Intinti Ramayanam Today Episode May 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆరాధ్యను అక్షయ్ తీసుకెళ్లిపోయాడని ఇంటికి వచ్చి కంగారుపడుతూ చెప్తుంది. రాజేంద్రప్రసాద్ నువ్వెందుకు వాడితో పంపించావు. నేను తీసుకెళ్లారు మావయ్య మళ్ళీ తీసుకొస్తారని అనుకున్నాను కానీ తీసుకురాలేదు అని అవని అని బాధపడుతుంది. ఇంటికి తీసుకెళ్లాడేమో లే అమ్మ వస్తాడులే అనేసి అంటాడు.. ఇంటికి కూడా నేను వెళ్లాను అక్కడ కూడా లేదు. ఆయన ఇంట్లో లేడు అని టెన్షన్ పడుతుంది. ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియట్లేదు మామయ్య అని ఆరాధ్య అంటుంది. ఆరాధ్య ఎక్కడ కనిపించలేదు అని టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వస్తాడు అక్షయ్. అయితే ఆరాధ్యను నువ్వు తీసుకెళ్లి ఇంటికి వచ్చి అడుగుతున్నావ్ ఏంట్రా అని రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. నేను తీసుకెళ్లి అన్న కానీ ఐస్ క్రీమ్ కొనిపిద్దామని తీసుకెళ్లాను.. ఐస్ క్రీమ్ పార్లర్ కి వెళ్లి ఐస్ క్రీమ్ తీసుకొచ్చేలాగా కార్లో ఉన్న ఆరాధ్య కనిపించలేదు ఇక్కడికి ఏమైనా అవని తీసుకొచ్చిందేమో అని వెతుక్కుంటూ వచ్చాను అని అక్షయ్ అంటాడు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా నీ మీద కిడ్నాప్ కేసు పెడతాను గుర్తుపెట్టుకో అని రాజేంద్రప్రసాద్ వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్-అవని వెతికి వెతికి రోడ్డు మీద కారు ఆపి టెన్షన్ పడుతూ ఉంటారు. మనం ఎంత వెతికినా ఆరాధ్య కనిపించలేదు.. పదండి పోలీస్ కంప్లయింట్ ఇద్దామని అవని సలహా ఇస్తుంది. ఇంతలో సిక్కు వేషంలో ఓ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ అది మారువేషంలో ఉన్న కమల్. అవని-అక్షయ్ దగ్గరికొచ్చి.. ఏమైంది మీకి ఇద్దరూ ఫుల్ టెన్షన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు.. మీకి ప్రాబ్లమ్ ఏంటో మాకీ చెబుతారా అని అడుగుతాడు. దీంతో అవని విషయం చెబుతుంది. ఆరాధ్య ఫొటో చూపించి ఎక్కడైనా చూశారా అని అక్షయ్ కూడా అడుగుతాడు. చెప్తా కానీ ఆ పాపకి మీరిద్దరూ ఏమవుతారు.. మీరిద్దరి మధ్య అసలు రిలేషన్ ఏంటి అని కమల్ అడుగుతాడు..
