Intinti Ramayanam Today Episode November 14th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే… గుడిలోకి వెళ్లిన అందరు సంతోషంగా ఉంటారు. అది చూసి ఓర్వలేక పోతుంది పల్లవి.. ఈ సంతోషాన్ని దూరం చెయ్యాలని అనుకుంటుంది. అందరు పూజలో నిమగ్నమయ్యారు. ఇక ఇప్పుడు మనం ప్లాన్ వర్కౌట్ చెయ్యాలని చక్రధర్తో అంటుంది. చక్రధర్ ప్రణవిని ఏడ్పించాలని ఇద్దరు కుర్రాళ్ళను గుడిలోకి పంపిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ప్రణవిని కావాలనే ఏడపిస్తారు. అసభ్యంగా బిహేవ్ చేస్తారు. అంతేకాదు ప్రణవి చున్నీని లాక్కుంటారు. ఇక ప్రణవి వాళ్ళను చూసి భయంతో పరుగులు తీస్తుంది. గుడిలో పూజలో ఉన్న తన వాళ్లకు చెబుతుంది. ఇద్దరు వెదవలు తనను అసభ్యంగా మాట్లాడి ఏడ్పినుంచినట్లు చెబుతుంది. అప్పుడే ఎదురుగా వచ్చిన భరత్ చేతిలో చున్నీ పెట్టి వెళ్ళిపోతారు. ఇక భరత్ చేతిలో చున్నీని చూసి అక్షయ్ కోపంతో భరత్ ను కొడతారు. అంతేకాదు అవని అడ్డుకున్నా కూడా ఎవరి వినరు. భరత్ ను పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తారు.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణవి ని ఇలా చేసినందుకు ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ప్రణవి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడే అందరూ ఇంట్లోకి వస్తారు. ఆ వెధవని ఏం చేశారండి అని పార్వతి రాజేంద్రప్రసాద్ ని అడుగుతుంది. వాడిని పోలీసులుకు అప్పగించాం ఇక వాళ్లే చూసుకుంటారు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అలాంటి వాడికి ఒక్కరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఐదేళ్లు జైలు శిక్ష పడాలని కమలంటాడు అది విన్న అవని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక పార్వతి అబ్బాయి అవనితోపాటు అనాధాశ్రమంలో పెరిగాడు అందుకే బాధపడుతుందని అంటుంది. దానికి అక్షయ్ బాధపడితే బాధపడనివ్వు వాడు చేసిన పనికి ఏమనాలి అని అక్షయ్ కోప్పడతాడు. ప్రణవి ఇదంతా మర్చిపో ఇలా జరిగినందుకు బాధపడకు వాడిని ఇంకా ఇప్పట్లో వదలరు పోలీసులు అని అంటాడు.
ఇక అవని ఒక్కటే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అవనిని అలా చూసిన పల్లవి సైలెంట్ గా బాధపడడం కాదు నువ్వు ఇంకా కుళ్ళుకుని పడుకొని బాధపడడం నేను చూడాలని అవని దగ్గరికి వెళుతుంది. చూసావా అక్క నీ తమ్ముడిని కాలర్ పట్టుకుని అందరూ కొట్టి మరి పోలీస్ స్టేషన్ లో పెట్టారు అంటే నీవు చెప్పిన మాట కూడా వినట్లేదని అర్థం చేసుకో అక్క ఇంట్లో వాళ్ళకి నువ్వేంటోనీ విలువెంటో అని వార్నింగ్ ఇస్తుంది. ఒకప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు ఇప్పుడు నువ్వు వినట్లేదు అంటే ఇక నీ విలువెంటో ఇంట్లో అర్థం చేసుకో అనేసి పల్లవి చురకలాంటిస్తుంది. దానికి అవని నీ తెలివితేటలు నాదగ్గర ప్రదర్శించకు ఇంకెవరి దగ్గరైనా ప్రదర్శించుకో అని పల్లవికి కౌంటర్ ఇస్తుంది. ఈ వంకతో నాకు నా కుటుంబానికి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావేమో అది నీ వల్ల కాదు నువ్వు అనుకుంటున్నాటు అంతేమీ లేదు నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో నన్ను ఎలా చూసుకోవాలో నా కుటుంబానికి బాగా తెలుసు అని పల్లవికి అవని వార్నింగ్ ఇస్తుంది.
నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు నువ్వు వెళ్లి ఇంకెవరి దగ్గరైన చూపించుకొని అవని అనగానే పల్లవి షాక్ అవుతుంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు అని పల్లవి లో లోపల అనుకుంటుంది. ఇక అక్కడినుంచి వెళ్ళిన పల్లవి లోపలికి వెళ్లి సంతోషంతో గంతులు వేస్తూ డాన్స్ చేస్తుంది. పల్లవి డాన్స్ చేయడం ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. తను కడుపుతో ఉన్న సంగతి మర్చిపోయి ఉంటారు. ఇక ప్రణవి దగ్గరికి వచ్చి పల్లవిని అంత జరిగితే నువ్వు సంతోషంగా డాన్స్ చేస్తున్నావా ఇంట్లో అంత జరిగితే నువ్వు ఇలా గెంతులు వేస్తావని ప్రణవి అంటుంది. పార్వతీ కూడా ఇంట్లో ఏదైనా జరిగితే నువ్విలా సంతోష పడతావా ఇంట్లో వాళ్ళు బాధపడడం నీకు అంతో సంతోషమా అని క్లాస్ పీకుతుంది. ఇక బామ్మ కూడా తన వంతు క్లాస్ పీకుతుంది. అప్పుడే కమల్ వస్తాడు. ఏమైంది అసలు ఎందుకు పల్లవి అని అంటున్నారు అని అనగానే పార్వతి ఇంట్లో ఇంత జరిగితే ఎవరైనా పరామర్శిస్తారు కానీ నీ భార్య మాత్రం డాన్సులు వేస్తుందని అనగానే కమల్ ఇప్పుడు నాకు అర్థమైంది. పల్లవికి ఏదైనా బాధ వచ్చినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు డాన్సులు వేయడం అలవాటు అని అంటాడు. పల్లవికి టెన్షన్ వచ్చినప్పుడు డాన్సులు వేస్తుంది అని కమల్ క్లారిటీ ఇస్తాడు. ఆ విషయం నిన్న అందరూ షాక్ అవుతారు.
ఇక పల్లవి అలవాటు విన్న అందరూ పల్లవిని అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే పల్లవి ఇంత సంతోషంగా భోజనం చేస్తే నాకేం బాగుంటుంది ఏదో ఒకటి అనాలి అని అవని ఏంటి ఇంకా రాలేదు బావగారు అని అక్షయ్ ని అడుగుతుంది. ఇక భరత్ ని అలా చేయడం వెనక అక్క ఫీల్ అవుతుంది ఆ ప్రణవికి ఇలా జరిగితే ఎవరైనా నాలుగు పీకాలి కానీ వాన్ని వెనకేసుకొని వస్తుంది ఏంటి అని మళ్ళీ గొడవలు పెడుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ అవని ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతాడు ఏమో నాకేం తెలుసు అని అక్షయ్ సమాధానం చెప్తాడు . అదేంటి నీ భార్య గురించి నీకు తెలియదా అని రాజేంద్రప్రసాద్ వెళ్లి అవినీతి తీసుకురా అని చెప్పగానే అక్షయ్ వెళ్లి అవనిని తీసుకొని వస్తాడు. అవని అన్నం తినడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అన్నం తినిపిస్తాడు. అక్కడితో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ లంచ్ బాక్స్ ఎవరు పెట్టారని అడుగుతాడు. నేనే పెట్టానని అవని అంటుంది. దాంతో బాక్స్ ను విసిరి కొడతాడు. తమాషా పడుతున్నావా ఏం చేస్తున్నా నువ్వు అసలు అని అక్షయ్ అందరి ముందు అడుగుతాడు. దానికి అందరు షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..