Intinti Ramayanam Today Episode May 29th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య ఇంటికి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.. ఆరోగ్యం సంతోషంగా చూసుకుంటే అవని దగ్గరికి వెళ్ళదని పల్లవి ప్లాన్ చేస్తుంది.. అది విన్న కమ్మలు ఆరాధ్యం ఇక్కడే ఉంచాలని తల్లికి దూరం చేయాలనుకుంటావా అంటూ పల్లవి పై సీరియస్ అవుతాడు.. ఇక శ్రీయ కూడా అలానే అనుకుంటుంది. కమల్ శ్రియ ఫై కూడా సీరియస్ అవుతాడు. మీరు చేస్తున్నది ఏం బాగోలేదు కనీసం కొంచెమైనా ఆలోచించండి అంటూ అందరినీ తిడతాడు.. ఇక ఆరాధ్య వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఆరాధ్యుని బాగా చూసుకోవాలి అప్పుడే అవనిని మర్చిపోతుందని అంటారు. కమల్ ఆరాధ్య దగ్గరకు వెళ్లి బంగారం నువ్వు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అసలు ఊహించలేదు నీకేం కావాలో చెప్పు మనిద్దరం కలిసి ఆటలాడుకుందామా ఏమైనా తినాలా అనేసి అడుగుతాడు. అయితే నాకేం వద్దు బాబాయ్ అని అంటుంది.. అమ్మను చూడాలనిపిస్తుంది అమ్మ దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది కానీ నాన్న ఫీల్ అవుతాడని ఆలోచిస్తున్నా అని ఆరాధ్య అంటుంది. అయితే నీ ఆలోచన బాగానే ఉంది కానీ.. పెద్దవాళ్ళం మాచైతే కావట్లేదు చిన్నపిల్లవి నీచైతే ఎలా అవుతుంది అని కమలంటాడు.. మొత్తానికి ఆరాధ్యను అవని దగ్గరకు చేర్చుతాడు. అక్షయ్ కమల్ చేసిన పనికి కోపంగా ఇంటికి వస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఆరాధ్యను అవని దగ్గరకు తీసుకొని వెళ్తాడు. అక్కడ అవనికి జ్వరం రావడం చూసి టెన్షన్ పడతారు.. ఆరాధ్య లోపలికి వెళ్ళగానే అవని పడుకో తడి బట్ట పెడతాను అని అడుగుతుంది. కానీ ఇది నిజం జ్వరం కాదు ఉత్తిత్తి జ్వరమే అని అసలు విషయాన్ని బయటపెడుతుంది అది విన్న రాక్షసి సీరియస్గా కమల్ ని అడగడానికి వెళ్తాడు. కమల్ చేసిన విషయాన్ని అందరికీ చెప్తాడు. కమలి ఇంట్లోకి వెళ్ళగానే.. అక్షయ్ కోపాన్ని కమల్ మీద చూపిస్తాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ఐడియాలు ఇస్తారా అసలు నువ్వు చేసింది ఏమైనా బాగుందా అని అక్షయ్ కమ్మలని దారుణంగా తిడతాడు. నేను చేశాను అన్నయ్య ఏమైంది అని కమల్ అడుగుతాడు.
ఇంట్లోని వాళ్ళందరూ ఏం చేశారు రా ఎందుకు కొడుతున్నావ్ అని అడిగితే.. ఆరాధ్యకు ఉల్లిపాయ ట్రిక్ చెప్పి జ్వరం వచ్చేలా చేసి అవినీతికి తీసుకెళ్లాల చేశాడు. చిన్న పిల్లలకు లేని అలవాట్లు అన్ని నేర్పిస్తున్నాడు అని అక్షయ్ కమల్ ని కొడతాడు. ఇలా ఎందుకు చేసావురా అని పార్వతి అడిగితే. నేనేది కావాలని చేయలేదు ఆరాధ్య పసిపిల్ల మనసు కాబట్టి అమ్మానాన్న ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటుంది. పంతాలు మీ పట్టింపులతో ఆరాధ్య మనసును విరిచేస్తున్నారు అందుకే నేను మంచిగా ఉండాలని చూసుకున్నాను దాంట్లో తప్పేంటి అని కమల్ అరుస్తాడు. మీ పంతాలతో పట్టింపులతో పసిపిల్ల మనసును ఎంత గాయపరుస్తున్నారో మీకు అర్థమవుతుందా ఇవన్నీ నాకు ఏమీ తెలియదు ఆరాధ్య సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని కమలంటాడు.
