దుబాయ్ బుర్జ్ ఖలీఫా, అమెరికా ట్విన్ టవర్స్ మాదిరిగానే డచ్ ఆర్కిటెక్ సంస్థ MVRDV అద్భుతమైన రెండు ఆకాశహర్మ్యాల నిర్మాణానికి ప్లాన్ చేసింది. 2011లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో వీటిని ‘ది క్లౌడ్’ పేరుతో నిర్మించాలని నిర్ణయించింది. 2015 వరకు కంప్లీట్ చేయాలనుకుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత ఎత్తైన రెండు టవర్లను నిర్మించాలని భావించింది. ఈ ప్రాజెక్టును మల్టీ పర్పస్ యూసేజ్ కోసం ప్రతిపాదించింది. ఇందులో ఒక టవర్ 54 అంతస్తులలో 260 మీటర్లు, మరొకటి 60 అంతస్తులలో 300 మీటర్ల ఎత్తులో నిర్మించాలనుకుంది. నగర జీవనానికి అనుగుణంగా, అత్యంత విలాసవంతంగా వీటిని తీర్చిదిద్దాలనుకుంది. కానీ, కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టును రద్దు చేసుకుంది సదరు నిర్మాణ సంస్థ. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
లగ్జరీ రెసిడెన్షియల్ టవర్లుగా నిర్మించాలని నిర్ణయం
ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ కంపెనీ MVRDV సియోల్ లో లగ్జరీ రెసిడెన్షియల్ టవర్లును ప్రతిపాదించింది. ఈ రెండు టవర్లు ఒకదానితో మరొకటి కనెక్ట్ అయి ఉంటాయి. 260 మీటర్లు, 300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ టవర్ మధ్యలో అద్భుతమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పిక్సలేటెడ్ క్లౌడ్ ద్వారా ఈ టవర్లు అనుసంధానించబడేలా డిజూన్ చేశారు. ఈ రెండు టవర్లు మొత్తం 1, 28,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ టవర్లను నిర్మించాలనుకుంది.
సియోల్ నగరంలో నిర్మించేలా ప్రతిపాదన
సియోల్ ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో ఈ టవర్ ను నిర్మించాలని MVRDV సంస్థ నిర్ణయించింది. స్టూడియో లిబెస్‌కిండ్ ఈ ప్రాజెక్టుకు మాస్టర్ ప్లాన్ అందించింది. ఈ రెండు టవర్లలో సౌత్ టవర్ 54 అంతస్తులతో 260 మీటర్ల ఎత్తు ఉంటుంది. నార్త్ టవర్ 300 మీటర్ల ఎత్తులో 60 అంతస్తులతో ఉంటుంది. వీటి 27వ అంతస్తులో క్లౌడ్ డిజైన్ ఉంటుంది. 10 అంతస్తుల పొడవైన పిక్సలేటెడ్ వాల్యూమ్, రెండు టవర్లను కలుపుతుంది. సాధారణంగా ఒక ఎత్తైన భవనం చుట్టుపక్కల నగర జీవితానికి డిఫరెంట్ గా రూపొందిస్తారు. కానీ, ఈ టవర్లు పబ్లిక్ ప్రోగ్రామ్‌ను క్లౌడ్‌కి అనుసంధానించడం ద్వారా టైపోలాజీ నగరానికి మరింత సామాజికను యాడ్ చేస్తుంది. క్లౌడ్ లోపల 14,357 చదరపు మీటర్లలో స్కై లాంజ్, వెల్నెస్ సెంటర్, కాన్ఫరెన్స్ సెంటర్, ఫిట్ నెస్ స్టూడియో, పలు స్విమ్మింగ్ పూల్స్ , రెస్టారెంట్లు, కేఫ్‌లు ఉంటాయి. క్లౌడ్ మీద పబ్లిక్, ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి. డాబాలు, డెక్‌లు, గార్డెన్‌లు ఉంటాయి. ఈ క్లౌడ్ ను ప్రత్యేక ఎక్స్ ప్రెస్ ఎలివేటర్‌ల ద్వారా యాక్సెస్ చేసేలా డిజైన్ చేశారు. ఇందులో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు 80 చదరపు మీటర్ల నుంచి 260 చదరపు మీటర్ల వరకు ఉండేలా రూపొందించారు. వీటిలో కొన్ని డబుల్ హైట్ సీలింగ్‌లు, డాబాలు, తోటలను అందిస్తాయి. ఈ టవర్ లో ప్రతి అంతస్తుకు నాలుగు కార్నర్ అపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంటాయి. ప్రతి టవర్‌ను గ్రౌండ్ లెవెల్‌లో గ్రాండ్ లాబీ ద్వారా యాక్సెస్ చేసేలా డిజైన్ చేశారు. సౌత్ కొరియాలో నిర్మించాలనుకున్న ఈ టవర్ ప్రపంచంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుందని భావించారు.
ప్రజా వ్యతిరేకతతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు క్యాన్సిల్
నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణంగా ఉంటుందని భావించినా, ఈ క్లౌడ్ లాంటి నిర్మాణం 9/11 సమయంలో కూలిపోతున్న అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ల నుండి వచ్చే పొగను పోలి ఉంది. ఈ నిర్మాణం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ డిజైన్ నిజమైన మేఘం నుండి ప్రేరణ పొందిందని MVRDV సంస్థ చెప్పినప్పటికీ, ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. చివరకు ఈ ప్రాజెక్టు రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
Read Also: అమ్మో.. ఇండిగో క్యాబిన్ క్రూ సాలరీ అంతా? మీరు అస్సలు ఊహించి ఉండరు!