Intinti Ramayanam Today Episode May 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే ఆరాధ్య స్వరాజ్యం వాళ్ళింట్లో అవని దగ్గర ఉంటుంది. సరదాగా నవ్వుతూ భోజనం చేస్తూ ఉంటుంది. దయాకరు మీ నాన్న వచ్చి ఇంటికి రమ్మని అంటే నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్ళను. మమ్మి దగ్గరే ఉంటానని చెప్తానని అంటుంది. మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తానని చెప్తే నువ్వు ఏం చెప్తావని ఆరాధ్యను దయాకర్ అడుగుతాడు. నేను పోను అని ఆరాధ్య అంటుంది. ఇక ఇంట్లో అందరితో సరదాగా ఉంటుంది. ఆరాధ్యకు అవని భోజనం తినిపిస్తుంది. ఇంట్లోని వాళ్లందరికీ ఆరాధ్య భోజనం పెడుతుంది.
ఇక అందరూ ఆరాధ్యను చూసి సంతోషంగా ఉంటారు. అక్షయ్ కు ఆరాధ్య స్కూల్ టీచర్ ఫోన్ చేస్తుంది..అవని ఆరాధ్య ఇంట్లోనే వాళ్ళందరూ దాగుడుమూతలు ఆడుకుంటూ ఉంటారు. ఇంట్లోకి పోలీసులు రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రాష్ట్ర ప్రసాద్ కిడ్నాప్ చేసింది నేను అయితే నా మీద కేసు పెట్టండి అని అంటాడు పోలీసుల్ని మొత్తానికి పంపించేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. ఆరాధ్య అక్షయ్ తో వెళ్లనని అంటుంది. ఇక ఒక్కొక్కరు ఒక్కోలాగా అక్షయ్ తో అవని గురించి చెప్తారు. కానీ అక్షయ్ మాత్రం సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కూతురిని నేను ఎలాగా నా దగ్గరికి తీసుకురావాలో నాకు తెలుసు అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అటు పార్వతి అందరూ ఆరాధ్య కోసం బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. ఆరాధ్య కోసం బావగారు వెళ్లి చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అని పార్వతి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
ఒకసారి అక్షయ్ కి ఫోన్ చేయండి అని పార్వతి అడుగుతుంది. పల్లవి ఫోన్ చేస్తూ ఉండగా అక్షయ్ అప్పుడే వస్తాడు. ఆరాధ్య ను ఎందుకు తీసుకురాకుండా వచ్చావని పార్వతి అడుగుతుంది. ఆరాధ్య అవని దగ్గర్నుంచి రానని చెప్పింది అని అంటాడు అక్షయ్.. మీరు పోలీసులు తీసుకెళ్లిన కూడా మీరు పోలీసుల్ని తీసుకెళ్లినా కూడా ఆరాధ్యను అవని ఎందుకు పంపించలేదు అని పల్లవి అడుగుతుంది. స్కూల్ నుంచి ఆరాధ్యను తీసుకెళ్లింది అవని కాదు నాన్న. అవని దగ్గరికి తీసుకెళ్లి నాన్న ఇంత పెద్ద తప్పు చేశాడు అని అందరూ అనుకుంటున్నారు. మావయ్య అవని అక్కకి సపోర్ట్ చేస్తారన్న విషయం తెలిసిందే కదా మళ్లీ కొత్తగా ఎందుకు దీని గురించి మాట్లాడదామని పల్లవి అంటుంది.
ఆరాధ్య మీద అవనికి ఎంత హక్కు ఉందో తండ్రిగా మీకు అంతే హక్కు ఉంటుంది బావగారు అని పల్లవి అంటుంది. లీగల్గా వెళితే కోర్టులని ఈ విషయం తేలిపోతుందని పల్లవి అంటుంది.. అయితే శ్రీకర్ మాత్రం నువ్వు ఏ కోర్టుకు వెళ్లినా ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ముందు కేసును తీసుకుంటారు కానీ తేలేదు మాత్రం తల్లి దగ్గరే బిడ్డ ఉండాలని చెబుతారు. లేదా బిడ్డ గురించి ఆలోచించే వారికి ఆ బిడ్డను ఇస్తారు అంటే ఆరాధ్య ఎవరి దగ్గర ఉంటానంటే వారి దగ్గరనే కోర్టు ఉండాలని ఆదేశిస్తుందని చెప్తాడు.
రాజేంద్రప్రసాద్ ఆరాధ్య ను అవని దగ్గర వదిలిపెట్టి నీ బిడ్డ నువ్వు నీ దగ్గరికి చేర్చాను జాగ్రత్తగా చూసుకోవాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇంట్లో అన్ని సమస్యలను తీర్చిన నువ్వే తప్పు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలేం జరిగిందో చెప్పు అని అవనిని అడుగుతాడు. సాక్షాలు ఆధారాలు లేకుండానే ప్రణతి విషయంలో మీరు ఏ విషయాన్ని నమ్మలేదు. ఇక నేను ఒకరి గురించి చెప్తే మీరు ఎలా నమ్మగలుగుతారు మావయ్య అని అవని అంటుంది. ఏది ఏమైనా కూడా నీ తప్పేమీ లేకుండా నిరూపించుకోవాలని అవనికి సలహా ఇస్తాడు. అవని మాత్రం ఇంట్లో మీరు ఇలా చేశారని ఎంత గొడవ జరుగుతుందో భయంగా ఉంది మావయ్య గారు అంటే అదంతా నేను చూసుకుంటానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
పల్లవి మీరు తప్పు చేసారు మామయ్య ఇది న్యాయమేనా మీకు. అందరూ రాజేంద్రప్రసాద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు.. ఆరాధ్యను అవని దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు అని పార్వతి అడుగుతుంది. తల్లిని బిడ్డను వేరు చేయడం ఇష్టం లేకే నేను ఆ పసిధాన్ని తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పల్లవి మీరు తప్పు చేసారు మామయ ఇది న్యాయమేనా మీకు.. ఇంట్లో గొడవలన్నీటికి అవని అక్క కారణమని తెలుసు అవని అక్క వల్లే ఇదంతా జరుగుతుందని తెలిసి కూడా మీరు అవని అక్కకి ఎలా సపోర్ట్ చేశారు అని పల్లవి అడుగుతుంది.. నేను న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు సపోర్ట్ చేశాను నీకు ఏమైనా ప్రాబ్లమా అని అవనికి షాక్ ఇస్తాడు రాజేంద్రప్రసాద్. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..