Intinti Ramayanam Today Episode March 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతిని చూసి అందరూ సంతోషపడతారు. కానీ ఒక్కసారిగా తన మెడలో పూల దండను చూసి షాక్ అవుతారు. అంతేకాదు ప్రణతితో పాటు భరత్ కూడా రావడంతో అందరు షాక్ అవుతారు. పార్వతి ఏవండీ ఒకసారి చూడండి అని అంటుంది. పనీపాట లేదా ఈ పోరంబోకుని నువ్వు పెళ్లి చేసుకున్నావా అని ప్రణతిని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.. అవని నేను చెప్పేది ఒకసారి వినండి ఈ పెళ్లి ఎందుకు జరిగిందో ఒకసారి వింటే మీకే తెలుస్తుంది అని అనగానే కానీ ఎవరు వినరు అక్షయతో సహా అందరూ అవనీని అరుస్తారు. కానీ ప్రణతిని పార్వతి దారుణంగా కొడుతుంది.. అక్షయ్ నువ్వు ఎలాంటి దానివో అందరూ చెబుతున్న కూడా నేను నమ్మలేదు నీ గురించి నాకు తెలుసు అని అనుకున్నాను నీ మీద నాకు అలాంటి నమ్మకం ఉంది అని అనుకున్నాను. సీత రాముడి మధ్య నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళు దాంపత్యం ఇలా సాగింది అన్నావు కానీ మీ వల్ల నా కుటుంబం ఎన్నో అవమానం ఎదుర్కొంది అలాంటిది నిన్ను ఎలా క్షమిస్తానని అనుకున్నావ్ నా కళ్ళ ముందు ఉంటే నేను రాక్షసుల్లాగా మారిపోతానని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని దాచి పెట్టింది అవని. ప్రణతి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఎంత అడిగినా ఎవ్వరు తనని నమ్మరు. నువ్వే తప్పు చేశావు కావాలని నీ తమ్ముడికి ఇచ్చే పెళ్లి చేశావు అంటూ ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. అవని బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని తీసుకొని దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అవని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా అందరూ అన్ని మాటలు అంటున్నారు అవని ఒక్క మాట తిరిగి మాట్లాడితే ఎంత బాగుండేది. అందరూ నోరులు మూతపడే వెంటూ స్వరాజ్యం కూడా అవని తప్పు చేసింది అంటూ మాట్లాడుతుంది.
అక్షయ్ అవని ఇద్దరూ ప్రణతిని వెతుక్కుంటూ వెళ్లారు కదా దొరికితే ప్రణతిని వాళ్ళ ఇంట్లో అప్పగించి అవని వస్తుందిలే అని ఇద్దరు అనుకునే లోపల అవని ఆటోలో నుంచి దిగుతుంది వెనకాలే ప్రణతి భరత్ కూడా వస్తారు. ఈ అమ్మాయి ప్రణతి కదా ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని వెళ్ళింది కదా మరి ఎందుకు ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చింది ఈ అబ్బాయి ఎవరు అంటే ఈ అబ్బాయి నా తమ్ముడు భరత్ అంటే ఈ అబ్బాయిని ఈ ప్రణతి ప్రేమించిందని దయాకర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.
ఇప్పుడు అవన్నీ చెప్పే పరిస్థితుల్లో నేను లేను బాబాయ్ సమయం వచ్చినప్పుడు అన్ని మీకు వివరంగా చెప్తాను అసలు ఏం జరిగిందన్నది మీకు చెప్తానని అవని అంటుంది దానికి స్వరాజ్యం ఇప్పుడు మేము నిన్ను ఏమీ అడగను నువ్వు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పు అని అంటుంది. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్తుంది అవని తన బ్యాగ్ తో బయటికి వస్తుంది. అది చూసినా దయాకర్ స్వరాజ్యం ఇద్దరూ షాక్ అవుతారు. దంపతులకు హారతి ఇవ్వడానికి తీసుకురావడానికి లోపలికి వెళ్ళావేమో అని అనుకున్నాం ఇలా నీ బ్యాగు ని బయటకు తెచ్చుకుంటావా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను వదిలేస్తామా నీతో పాటు ఈ అమ్మాయి కూడా అండగా మేము ఉంటామని స్వరాజ్యం అంటుంది.
ఇక ప్రణతి భరత్ ని తీసుకుని అవని ఇంట్లోకి వెళుతుంది. నేను తప్పు చేశానా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది భరత్ ని నువ్వు చేసిన సాయం అంత కాదు నీలాంటి వాడు నాకు తమ్ముడు అవ్వడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అని అంటుంది అటు భరత్ కూడా నేను ఏమైపోయినా పర్లేదు కానీ నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకునే నీలాంటి అక్క దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు..
రాజేంద్రప్రసాద్ కూతురు వెళ్ళిపోయింది అన్న దిగులుతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అందరు ఓదారుస్తారు. అవని చేసిన పనికి ఇదంతా జరిగింది అని బాధపడుతూ ఉంటాడు అయితే పల్లవి కిందకి వచ్చి నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను అవన్నీ అక్క ఇలాంటిది అని. ఎవరు నమ్మలేదు అత్తయ్య ఎంత చెప్పినా కూడా ఎవరు వినలేదు అంటే ఆమెని గురించి మీరు అంత గుడ్డిగా నమ్మారు అని పల్లవి అంటుంది దాన్ని విన్న కమ్మలు వదిన గురించి ఒక్క మాట అన్న నేను ఊరుకోను అని చెయ్యెత్తుతాడు అప్పుడు అక్షయ్ కమల్ ని పట్టుకుంటాడు. కొట్టడమే పని గా ఉంటే నేనే కొట్టేవాడిని కదా అని అక్షయ్ అంటాడు. ఆమె చేస్తున్న మోసం గురించి మీకు ఎప్పటికీ అర్థం కాదు అనేసి పల్లవి వెళ్ళిపోతుంది.
ఇక అవని నిన్న ప్రణతి పెళ్లి కావడంతో ఆవేశంగా ఉన్నారు ఇప్పుడు ఆవేశం తగ్గింటది వాళ్లతో మాట్లాడాలి అసలు ఏంటన్న విషయం వాళ్లకి చెప్పాలి అని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళుతుంది కానీ పార్వతి మాటలు విని బయటనే ఆగిపోతుంది. శ్రీకర్ కమల్ ఇద్దరు కూడా వదిన ఏం చెప్పాలనుకునిందో వెంటనే కదా అసలు ఏమైందో అర్థం అవుతుంది అసలు ఎవరిది తప్పు అని తెలుస్తుంది అని అంటారు. ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..