అర్థమైంది కదా ఇక మీద నుంచి నాతో జాగ్రత్తగా ఉండు లేదంటే మాత్రం నీ అకౌంట్ కూడా క్లోజ్ అవుతుంది అని పల్లవి అంటుంది.
ఇక రాజేంద్రప్రసాద్ తన ఆఫీస్ కి అవని తీసుకుని వెళ్తాడు. అది చూసిన అవని ఇది మీ ఆఫీస్ కదా మామయ్య ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆయన తిడతాడు. నా జాబు అవ్వడానికి కారణం ఆయనేని అడగడానికి నేను మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను అని అనుకుంటాడు. ఎందుకు తీసుకొచ్చారు మావయ్య అని అవని అడుగుతుంది. నువ్వు జాబ్ చేయాల్సింది ఇక్కడే అమ్మ పదా లోపలికి అనేసి అంటాడు.. లోపలికి వెళ్ళగానే అక్షయ్ అవని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకు జాబు లేవు కదా అని అనగానే రాజేంద్రప్రసాద్ అవని ఇక్కడే జాబ్ చేస్తుంది. ఈ కంపెనీ సీఈఓ గా నేను అవినీకి జాబ్ ఇస్తున్నాను అనేసి అంటాడు.
ఇక్కడ జాబ్ చేయడానికి జాబు లేని ఖాళీ లేవు ఇక్కడ ఏం జాబ్ చేస్తుంది అవని అనేసి అక్షయ్ సీరియస్ అవుతాడు. అవని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇక్కడే జాబ్ చేస్తుందని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఆ మాట వినగానే అక్షయ్ సీరియస్ అవుతాడు.. ఈ జాబ్ చేయడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి అవినీకి ఏ అర్హతలు ఉన్నాయని మీరు ఈ జాబ్ ఇస్తున్నారు అని అక్షయ్ అడుగుతాడు. దానికి అవని, అక్షయ్ ల మధ్య పెద్ద మాటల యుద్ధం జరుగుతుంది..
ఇక అవని కంపెనీ గురించి గొప్పదిప్పుకోకుండా అన్ని చెప్పేసి అక్షయ్కి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. ఇక అక్షయ్కి మూడు చెరువుల నీళ్లు తాగించింది కదా అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. ఈ ఆఫీసులో నీకెంత అర్హతుందో అవినీతి అంతే అర్హత ఉంది. కాకపోతే రెండు విషయాల్లో మాత్రం నీ కన్నా ఎక్కువ అర్హత ఉంటుంది. అంటే నా ప్లేస్ ని అవని రీప్లేస్ చేస్తుంది. ఈరోజు నుంచి ఈ చాంబర్లోని నీ పక్కనే తాను కూడా కూర్చుంటుంది. అవని ఈ కంపెనీలో పని చేయడానికి అన్ని హక్కులను తీసుకున్నాను. అందరూ పర్మిషన్ ఇచ్చారు. మొత్తానికి రాజేంద్రప్రసాద్ అక్షయ్ కు షాకిచ్చేలా అవనిని ఆఫీస్లో జాయిన్ చేసేస్తాడు.
ఆ మాట వినగానే అక్షయ్ ఈమె సీటు నా పక్కనే ఎందుకు ఆఫీసులో ఇన్ని రూములు ఉండగా అనగానే.. రాజేంద్రప్రసాద్ ఆఫీసులో నీతోపాటి సమాన హక్కులున్నా ఈవిడ ఇక్కడే కూర్చోవాలి అని ఆర్డర్ వేస్తాడు. అవనీకి రాజేంద్రప్రసాద్ ఆల్ ది బెస్ట్ వెళ్ళిపోతాడు. శ్రేయ పల్లవి ఇచ్చిన వార్నింగ్ ని తలుచుకొని కోపంగా ఉంటుంది. ఈరోజు పల్లవి విషయాన్నీ ఎలాగైనా తేల్చుకోవాలని అత్తయ్య గారిని అడగాల్సిందేనని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది శ్రియ.. పార్వతీ ఎంత చెప్పినా కూడా శ్రేయ వినకుండా గొడవ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..