ఎక్కడికి వెళ్లినా అమ్మానాన్న కావాలని ఆరాధ్య అనుకుంటుంది.. మనం వెళ్లి తీసుకువచ్చేంత వరకు ఆరాధ్య స్కూల్ నుంచి ఇంటికి కూడా రాలేదు.. అలాంటిది తన మనసు ఎంత బాధపడి ఉంటదో ఆలోచించరా మీరు అని కమల్ తిడతాడు. ఇక కమల అన్న మాటలకి అక్షయ సీరియస్ అవుతాడు. చిన్నపిల్ల కాబట్టే పెద్దవాళ్ల ఆలోచనల గురించి అర్థం చేసుకోలేక పోతుంది అది నువ్వు ఆలోచించవా అని అంటాడు. మీరు ఏమైనా చేసుకోండి నేను ఆరాధ్య కోసం ఏదైనా చేస్తానో ఎంతకైనా తెగిస్తాను నా నిర్ణయాన్ని మార్చుకోను అని కమల్ వెళ్ళిపోతాడు..
అవని ఏదో ఆలోచిస్తూ వంట చేస్తూ ఉంటుంది. అయితే స్టవ్ కింద వెలిగించుకున్ననే వంట చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే రాజేంద్రప్రసాద్ అక్కడికి వచ్చి ఏంటమ్మా అవని ఎందుకు పరధ్యానంగా ఆలోచిస్తున్నామని అంటాడు. ఆరాధ్య నాన్న దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళింది కానీ అక్కడ ఒక్కరోజు కూడా ఉండకుండా వచ్చేసింది కదా ఆయన ఎంత బాధపడి ఉంటారో కదా మావయ్య గారు అనేసి అవని అంటుంది.. నువ్వు వాడి గురించి అయితే ఆలోచిస్తున్నావు కానీ వాడు నీ గురించి ఆలోచిస్తే ఇలా ఎందుకు ఉండేవాడు మీ కాపురం ఎంతో చక్కగా సాగేది కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
అవని అక్షయతో జీవితం మొదలైనప్పుడు రోజులని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇక కమల్ పేపర్లో రాసిన వార్తను తీసుకొచ్చి అందరికీ చూపిస్తాడు. కుటుంబ గురించి ఎంత గొప్పగా రాస్తారో చూసావా అని పల్లవికి చెప్తాడు. మావయ్య పది లక్షలు ఇచ్చేలా అవన్నీ చేసింది అన్న విషయం అందరికీ అర్థమైంది నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని అందరు అనుకుంటారు. కానీ పల్లవి ఎంత చెప్పినా కూడా వినకుండా వాదిస్తుంది ఇలాగే మావయ్య అందరికీ ఇచ్చుకుంటూ పోతే రేపు కంపెనీ దివాలా తీసే పరిస్థితి కూడా వస్తుంది. అవని మావయ్య చేత దానధర్మాలు చేయించుకుంటూ వెళ్తే మనం కూడా రోడ్డున పడాల్సి వస్తుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. కంపెనీ బాధ్యతల్లో వ్యవహారాల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నేను ఉండాలని కోరుకుంటున్నానని పల్లవి అంటుంది.
ఆ మాట వినగానే శ్రియ కూడా నేను కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మెంబెర్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ముందుకు వస్తుంది. నేను ఇంటికి కోడలుగా ముందు వచ్చాను మావయ్య అన్ని బాధ్యతలు నాకు ఇచ్చాడు. ఇంటి పెత్తనాన్ని నా చేతులు పెట్టాడు కాబట్టి నేను ఉండటంలో తప్పులేదు కదా మరి నువ్వు ఎలా ఉంటావు అని ఇద్దరు గొడవకు దిగుతారు. పార్వతీ విసుగు వచ్చేసి ఏంటి గొడవలు ప్రతిరోజు గొడవలు లేకుండా రోజు గడవదా అనేసి అరుస్తుంది.. మీ భార్యలకి మీరు చెప్పుకోలేరని తన కొడుకులని అంటుంది. చెప్పుకునే స్టేజ్లో లేవమ్మా మా మాటలు విని స్టేజిలో వాళ్ళు కూడా లేరు అని శ్రీకర్ అంటారు.
శ్రియ మాటలు కి షాక్ అయిన పల్లవి అందరూ వెళ్లగానే అదేంటి నువ్వు నాకు పోటీకొస్తున్నావా అని అడుగుతుంది. నీకు ఎంత హక్కు ఉందో నాకు అంటే హక్కు ఉంది. అది నువ్వు మర్చిపోవద్దు అనేసి శ్రీయ అంటుంది. రోజురోజుకీ నాకు ఏ కు మేకై గుచ్చుకుంటుంది కచ్చితంగా దీన్ని అడ్డు తొలగించుకోవాలని పల్లవి ప్లాన్ చేస్తుంది. తర్వాత రోజు ఉదయం అవని ఆఫీసుకు వెళ్తే అక్షయ్ నీ సర్వీస్ మాకు అవసరం లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. నీకు ఇలా చెప్తే ఎలాగో వింటావు? మీ ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్తానని అంటాడు.. అవని నేను ఆఫీసుకు వచ్చేది జీతం కోసం కాదు మీలో మార్పు కోసం అని అవని అక్షయ్ ని దుమ్ము దులిపేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..