అక్షయ్ సీరియస్ అవుతాడు.. ఆరాధ్య గురించి అడక్కుండా మన గురించి చెప్తావ్ ఏంటి అని అంటాడు. సింగ్ గారు మా పాప ఎక్కడుందో చెప్పండి అని ఆరాధ్య అడుగుతుంది.. ఓ చెట్టు కింద ఉందని చెప్తాడు. అవని-అక్షయ్ అక్కడికి వెళ్లి పాపని పట్టుకొని తల్లడిల్లిపోతారు. అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్.. ఎవరు తీసుకొచ్చారని అవని అడుగుతుంది. నేనే వచ్చాను.. నాకు మీ ఇద్దరి నుంచి దూరంగా వెళ్లిపోవాలనిపించింది అని షాకిస్తుంది ఆరాధ్య. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావ్ ఇంటికి వెళ్దాం పదా అంటుంది అవని. దానికి నేను రాను అని ఆరాధ్య అంటుంది.. దీంతో పదమ్మా మన ఇంటికి వెళ్దాం అంటాడు అక్షయ్. నీతో కూడా రాను.. నాకు మీ ఇద్దరూ వద్దు అంటుంది ఆరాధ్య. మీ ఇద్దరూ గొడవపడుతుంటే నేను చూడలేకపోతున్నా అంటూ ఆరాధ్య ఎమోషనల్ అవుతుంది.. ఎప్పుడు మా అమ్మ నాన్న కలిసి ఉండాలని అనుకున్నాను కానీ ఇలా నాకోసం మీ ఇద్దరూ ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారంటే నాకు ఎంత బాధగా ఉంటుందో మీరు అర్థం చేసుకోరా అని ఆరాధ్య అంటుంది..
రేపు మా స్కూల్లో అన్యూవల్ డే ఫంక్షన్.. పేరెంట్స్ ఇద్దరు కలిసి స్కూల్ కి రావాలని మేడం చెప్పారు మీరిద్దరూ కలిసి స్కూల్ కి వస్తాను అని నాకు మాట ఇస్తేనే నేను మీతో వస్తానని ఆరాధ్య అంటుంది. ఆరాధ్య మాట కాదన లేక అవని అక్షయ్ ఇద్దరు మాటిస్తారు. ఇక ఆరాధ్యను తీసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్ ఆరాధ్య ఎక్కడ కనిపించలేదంటూ బాధపడుతూ ఉంటాడు. స్వరాజ్యం దయాకర్ మేము వెళ్లి కాసేపు వెతుకు వస్తామని అనగానే అప్పుడే ఆరాధ్య అవని అక్షయలు ఇంటికి వస్తారు..
ఆరాధ్య ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరు తీసుకెళ్లిపోయారని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు. అవని ఆరాధ్యను ఎవరు తీసుకెళ్లలేదు మామయ్య మేమిద్దరం కలిసి ఉండాలని ఆరాధ్యనే దూరంగా వెళ్లిపోవాలని అనుకుంది. ఎవరో ఒక వ్యక్తి ఫోటో చూపించే వెతుకుతుంటే అక్కడ ఉందని చెప్పగానే మేము వెళ్లి తీసుకు వచ్చాము అని అంటుంది. రేపు ఇచ్చిన మాట ప్రకారం ఆరాధ్య కోసం స్కూల్ కి వెళ్ళండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఆరాధ్య కోసం పార్వతి భానుమతి టెన్షన్ పడుతూ ఉంటారు. పల్లవి శ్రియాలు అవని అక్క ఇదంతా చేసింది అంటూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు.
శ్రీకర్ వస్తే ఆరాధ్య దొరకలేదని చెప్తాడు. అప్పుడే అక్షయ్ వస్తాడు. ఆరాధ్య దొరికింది అని జరిగిన విషయాన్ని చెప్తాడు. ఆరాధ్య దొరికితే నేను దేవుళ్ళకి మొక్కు తీర్చుకుంటానని చెప్పాను అని భానుమతి అంటుంది. పల్లవి మాత్రం ఇదంతా అవని ప్లాన్ లాగే ఉంది. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుంటాను అని పల్లవి అంటుంది. ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఆరాధ్య అక్కడికి వచ్చి ఏంటమ్మా నా మీద కోపంగా ఉందా ఎందుకు అలా ఉన్నావ్ అని అడుగుతుంది.. నువ్వు ఇలా చేయడం వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరైనా నిన్ను తీసుకెళ్ళిపోతే ఏం చేయాలి అని అవని ఆరాధ్యతో అంటుంది అప్పుడే సింగ్ వేషంలో ఉన్న కమల్ ఇంటికి వస్తాడు. అబద్ధం చెప్పలేక అసలు నిజం అని బయట పెడతాడు. మొత్తానికి అలా ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..