Intinti Ramayanam Today Episode May 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ ని చూసిన అవని రాజేంద్రప్రసాద్ అని పిలుస్తుంది.. ఏంటి ఇలా వచ్చావ్ ఏదైనా పని మీద వచ్చావా లేక ఏదైనా అనడానికి వచ్చావా అని రాజేంద్రప్రసాద్ అక్షయని అడుగుతాడు. ఫైల్ మీద మీరు అర్జెంటుగా చేయాల్సిన సంతకం ఒకటుంది. మీరు చేస్తేనే ఆ ప్రాజెక్టు మనకు వస్తుంది అని డాక్యుమెంట్స్ ఇస్తాడు. నీకు మీ అమ్మకు బానిసలా కనిపిస్తున్నానా..? నేను సంతకం పెట్టను. ఏదైతే అది అయింది అని రాజేంద్ర ప్రసాద్ తెగేసి చెప్పేస్తాడు. మనుషులు అవసరం లేదు గాని వాళ్ళ సంతకాలు అవసరం డబ్బే, మీ ప్రపంచం అని రాజేంద్రప్రసాద్ అడగని అక్షయ్ మీరు దీని మీద సంతకం చేయకపోతే కంపెనీ చాలా లాస్ అవుతుంది.150 కోట్లు ఈ ప్రాజెక్టు మీద మనకి వస్తుంది అని వివరిస్తాడు.
ఎంత చెప్పినా కూడా రాజేంద్రప్రసాద్ మాత్రం సంతకం పెట్టకుండా ఆ డాక్యుమెంట్స్ ని విస్తరి కొట్టేస్తాడు. అవని ఎంత చెప్పినా కూడా రాజేంద్రప్రసాద్ వినకుండా ఆ డాక్యుమెంట్స్ ని కింద పడేస్తాడు. అవని మాటలు నీకు అంతగా ఎక్కువైపోయాయి నాన్న నువ్వు కొడుకును కాదని ఇక్కడికి వచ్చేసావా ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదని అక్షయ్ అంటాడు. నువ్వు ఎన్ని చెప్పిన సరే నేను సంతకం పెట్టను గాక పెట్టను అని అంటాడు. మొత్తానికి అవని చెప్పడంతో రాజేంద్రప్రసాద్ దాంట్లో సంతకం పెడతాడు. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి అవని అక్షయ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఆరాధ్యని చూడటానికి దొంగలాగా అర్ధరాత్రి వస్తాడు. కానీ ఆరాధ్యను చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే అవనికి దొరుకుతాడు.. మీ కూతురిని మీరు చూడటానికి ఇలా దొంగలాగ రావాల్సిన అవసరం లేదు. మీ కూతురు మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు అని అవని అంటుంది. ఇక తర్వాత ఉదయం అవని ఆఫీస్ కెళ్ళి ఫ్లవర్స్ ని సర్దుతూ ఉంటుంది.. అప్పుడు అక్కడికి క్లైంట్స్ వస్తారు. ఈమె మీ ఆవిడే కదా అని అడుగుతారు. నేను వాళ్లతో పసుపుతో మాట్లాడాలని అక్షయ అంటే వాళ్ళు మాత్రం మీ ఆవిడే కదా అని ఉండనివ్వండి అని అంటారు.
మా నాన్నగారు సైన్ చేశారు ఇదిగోండి అని డాక్యుమెంట్ ఇస్తారు.. మీ నాన్నగారు సైన్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటారు. ఎందుకలా అడిగారని అక్షయ్ అడుగుతాడు. మీకు మీ నాన్నకు ఏవో డిస్టబెన్స్ లు ఉన్నాయి అని విన్నాము అందుకే సైన్ పెడతారా లేదా అని అనుకున్నాను. కానీ పెట్టేసారు గానీ అంటారు. నేను అడిగితే మా నాన్న సంతకం పెట్టుకున్న ఉంటారా అని అక్షయ్ గొప్పలు చెప్పుకుంటారు. పక్కనే ఉన్న అవని నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని అక్షయ్ అడుగుతాడు. నేను నీకు ప్రాజెక్ట్ ఓకే అయినందుకు సంతోషంగా ఉన్నాను అందుకే నవ్వాను అని అవని కవర్ చేసుకుంటుంది.
ఆరాధ్య కోసం అవని స్కూలుకు వెళుతుంది. స్కూల్లో ఈవెంట్ కోసం పేరెంట్స్ రావాలని టీచర్ చెప్పిన విషయాన్ని గుర్తుతెచ్చుకుంటుంది.. అలాగే తన ఫ్రెండ్స్ తనని ఎగతాళి చేసిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ అవని దగ్గరకు వస్తుంది. అప్పుడే అక్షయ కూడా అక్కడికి వస్తాడు. ఆరాధ్య నాన్న వచ్చారమ్మా అని అనగానే అవని వెళ్లి మాట్లాడే శ్రమ అని చెప్తుంది. అక్షయ్ మాత్రం అవనికి షాక్ ఇచ్చి ఆరాధ్యను అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోతాడు. అవని మాత్రం టెన్షన్ పడుతూ ఆరా తిని ఎక్కడికి తీసుకెళ్లారంటూ ఇంటికి వస్తుంది.
అప్పుడే పార్వతి, పల్లవి, శ్రీయా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లి నా కూతురు ఎక్కడా అని అడుగుతుంది. అవని మాటలు విన్న పల్లవి శ్రియాలు మాట్లాడుతూ ఉంటే మీరిద్దరూ మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఈ అబ్బాయి నా కూతురు తీసుకొని వచ్చారు మాట్లాడమని నేను చెప్పి పంపించాను. ఎక్కడికి తీసుకొచ్చారు ఎక్కడ పెట్టారు అది నాకు తెలియాలి అంటూ ఆరాధ్య కోసం అవని రచ్చ చేస్తుంది. ఆ తర్వాత అక్షయ్ ఆరాధ్య ను తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్ కి వస్తాడు.. ఐస్ క్రీం తీసుకుని వచ్చే లోపల ఆరాధ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆరాధ్య కనిపించదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..