BigTV English

Maharashtra Crime News: భార్యను ముక్కలు చేసి.. ట్రావెల్ బ్యాగ్‌లో పుర్రె, మహారాష్ట్రలో ఘోరం

Maharashtra Crime News: భార్యను ముక్కలు చేసి.. ట్రావెల్ బ్యాగ్‌లో పుర్రె, మహారాష్ట్రలో ఘోరం
Advertisement

Maharashtra Crime News: ఈ మధ్యకాలంలో హత్యలు దారుణంగా జరుగుతున్నాయి. భార్యని భర్త హత్య చేయడం గానీ, లేదంటే భర్తని భార్య చంపేసిన ఘటనలు పెరుగుతున్నాయి. క్షణికావేశంలో పట్టుదలకు మొండి పట్టుదలకు పోయి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. లేటెస్ట్‌గా మహారాష్ట్రలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్దాం.


అసలేం జరిగింది?

ముంబై-అహ్మదాబాద్ నేషనల్ హైవే మండ్వి సమీపంలో ఓ ట్రావెల్ బ్యాగ్ కనిపించింది. కాసింత అనుమానంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తొలుత డౌట్ పడ్డారు. అందులో బాంబు ఏమైనా ఉందా అని కొంత సందేహం వ్యక్తంచేశారు. చివరకు ఓపెన్ చేయగా అందులో మనిషి పుర్రె కనిపించింది. దీంతో షాకవ్వడం పోలీసుల వంతైంది.


ట్రావెల్ బ్యాగ్‌లో పుర్రె దొరికిన తర్వాత పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో అనుమానంగా ఉన్న ముంబై శివార్లలో హరీష్ హిప్పార్గిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటపెట్టాడు నిందితుడు. విచిత్రం ఏంటంటే నిందితుడు మహిళ భర్త కూడా. అగ్నిసాక్షిగా కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. ఇంతకీ కారణాలేంటి?

పశ్చిమ బెంగాల్‌కు చెందిన హరిష్ హిప్పార్గి-ఉత్పల దంపతులు. వీరికి 22 ఏళ్ల కిందట మ్యారేజ్ జరిగింది. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంటున్నారు. ఈ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. హరిష్-ఉత్పల హిప్పార్గి నాలా సోపారా ఈస్ట్‌లోని రెహ్మాత్ నగర్‌లో ఉంటున్నారు. హరిష్ హిప్పార్గి ఇమిటేషన్ ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు.

ALSO READ: పెళ్లి సంబంధాలు.. వీడియోలు అడ్డం పెట్టి

భార్యభర్తల మధ్య వివాదం ఎక్కడ?

ఇంతవరకు బాగానే జరిగింది. అయితే కొడుకు పేరు విషయంలో భార్యభర్తల మధ్య విబేధాలు పొడ చూపాయి. రోజులు గడుస్తున్నా వీరి మధ్య వివాదం క్రమంగా ముదురుతోంది. కొడుకు పేరును హిప్పార్గిగా మార్చడానికి హరీష్ భార్య సిద్ధంగా లేదు.

ఈ సమస్యకు ఏదో విధంగా పుల్ స్టాప్ పెట్టాలని భావించాడు హరీష్. జనవరి 9న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హరీష్-ఉత్పల దంపతుల మధ్య తీవ్రమైన వాదన జరిగింది. పట్టరాని కోపంతో భార్య గొంతు నులిమి చంపేశాడు భర్త హరీష్. శవాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆమె తలను నరికి వేశాడు. ఆమె తల, కొన్ని వస్తువులను ట్రావెల్ బ్యాగ్‌లో ఉంచి ముంబై-అహ్మదాబాద్ హైవే వెంబడి మండ్వి సమీపంలో పారేశాడు.

శరీరాన్ని ముక్కలు చేసి సంచిలో ఉంచి విరార్ ఈస్ట్‌లోని రైల్వే ట్రాక్‌ల దగ్గర డ్రైన్‌లో వేసేశాడు. ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేశాడు హరీష్. తమను వదిలి తల్లి పశ్చిమ బెంగాల్‌లోని తన గ్రామానికి తిరిగి వెళ్లిందని కొడుకుకు చెప్పాడు కన్నతండ్రి.

దర్యాప్తు ఎలా సాగింది?

ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ పుర్రె దొరికింది. అందులో బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో ఒక ఆభరణాల దుకాణం పేరుతో పర్సును కనుగొన్నారు పోలీసులు. రెండు నెలలుగా మహిళ ఆమె నెంబర్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. హరీష్ హిప్పర్గి కూడా తన నెంబర్ స్విచ్ ఆఫ్ చేశాడు. ప్రస్తుతం ఉన్న ఇంటి నుంచి మరో ప్రాంతానికి మారిపోయాడు.

చివరకు పోలీసులకు లభించిన ఎవిడెన్స్ ఆధారంగా శుక్రవారం రాత్రి నల సోపారాలోని రహమత్ నగర్ ప్రాంతంలో హరీష్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఉత్పల శరీరం కోసం వెతుకుతున్నారు. నిందితుడ్ని న్యాయస్థానం హాజరుపరుస్తామని వెల్లడించారు పోలీసులు.

Related News

Army Major: ఆర్మీ విన్యాసాలు.. తెలుగు మేజర్ రోడ్డు ప్రమాదంలో మృతి

Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో చెలరేగిన మంటలు.. 15 మంది సజీవ దహనం

Hyderabad Crime: పిల్లలను చంపి.. బిల్డింగ్ పైనుండి దూకిన తల్లి, హైదరాబాద్‌లో దారుణం

UP Man hits train: బైక్‌పై రైల్వే ట్రాక్ దాటుతూ.. కిందపడ్డాడు, ఇంతలో దూసుకొచ్చిన రైలు, ఇదిగో వీడియో

Jagtial District: మా నాన్నను చంపేశారు.. భూమి లాక్కున్నారు, ప్రజావాణిలో చిన్నారుల ఆవేదన

Hyderabad News: హైదరాబాద్‌లో ఘోరం.. ఆరుగురు జువైనల్స్‌పై లైంగిక దాడి!

Kadapa Crime News: కడపలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి, అసలు సమస్య అదేనా?

Chirala Beach Accident: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం

Big Stories

×