Intinti Ramayanam Today Episode November 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవిని చూడ్డానికి రాజేశ్వరి చక్రధర్ ఇంటికి వస్తారు. పల్లవి హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే అందరూ తలా ఒక మాట అంటారు. చక్రధర్ మధ్యలో పల్లవికి సపోర్ట్ చేస్తాడు. పల్లవి నాన్న సపోర్ట్ చూసుకొని హమ్మయ్య అనుకుంటుంది. లోపలికి తీసుకెళ్లిన చక్రధర్ ఏమైంది ఎక్కడికి వెళ్లావు హాస్పిటల్ కి వెళ్ళావా ఏంటి అని అడుగుతాడు. అవును డాడ్ హాస్పిటల్ కి వెళ్ళాను. ఆ డాక్టర్ మనల్ని మోసం చేసింది. ఆ అవనినే దానికి కారణమని పల్లవి చెప్పగానే షాక్ అవుతాడు. అవినీకు ఎలా తెలుసు? అసలు ఎందుకు అవని ఆ టైంలో హాస్పిటల్ కి వెళ్ళిందని చక్రధర్ పల్లవి అని అడుగుతాడు. ఎన్ని రోజులు మనం అవని అనాధ అని అనుకున్నాం కానీ దానికి ఒక అమ్మ తమ్ముడు కూడా ఉన్నాడు. ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు అవని అనాధ అని ఇంట్లో వాళ్ళు నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకా పొంగిపోతారనేసి పల్లవి ఉంటుంది . ఇక అవనిని అక్షయ్ ఇంకా క్షమించడు.. వారిద్దరి మధ్య చిన్న డిస్కర్షన్ జరుగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని పై కోపంతో ఉన్న అక్షయ్ అవినికి దూరంగా పడుకోవాలని అనుకుంటాడు. దుప్పటి దిండు తీసుకుని బయటకు వెళుతుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు అవని అడుగుతుంది. కొత్తగా అడుగుతున్నావేంటి రోజు ఎక్కడికి వెళ్తున్నా అని అక్షయ్ అంటాడు. పొద్దున వినోద్ విషయంలో బాగానే ఉన్నారు కదా ఇంతలోకి మీకు ఏమైంది అని అంటే అది ఇంట్లో విషయం ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో అలానే ఉండాలి. దానికి అవని బాధ పడుతుంది. అసలేందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు దాస్తున్న నిజమేంటో చెప్తే కానీ నేను మాట్లాడను అని చెబుతాడు. నా మీద నమ్మకం లేదా అని అంటుంది అవని. నాకు నిజాలు కావాలి అని అంటాడు. అవని బాధ పడుతుంది. నేను ఇప్పుడే ఏమి చెప్పలేను అని అనుకోని పడుకుంటుంది. ఇక పొద్దున్నే లేవగానే నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని ఆలోచిస్తుంది. పార్వతి, రాజేంద్ర ప్రసాద్ గుడికి రెడీ అవ్వాలని అనుకోని కిందకు వస్తారు. కానీ రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదని అనుకుంటాడు. అవని అందరికన్నా ముందే రావాలి ఇంకా రాలేదు ఆరాధ్యను రెడీ చేస్తుందేమో అంటుంది.
ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం అవని సంగతి సరే మిగితావాళ్ళ గురించి అడుగుతాడు. కోమలి రాగానే వెళ్దాం అంటుంది కానీ అందరు రావాలని అంటుంది పార్వతి. ఇక బామ్మ ఎందుకు లేట్ అయ్యిందంటే కౌంటర్ వేస్తాడు కమల్. ఇక ప్రణవి జీన్స్ వేసుకొని వస్తుంది. పల్లవి గుడికి సాంప్రదాయంగా రావాలి జీన్స్ లో కాదు అని అంటుంది. పల్లవికి క్లాస్ పీకడం చూసి అందరు షాక్ అవుతారు. ఇక ప్రణవి డ్రెస్ వేసుకొని వస్తుంది. అందరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ పార్వతి అందరం కలిసి పోయాము కోమలి వినోద్ లు కలిసిపోయరని సంతోషంతో మొక్కు తీర్చుకోవాలని అనుకుంటుంది. అందరూ సంతోషంగా గుడిలోపలికి వెళ్తారు. అక్కడ ప్రదక్షిణలు చెయ్యాలని ప్రణవి వెళ్తుంది. ప్రణవి వెళ్లడం చూసిన పల్లవి చక్రధర్ కు కాల్ చేస్తుంది. అనుకున్నట్లుగా ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఏడ్పిస్తారు. అయితే వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్లిన ప్రణవి ఇంట్లో వాళ్లకు చెబుతుంది.
ఆ టీజ్ చేసిన వాళ్ళు ప్రణవి చున్నీని తీసుకొని భరత్ కు ఇస్తారు. ఎవరు మీరు అనుకుంటారు. అప్పుడే పల్లవి భరత్ కు ఫోన్ చేసి ముందుకు రా నేను వస్తున్నా అంటుంది.. అది నమ్మిన భరత్ అలా వెళ్తాడు. భరత్ చేతిలో చున్నీని చూసిన అక్షయ్ చెప్తున్నా వినకుండా కొడతాడు. అవని ఆప లేకపోయింది. ఇక రేపటి ఎపిసోడ్ లో అవని నిజం చెబుతుందేమో చూడాలి.