BigTV English

OTT Movie : సైకో కిల్లర్ నుంచి యాక్షన్ దాకా… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రేజీ కొరియన్ సినిమాలను చూశారా?

OTT Movie : సైకో కిల్లర్ నుంచి యాక్షన్ దాకా… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రేజీ కొరియన్ సినిమాలను చూశారా?

OTT Movie : ఓటీటీలలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 5 కొరియన్ సినిమాలే ఈరోజు మన మూవీ సజెషన్. అందులో హారర్, యాక్షన్, థ్రిల్లర్, పొలిటికల్ డ్రామా ఇలా వివిధ జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే ఉన్నాయి. మరి ఆ కొరియన్ సినిమాలు ఏంటనే వివరాల్లోకి వెళ్తే…


1. మిడ్‌నైట్ (Midnight)
‘మిడ్‌నైట్’ మూవీ ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్. ఒక అమ్మాయి, సీరియల్ కిల్లర్ మధ్య జరిగే ఛేజింగ్ సీన్స్ చూస్తే గుండె ఆగిపోతుందా అన్నంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కిమ్ హ్యే-యోన్ (కీ సూరా) కస్టమర్ సర్వీస్ ఉద్యోగి. చెవులు విన్పించవు. ఆమె ఒకరోజు రాత్రి ఓ యువతి (పార్క్ యు-రిమ్)పై దాడి చేస్తున్న సీరియల్ కిల్లర్ డో-షిక్ (వీ హా-జూన్)ను చూస్తుంది. దీంతో డో-షిక్ అనే ఆ కిల్లర్ హ్యే-యోన్‌ను టార్గెట్ చేస్తాడు. చెవులే విన్పించని ఆ అమ్మాయి ఆ కిల్లర్ నుంచి తనను తాను ఎలా రక్షించుకుంది? అన్నది స్టోరీ.

2. ది రౌండప్ (The Roundup)
‘ది రౌండప్’ అనేది ‘ది అవుట్‌ లాస్’ అనే సినిమాకు సీక్వెల్. ఈ మూవీలో కథ డిటెక్టివ్ మా సియోక్-డో (మా డాంగ్-సియోక్) చుట్టూ తిరుగుతుంది. సియోక్-డో ఒక కఠినమైన, నిజాయితీ గల పోలీసు డిటెక్టివ్. అతను నేరస్థులను కొట్టే కొట్టుడుకు గూస్ బంప్స్ పక్కా. ఈ క్రమంలోనే సియోక్-డో ఒక హత్య ఆరోపణపై నిందితుడైన కాంగ్ హే-సాంగ్ (సన్ సుక్-కు)ను అప్పగించడానికి వియత్నాం వెళ్తాడు. అయితే అతను అక్కడ అనేక సంవత్సరాలుగా పర్యాటకులే టార్గెట్ గా నేరాలు చేస్తున్న ఒక క్రూరమైన కిల్లర్ గురించి తెలుసుకుంటాడు. కాంగ్ ఒక సాడిస్టిక్ క్రిమినల్, అతను బలవంతంగా డబ్బు లాక్కోవడం, హత్యలు చేయడం వంటివి చేస్తూ ఉంటాడు. ఇక ఆ క్రిమినల్ కి, ఈ డిటెక్టివ్ కి తగులుకుంటాడు. ఆ తరువాత రచ్చ రచ్చే.


3. ఎస్కేప్ ఫ్రమ్ మొగాదిషు (Escape from Mogadishu)
1991లో సోమాలియాలోని మొగాదిషులో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. దక్షిణ, ఉత్తర కొరియా రాయబార కార్యాలయాల సిబ్బంది ఒక సివిల్ వార్‌లో చిక్కుకోవడం గురించి ఉంటుంది స్టోరీ. దక్షిణ కొరియా రాయబారి హాన్ షిన్-సంగ్ (కిమ్ యూన్-సియోక్), ఉత్తర కొరియా రాయబారి రిమ్ యాంగ్-సు (హీ జూన్-హో) ఐక్యరాష్ట్ర సమితి సభ్యత్వం కోసం సోమాలియా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి పోటీ పడతారు. అయితే సోమాలియాలో సియాద్ బర్రే ప్రభుత్వం పతనం కావడంతో, రెబెల్స్ మొగాదిషును స్వాధీనం చేసుకుంటారు. రెండు రాయబార కార్యాలయాల సిబ్బంది ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ పరిస్థితి నుంచి వాళ్ళు ఎలా బయట పడ్డారు అన్నది కథ.

4. ప్రాజెక్ట్ వుల్ఫ్ హంటింగ్ (Project Wolf Hunting)
‘ప్రాజెక్ట్ వుల్ఫ్ హంటింగ్’ ఒక హై-ఇంటెన్సిటీ యాక్షన్ హారర్ చిత్రం. 2017లో ఒక విమానంలో నేరస్థుల రవాణా సమయంలో బాంబు పేలడంతో, ప్రభుత్వం ఈసారి ఒక కార్గో షిప్‌ను ఉపయోగిస్తుంది. ఈ షిప్‌లో 47 మంది నేరస్థులు, వారిని గమనిస్తున్న పోలీసులు, ఒక డాక్టర్ ఉన్నారు. ప్రయాణంలో షిప్‌లో ఒక తిరుగుబాటు జరుగుతుంది. ఈ సందర్భంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన భయంకరమైన ప్రయోగాల ఫలితంగా సృష్టించిన ‘ఆల్ఫా’ అనే సూపర్‌ హ్యూమన్ విడుదల అవుతాడు. ఆ తరువాత జరిగేదంతా ఊచకోతే.

5. ట్రైన్ టు బుసాన్ (Train to Busan)
‘ట్రైన్ టు బుసాన్’ ఒక దక్షిణ కొరియా జాంబీ అపోకలిప్స్ చిత్రం. ఇది సియోల్ నుంచి బుసాన్‌కు వెళ్లే KTX రైలులో జరుగుతుంది. ఈ మూవీని కొరియన్ మూవీ లవర్స్ అందరూ ఇప్పటికే చూసి ఉంటారు. ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

 

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×