BigTV English

Bengaluru Horror: రైల్వే స్టేషన్ సమీపంలో సూట్ కేస్, ఓపెన్ చేసి చూస్తే లేడీ డెడ్ బాడీ.. అసలేం జరిగింది?

Bengaluru Horror: రైల్వే స్టేషన్ సమీపంలో సూట్ కేస్, ఓపెన్ చేసి చూస్తే లేడీ డెడ్ బాడీ.. అసలేం జరిగింది?

బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పాత చందపుర రైల్వే వంతెన సమీపంలో బ్లూ కలర్ సూట్‌ కేస్‌ పడేసి కనిపించింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో స్థానికులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉండటంతో  పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. సూట్ కేసు ఓపెన్ చేసి చూసి షాకయ్యారు. బ్రీప్ కేస్ లో 18 ఏళ్ల గుర్తు తెలియని యువతి మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


వేరే చోట చంపి.. ఇక్కడికి తీసుకొచ్చి..?

సదరు యువతిని వేరే చోట చంపి, సూట్ కేసులో పెట్టుకుని రైల్లో తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూట్‌ కేస్‌ ను కదులుతున్న రైల్లో నుంచి విసిరివేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. గుర్తించకుండా ఉండేందుకు హంతకులు మృతదేహాన్ని పడేసేందుకు రైలు మార్గాన్ని ఉపయోగించి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.


రైల్వే పోలీసులను కాదని..

వాస్తవానికి ఇలాంటి కేసులను రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తారు. కానీ, తమ పరిధిలో జరగడంతో తామే ఈ కేసును ఎంక్వయిరీ చేస్తున్నట్లు బెంగళూరు రూరల్ ఎస్పీ సి.కె. బాబా వెల్లడించారు. “సాధారణంగా, ఇటువంటి కేసులు రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తాయి.  కానీ, ఇది మా ప్రాంతానికి సంబంధించినది కాబట్టి, మేము కేసు నమోదు చేశాం. సూట్‌ కేస్ లోపల మృతదేహం గుర్తించాం. దానిలో గుర్తింపు కార్డు, మరే ఇతర వస్తువులు లేవు. సదరు యువతి వయసు 18 ఏళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ హత్య వేరే చోట జరిగినట్లు తెలుస్తోంది. సూట్‌కేస్ ను రైల్లో తీసుకొచ్చి, రన్నింగ్ ట్రైన్ లో నుంచి కిందికి విసిరేశారు. ఈ కేసు కోసం స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో అసలలు విషయాలు తెలుస్తాయి” అని బాబా తెలిపారు.

Read Also: 20 ఏళ్లుగా నది దాటి వెళ్తూ, పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ.. ఈ రోజుల్లో ఇలాంటి టీచర్లు ఉన్నారా?

సీసీటీవీ ఫుటేజీల పరిశీలన

రైల్లో మృతదేహాన్ని తీసుకొచ్చి పడేసిన నేపథ్యంలో రైలు వచ్చే మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103 కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఈ కేసును బెంగళూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో.. అవసరమైన మేరకు రైల్వే పోలీసుల సాకారం తీసుకోనున్నట్లు వెల్లడించారు.  అటు ఈ బ్రీప్ కేస్ తీసుకొచ్చిన నిందితులను ఎవరైనా గుర్తించినా, ఏదైనా సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలని ప్రజలు, ప్రయాణీకులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Read Also:  ఈ ఒక్కడికే 1700 గదుల భవనం.. ఖరీదైన 600 రోల్స్ రాయిస్ కార్లు.. అంత సంపాదన ఎలా?

Related News

Viral Video: ఏంటమ్మా, సాయం చేసినా తప్పేనా? దానికి కూడా కోప్పడితే ఎలా?

Himachal Pradesh News: మేనల్లుడుతో మేనత్త ఓయోలో కస్సమిస్సా.. ట్విస్ట్ ఏంటంటే..

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Big Stories

×