Intinti Ramayanam Today Episode March 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఇంకా కిందికి రాకపోవడంతో అక్షయ్ నేను వెళ్లి చెల్లిని ఇక్కడ తీసుకొస్తాను అమ్మని పైకి వెళ్తాడు. అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రణతి ఎక్కడ అవతల ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది కానీ నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావని అక్షయ్ అడుగుతాడు. ఆ లెటర్ ని చూసి అక్షయ్ షాక్ అవుతాడు. ప్రణతి ఇలా చేసిందని తెలిస్తే నాన్నగారు ఏమైపోతారు అని అక్షయ్ బాధపడుతూ ఉంటాడు అప్పుడే శ్రియ నేను వెళ్లేసి వస్తాను అని పైకి వెళుతుంది. ప్రణతిని తీసుకురమ్మంటే మీరు ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు ప్రణతి ఎక్కడుంది వాష్ రూమ్ లో ఉందా అని శ్రీయా అడుగుతుంది కానీ ఆ లెటర్ ని చూసి షాక్ అవుతుంది.. అయితే వీళ్ళు ముగ్గురు టెన్షన్ పడుతుంటే పల్లవి వచ్చి ఏమైంది లెటర్ రాసిపెట్టి ఎక్కడికైనా వెళ్లిందా ఏంటి ? అంతగా షాక్ అయ్యారు అక్కడి కింద పంతులుగారు తొందర పెడుతున్నారు అనేసి పల్లవి అంటుంది. ప్రణతి వెళ్ళిపోయిన విషయాన్ని పల్లవి అందరికి చెప్తుంది. పెళ్లివాళ్ళు దారుణంగా తిడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. పెళ్లి జరుగుతుండగా ప్రణతి లెటర్ రాసిపెట్టి వెళ్లడం తో పెళ్లి ఆగిపోతుంది. దానికి ఇంట్లో అందరు ప్రణతి ఎక్కడికి వెళ్ళిపోయిందని టెన్షన్ పడుతుంటారు. శ్రీకర్ కమల్ మాత్రం ప్రణతిని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ప్రణతి కనిపించలేదు. పల్లవి ఇదే అదును చూసుకొని అవని పై నిందలు వస్తుంది. ఇదంతా చేసింది అవనినే అంటూ దారుణంగా అవమానిస్తుంది.. ఎందుకు అక్క ఇలా చేయవల్లే ప్రణతి ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి పంపించవచ్చు చెప్పు నీ వల్లే పరువు పోయింది.. నువ్వు కాకపోతే ఇంకెవరు ప్రణతిని బయటకు పంపిస్తారు మొన్న ఏం చేసినందుకు వచ్చి ఇది చేశా వు మళ్ళీ పెళ్లి ఆపేసి మావయ్య గారికి పెళ్లి పరువునే తీసేసావ్ అనేసి అంటుంది. శ్రీయ, పార్వతి కూడా దారుణంగా మాట్లాడటంతో అవని ఏం మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. అటు అక్షయ్ మాత్రం అందరిని దారుణంగా తిడతాడు.
ప్రణతి లెటర్ ఆసిపెట్టి వెళ్ళిపోయింది దానికి అవనికి ఏం సంబంధం ఉందని మీరు అవని అంటున్నారు నా భార్య మీద నీకు అనే హక్కు ఎవరు ఇచ్చారు ఎవరైనా ఏదైనా అంటే నేను అసలు ఊరుకోను. అవని ఎవరైనా అన్నారనుకో వయసుతో సంబంధం లేకుండా అందరిని అన్నాల్సి వస్తుంది. నా భార్యను ఒక్క మాట అంటే నేను పడను అని అక్షయ్ అంటాడు. అక్షయ్ మాటలు విని పల్లవి నోరు మూసుకుంటుంది. ఇక ఇంట్లోనే వాళ్ళందరూ అవన్నీ అనడం మానేసి ప్రణతి ఎక్కడికి వెళ్లాను అని టెన్షన్ పడుతుంటారు..
ప్రణతి ఎక్కడికి వెళ్ళింది అసలు ఎవరిని ప్రేమించింది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అదే అక్షయ్ ప్రణతిని వెతకడానికి బయటకు వెళ్తాడు.. ప్రణతి కోసం ఊరంతా గాలిస్తారు.. అక్షయ్ ప్రణతి ఎక్కడుందన్న విషయం తెలీదు ఇక తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లోకి రాగానే కమ్మలు శ్రీకర్ ప్రణతి కనిపించిందా అని అడుగుతారు కానీ అక్షయ మాత్రం ప్రతీ నాకు ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్లిందో తెలియట్లేదు నాకు తెలిసిన వాళ్ళందరూ దగ్గర ఆరా తీశాను కానీ తనకి మాత్రం కనిపించలేదు అదే అందరితో చెప్తాడు.
ఇక అవని అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. అవధించేసిన కమల్ వదిన ప్రణతి దొరికిందా అనే అడుగుతాడు. అప్పుడే ప్రణతి అవని వెనకనుంచి పక్కకు వస్తుంది. ప్రణతిని చూసి అందరూ సంతోషపడతారు. కానీ ఒక్కసారిగా తన మెడలో పూల దండను చూసి షాక్ అవుతారు. అంతేకాదు ప్రణతితో పాటు భరత్ కూడా రావడంతో అందరు షాక్ అవుతారు. పార్వతి ఏవండీ ఒకసారి ప్రగతి వచ్చిందో చూడండి అని అంటుంది. తన పెళ్లి చేసుకోవడం చూసి రాజేంద్రప్రసాద్ షాక్ అవుతాడు. ఏమైంది ఎందుకు ఇలా చేసావని అందరూ అడుగుతారు.
పనీపాట లేదా ఈ పోరంబోకుని నువ్వు పెళ్లి చేసుకున్నావా అని ప్రణతిని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.. ఇక భరత్ ను కొట్టే ప్రయత్నం చేస్తారు.. ప్రణతి చాలా మంచిది వీడే ఏదో మాయ చేసి ప్రణతిని ప్రేమ అని ఆస్తి కోసం తన్నేసాడు అసలు ఇలాంటి వాడిని దగ్గరికి రానివ్వకూడదు ముందు ఆ తాలుపించి బయటికి పంపించాలని అందరూ అంటారు . కానీ ప్రణతి మాత్రం నాకు పెళ్లయింది అతను నా భర్త మీకు అతని మీద ఎటువంటి అధికారం లేదు అంటూ అందరికీ షాప్ ఇస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..