Intinti Ramayanam Today Episode May 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ఇంటి ముందర స్వరాజ్యం దయాకర్ ప్రణతి భరత్ తో పాటు మరికొందరు కూర్చొని అవినీతి న్యాయం జరగాలంటూ ధర్నా చేస్తారు. పల్లవి డబ్బులు ఎరగా వేసి మీకు ఎంత కావాలంటే అంతిస్తాను ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అడుగుతుంది. డబ్బులు కోసం వచ్చిన వాళ్ళమైతే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు వదిన మీకు ఫోన్ చేస్తే కావాలని అడిగే వాళ్ళం కదా అని ప్రణతి దిమ్మ తిరిగే సమాధానం చెబుతుంది. శ్రీకర్ కమల్ కూడా అవనికి న్యాయం జరగాలంటూ వాళ్లతో కూర్చొని ధర్నా చేస్తారు. అవని మనుషులు ఇంటి ముందర ధర్నా చేస్తున్నారని పార్వతి అక్షయకి ఫోన్ చేసి చెప్తుంది. అక్షయ్ వెంటనే అవనిని పిలిచి అరుస్తాడు. నువ్వు అనుకున్నది నెరవేరడం కోసం నీ వాళ్ళ నా ఇంటి ముందర ధర్నా చేయమని కూర్చోమని చెప్పావా ? మర్యాదగా వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయమను లేదా నా స్టైల్ లో నేను పోలీసులను పిలిపించి ఖాళీ చేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు అక్షయ్.అవని టెన్షన్ పడుతూ వాళ్ళు ఎందుకు అక్కడికి వెళ్లారు నేనేం చెప్పలేదు కదా అని వెంటనే అక్కడికి బయలుదేరుతుంది. మీరంతా ఏం చేస్తున్నారు ఇక్కడ అని అవని అందరిపై సీరియస్ అవుతుంది. మొత్తానికి ధర్నాని విరమించుకొని అందరూ వెళ్లిపోతారు.. పల్లవి వేసిన ప్లాను పల్లవి కేర్ రివర్స్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే ఆరాధ్య సోఫాలో కూర్చుని ఉండటంతో రాజేంద్రప్రసాద్ స్కూల్ కి ఎందుకు వెళ్లలేదమ్మా అని అడుగుతాడు.. అటు అవని ప్రిన్సిపల్ దగ్గరకొచ్చి నేను నా కూతురు కోసమే ఈ స్కూల్లో చేస్తున్నానని చెప్పాను కదా మేడం.. ఇప్పుడు నా కూతురు కనిపించట్లేదు. వాళ్ళ నాన్న స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి అని అడుగుతుంది.. ప్రిన్సిపల్ అక్షయ్ కి ఫోన్ చేసి ఆరాధ్య స్కూల్ కి రాలేదు ఏంటి సార్ హెల్త్ బాలేదా..? మరి ఏదైనా కారణం ఉందా అని అడుగుతుంది. అక్షయ్ నేను మా ఆరాధ్యను స్కూల్ మార్పించే ఆలోచనలో ఉన్నానని చెప్తాడు. ప్రిన్సిపల్ ఆ విషయాన్ని అవినీకి చెప్తుంది. ఆ మాట విన్నావని షాక్ అవుతుంది.. నావల్లే ఆరాధన స్కూల్ మార్పిస్తున్నాడా అని అవని బాధపడుతుంది.
ఇక రాజేంద్రప్రసాద్ అక్షయ్ ని పిలుస్తాడు. ఆరాధ్యను స్కూల్ కి ఎందుకు పంపించలేదు అని అడుగుతాడు. ఆ స్కూల్లో అవని టీచర్గా పని చేస్తుంది. ఆరాధ్య అవని దగ్గరికి వెళుతుంది కాబట్టి నేను స్కూల్ కి పంపించట్లేదు. స్కూల్ మాన్పించే ఆలోచనలో ఉన్నానని ఖచ్చితంగా చెప్తాడు. మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని పసిదాని భవిష్యత్తుని ఎందుకు పణంగా పెట్టాలని చూస్తున్నావ్ అని అక్షయ్ ని సీరియస్ గా తిడతాడు రాజేంద్రప్రసాద్. నీకు అవనికి ఏదైనా సమస్యలు ఉంటే మీరు మీరు చూసుకోండి అంతేకానీ ఇలా మీ ఇద్దరి మధ్యలో ఆరాధ్యని బలి చేయాలని చూస్తే నేను అస్సలు ఊరుకోనని సీరియస్ అవుతాడు.
ఆరాధ్య ను రేపటి నుంచి అదే స్కూల్ కి పంపించండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. దానికి సీరియస్ అయినా అక్షయ్ ఇది నా ఫ్యామిలీ విషయం నాకు నా భార్యకు నా కూతురికి సంబంధించిన విషయం మీరు దీంట్లో కలగ చేసుకోకండి నాన్న అని అక్షయ్ సీరియస్ అవుతాడు. ఒకప్పుడు శ్రీకర్ ఇంటికి రమ్మని చెప్తే మీరు వద్దన్నారు.. అలాగే నా కూతురు విషయంలో నేను నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. మీరు దయచేసి ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వకండి నాన్న అని అక్షయ్ రాజేంద్రప్రసాద్ పై సీరియస్ అవుతాడు.
అక్షయ్ మాటలు విన్న రాజేంద్రప్రసాద్ ఎమోషనల్ అవుతాడు. మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ వేరని వేరు చేసి మాట్లాడుతున్నావా ఇన్ని రోజులకు నీ మనసులోని మాటను బయట పెట్టావా అని బాధపడతాడు. అక్షయ్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాన్న అని ఎంత బ్రతిమిలాడుకున్నా రాజేంద్రప్రసాద్ చాలురా నువ్వు అన్న మాటలు నా మనసులో గుచ్చుకున్నాయని రాజేంద్రప్రసాద్ అంటాడు. పల్లవి అక్షయ్ ని పార్వతిని లోపలికి తీసుకెళ్లి అవనికి బుద్ధి వచ్చేలా చేయాలని ఒక ప్లాన్ చేస్తుంది. పల్లవి మాటల్ని గుడ్డిగా నమ్మేస్తారు.
అవని తన కూతురు గురించి ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తూ ఉంటుంది. ఎదురుగా అక్షయ్ రావడం చూసి అవని కారుకి అడ్డుపడుతుంది. ఎందుకు స్కూల్ మార్పించాలనుకుంటున్నారు.. తల్లి కూతుర్లను వేరు చేయాలని మీరు అనుకుంటున్నారా నేనేంటో మీకు అర్థం కాదు కనీసం మా ఇద్దరిని కూడా కలిసి ఉండనివ్వకూడదు అని అనుకుంటున్నారా అని అవని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..