E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి వార్నింగ్.. అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు పల్లవి వార్నింగ్.. అవని దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Intinti Ramayanam Today Episode May 27th : అవని అక్షయ్ లు ఇంటికి వచ్చి గాజులు తీసుకొచ్చావా అత్తయ్య అని పార్వతీకి చూపిస్తుంది అవని.. ఈ గాజులు కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతుంది. పార్వతి. మా అమ్మ పాత కమ్మలు ఇచ్చింది దానికి తోడు ఇంట్లో ఉన్న ఉంగరాలని వేసి ఆరాధ్య కోసం గాజులు కొన్నాం అత్తయ్య అని అవని చెప్పగానే పార్వతి ఎమోషనల్ అవుతుంది.. మనము అందరికీ లక్షలు ఇచ్చే వాళ్ళం కానీ ఇప్పుడు అదే డబ్బుల కోసం అందరి దగ్గర చేయించాల్సినట్టు అనిపిస్తుంది అని ఎమోషనల్ అవుతుంది..

చక్రధర్ కు పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్..

పల్లవి దెబ్బలకు మందులు రాసుకుంటూ ఉండగా చక్రధర అక్కడికి వస్తాడు.. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు ఇప్పటికైనా నువ్వు మారవాని చక్రధర్ అడుగుతాడు.. నేనేం తప్పు చేశాను ఎందుకు నన్నే నిందించాలనే అనుకుంటున్నావు అని పల్లవి అడుగుతుంది.. మీనాక్షిని అవమానించడం మాట్లాడడం నేను చూశాను.. ఎంతగా అవమానించావు నీకేనా అర్థమవుతుందా…? తను నీకు కన్నతల్లి అయినా కూడా నువ్వు ఇలా అవమనించడం ఏమి బాగోలేదని చక్రధరి అడుగుతాడు. మా మామ కి నువ్వు చేసిన అన్యాయం ముందు ఇదంతా అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది. అవని తన తల్లిని దెబ్బ కొట్టడం కోసం నేను ఎంతకైనా వెళ్తాను అని పల్లవి చెప్పడంతో చక్రధర్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు..

టెన్షన్ పడుతున్న అక్షయ్..

Advertisement

అక్షయ్ అన్ని చూసుకుంటూ ఉంటాడు.. భోజనం ఏర్పాట్లన్నీ దగ్గరుండి కామన్ చూసుకోవడంతో అక్షయ్ అరె కమల్ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అని అడుగుతాడు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నయ్య నేను దగ్గరుండి చూసుకుంటున్నాను నువ్వేం టెన్షన్ పడకు అని కమలంటాడు.. సరేగాని ఈ డబ్బులు ఉంచుదా ఏదైనా తక్కువైతే నన్ను మళ్ళీ అడుగు అని కమల్ ను అక్షయ్ అడుగుతాడు.. అవనికి కమల్ గురించి చాలా గొప్పగా చెప్తాడు అక్షయ్. తను ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఉన్నాడు అని అక్షయ్ అనడంతో అవని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. అందరూ వస్తారని ధీమాగా చెప్పావు మరి వస్తారా రారా అని టెన్షన్ పడతాడు అక్షయ్. మీరేమీ టెన్షన్ పడకండి అందరూ కచ్చితంగా ఈ ఫంక్షన్ కి వస్తారు అని అవని అంటుంది.

పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

అందరూ వస్తారని అవని అంతగా చెప్పడంతో పల్లవి నిజంగానే వస్తారా లేదా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. ఈ ఫంక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది కదా అందరూ వస్తారని నువ్వు అంతగా చెప్తున్నావు నిజంగానే వస్తారా అని పల్లవి అడుగుతుంది. నేను అవని ఏదైనా కచ్చితంగా జరుగుతుంది అంటేనే చెప్తాను లేదంటే మాత్రం చెప్పను అది నీకు కూడా తెలుసు కదా అని అవని అంటుంది.. సరిగ్గా గంట టైం లో అందరూ ఇక్కడ ఉంటారు నోట్ చేసి పెట్టుకోవాలి అవని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. అవని ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది..

నిజం చెప్పబోతున్న చక్రధర్..

Advertisement

పల్లవి ఇక మారేలా కనిపించడం లేదు ఎలాగైనా సరే ఈ నిజాన్ని బయట పెట్టాలి అని చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నాన్న మీరు నన్ను రమ్మని పిలిచారు కాఫీ కావాలని అడిగారట కదా అని అవని అంటుంది.. నీతో మాట్లాడాలని నేను కాఫీ అడిగానని చక్రధర్ అంటాడు.. ఏమైంది నాన్న ఏం జరిగింది అని అవని అడుగుతుంది.. ఏం అమ్మ పల్లవి ఇక మారేళ్ళ కనిపించడం లేదు మీనాక్షి ఇకముందు అవమానాలు భరించే శక్తి లేదు కాబట్టి అసలు నిజాన్ని బయట పెడితే మంచిది అని నేను అనుకుంటున్నాను అని చక్రధర అంటాడు.. సరే నాన్న మంచి సమయం చూసి అందరూ వస్తున్నారు కదా ఈ నిజాన్ని బయటపెడతాను అని అవని అంటుంది..

శ్రీయ, శ్రీకర్ ఎంట్రీతో పల్లవి షాక్..

ఫంక్షన్ ఏర్పాట్లలో కమల్ హడావిడి చేస్తూ ఉంటాడు. అక్కడ ఫంక్షన్కి కావాల్సిన డెకరేషన్ చేస్తూ ఉండగా పల్లవి కూర్చొని ఉండడంతో కమల్ పల్లవిని బెలూన్స్ కట్టమని చెప్తాడు కానీ అవి పగిలిపోవడంతో తను షాక్ అవుతుంది.. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉండగా శ్రీకర్, శ్రీయ ఇద్దరు కూడా సడన్ గా రావడంతో పల్లవి ఒక్కసారిగా శాఖ అయిపోతుంది. అందరూ వాళ్ళిద్దరు రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. శ్రేయ శ్రీకర్ రావడంతో పల్లవి షాక్ లో ఉండిపోతుంది. ఇద్దరు నిజంగానే ఇక్కడికి వచ్చేసారా లేకపోతే ఏదైనా కారణం వల్ల వచ్చారా అనే పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భరత్, రాజేశ్వరి ప్రణతిలు కూడా రావడంతో పల్లవి వాళ్ళని చూసి షాక్ అవుతుంది.

Also Read :‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Related News

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

Big Stories

Advertisement
×