Intinti Ramayanam Today Episode May 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ అవని దగ్గరికి వెళ్లడంతో అక్షయ్ కోపంతో అవనికి నోటీసులు పంపిస్తాడు. కూతుర్ని తనకు దూరం చేస్తుందంటూ ఆరోపిస్తూ కోర్టు నోటీసులు పంపిస్తాడు. ఆ నోటీసులు చూసి అవన్నీ షాక్ అవుతుంది. కోర్టులోనే ఏదైతే అది తేల్చుకుందాం అని రాజేంద్రప్రసాద్ ధైర్యం చెబుతాడు. తర్వాత రోజు ఉదయం రాజేంద్రప్రసాద్ తో పాటు అవని దయాకర్ ఫ్యామిలీ కూడా కోర్టుకు బయలుదేరుతుంది. అటు అక్షయ్ పార్వతీ వాళ్ళతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కోర్టు కొస్తారు. నీ గొడవలన్నీ ఎందుకండీ మన కుటుంబం పరువు పోతుంది అందరం కలిసి ఉందాం అండి అంటూ అవని కాళ్ళ వెళ్ళబడి బ్రతిమలాడుతుంది. పార్వతి మాత్రం అస్సలు కనికరించదు. కోర్టు బయట రెండు ఫ్యామిలీలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తారు. అవని పార్వతి కాళ్ళ మీద పడి అత్తయ్య నన్ను క్షమించండి. ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ నేను చేసిన చిన్న తప్పుని క్షమించండి అత్తయ్య అని పార్వతిని అడుగుతుంది. అప్పుడు చంపాలి అనుకున్నాం ఇప్పుడేమో కాళ్ళ మీద పడి నా ఇంట్లోకి మళ్లీ అడుగు పెట్టాలని ఆలోచిస్తున్నావా అని పార్వతి అంటుంది. ఎంతగా బ్రతిమలాడిన కూడా పార్వతి ఏదైతే అది అయింది కోర్టులోనే తేల్చుకుందామని లోపలికి వెళ్ళిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరాధ్య కోసం అవని అక్షయలు కోర్టు ఎక్కుతారు.. అక్షయ్ తరుపున లాయరు వాదనలు వినిపిస్తాడు.. అవని తరుపున శ్రీకర్ లాయర్ గా వస్తాడు. శ్రీకర్ని చూసి అందరూ షాక్ అవుతారు. అని శ్రీకర్ నువ్వేంటి ఇలా ఈ కేసు తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఎంత చెప్పినా కూడా కోర్టులోని లాయర్ ని పేరు పెట్టి పిలవడం బంధుత్వంతో పిలవడం తప్పు అనేసి అవనితో అంటాడు. జడ్జ్ కూడా లాయర్ గా నువ్వు ముందుకు రావడం సంతోషంగా ఉంది నీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను ప్రొసీడ్ అని చెప్పేసి అంటాడు..
జడ్జ్ మాత్రం శ్రీకర్ చెప్పిన మాటల్ని పరిగణలోకి తీసుకుంటాడు.. తల్లి గొప్పదనం గురించి శ్రీకర్ ఎంతో చక్కగా వర్ణిస్తాడు.. అది విన్న కుటుంబం కూడా తల్లి గొప్పతనం గురించి తెలుసుకుంటుంది.. తల్లిని బిడ్డకు దూరం చేయడం ఎంత పాపమో.. బిడ్డను తల్లి నుంచి వేరు చేయడం అంతే పాపమని శ్రీకర్ ఫైనల్ టచ్ ఇస్తాడు. తల్లి నుంచి బిడ్డను వేరు చేయాలో లేదో అనే నిర్ణయం మీకే వదిలేస్తున్నాను జడ్జిగారు మీరే ఈ నిర్ణయాన్ని ఫైనల్ చేయండి అని శ్రీకర్ అంటాడు.. శ్రీకర్ వాదనను విన్న జడ్జ్ తల్లిని బిడ్డ నుంచి వేరు చేయడం తప్పు మీరిద్దరూ కలిసి ఉండాలని ఆ బిడ్డ కోరుకుంటుంది అని అంటాడు.
ఆ విషయం గురించి ఆరాధ్యను జడ్జిగారు అడుగుతారు. అమ్మ ఆరాధ్య ఎవరి దగ్గర ఉంటావని చెప్పగానే నేను మా అమ్మ దగ్గరే ఉంటానని చెప్తుంది. ఆరాధ్య మాటలని పరిగణలోకి తీసుకున్న జడ్జ్ అవని దగ్గరే ఉండాలని చెప్తాడు. బిడ్డ బాధను చూసైనా మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నానని జడ్జ్ గారు తీర్పించి వెళ్లిపోతారు. ఆ తర్వాత రెండు కుటుంబాలు బయటికి వచ్చి మాటల యుద్ధం మొదలు పెడతారు. అమలు శ్రీకర్ అవని వదినకు న్యాయం జరిగిందంటూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక రాజేంద్రప్రసాద్ ఉదయం కోర్టులో జరిగిన విషయాలను గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయం అవని రోజులాగే ఆఫీస్ కెళ్ళి ఫ్లవర్స్ ని డెకరేట్ చేస్తూ ఉంటుంది.
అవనిని చూసిన అక్షయ్ విపరీతమైన కోపంతో అక్కడున్న పూలను కింద పడేస్తాడు. మనుషుల మీద ఉన్న కోపం వస్తువుల మీద ఎందుకు చూపిస్తారని అవని సీరియస్ అవుతుంది.. ఆ బిడ్డను నా నుంచి దూరం చేసావ్ ఆఖరికి నాకు కన్న తండ్రిని నా చెల్లిని కూడా నాకు కాకుండా చేశావు నీకు బంధువుల గురించి ఫ్యామిలీ గురించి ఏమాత్రం తెలియదు ఎందుకంటే నువ్వు ఒక అనాధవి అని దారుణంగా అవమానిస్తాడు. అక్షయ్ మాటలు విన్న అవని నేను అనాధనే.. విషయం మీకు తెలిసే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ రాజేంద్రప్రసాద్ కోసం దయాకర్ ఇంటికి వస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…