Intinti Ramayanam Today Episode November 17th : నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ ఆఫీస్ కు తీసుకొని వెళ్తాడు. అక్కడ డైనింగ్ హాల్ ను ఓపెన్ చేస్తాడు. అందరం కలిసి భోజనం చేద్దాం అని అక్షయ్ అంటాడు. ఇక కమల్ తింటూ టీవీ చూస్తూ ఉంటాడు. ఆఫీస్ కి ఎక్కట్టాలని దొంగ నాటకాలు వేసి నాకు కాఫీ మీద సాకు పెట్టావు కదా అనేసి అడుగుతుంది బామ్మ . ఈ విషయాన్ని నాన్నకు చెప్తానంటే నీ గురించి కూడా నేను నాన్నకు చెప్తానని కమలంటాడు. అప్పుడే ఇంటికి చక్రధర్ రాజేశ్వరిలు వస్తారు. ఇక అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. పల్లవిని మాట్లాడాలని పక్కకు తీసుకెళ్తుంది రాజేశ్వరి. నీకు ఈ కడుపు ఇష్టం లేదా.. ఆ సంతోషం లేదు అని అడుగుతుంది. ఇంటికి నువ్వు వారసుడు ఇవ్వబోతున్నావని సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇది నీళ్లు ఈ బిడ్డ ఇంటి వారసుడని మర్చిపోయి అబార్షన్లు గిబాషను చేయించుకోవాలని చూసావంటే మర్యాదగా ఉండదు. నువ్వు మీ నాన్న ఏ ప్లాన్లు వేస్తున్నారు నాకు తెలుసు అనేసి రాజేశ్వరి పల్లవిని అంటుంది. ఇక అప్పుడే పల్లవి దగ్గరికి చక్రధర వస్తాడు. అందరు కలిసి భోజనం చేస్తారు. ఆ తర్వాత సాంబార్ కోసం కమల్ చేసిన పనికి చక్రధర్ పై సాంబార్ పడుతుంది. దాన్ని కడుక్కుంటాడు. ఇక మాకు ఇంట్లో పని ఉంది చాలా పనులు ఉన్నాయి ఈసారి వచ్చినప్పుడు రెండు రోజులు తప్పకుండా ఉంటామని చక్రధర రాజేశ్వరిలు ఇంటికి వెళ్లి పోతారు. పల్లవి అవనిని చూసి నవ్వుకో ఇంకాసేపట్లో బావగారు వస్తారు. నీ పని అయిపోతుంది మీ ఇద్దరి మధ్య దూరం ఇంకాస్త పెరిగిపోతుందని మనసులో అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అందరూ సంతోషంగా టీవీ చూస్తుంటే పల్లవి అది చూసి ఓర్చుకోలేక పోతుంది. వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉంటే నా పగ ఎలా తీరుతుంది అని లో లోపల రగిలిపోతుంది. వీళ్ళ నవ్వుని ఎలాగైనా దూరం చేయాలని పల్లవి అనుకుంటుంది. ఇక సీరియల్స్ పెట్టుకుని చూస్తుంటే ప్రణవి సినిమాలు పెట్టొచ్చు కదా అని అడుగుతుంది. దానికి బామ్మ ఇప్పట్లో సినిమాలు లేవు ఈ సీరియల్ అని అయిపోయిన తర్వాతే సినిమాలు పెడతానని అంటుంది. టీవీ చూస్తే ఆయుష్ తగ్గిపోతుంది నువ్వు ముసలిదానివి అయిపోతావని కమల్ అంటాడు. దానికి అందరూ నవ్వుకుంటారు. అవనీ కూడా సరదాగా నవ్వుకుంటుంది. అవని నవ్వును చూసి నవ్వుకో ఇంకా సేపట్లో బావగారు వస్తారు ఈ నవ్వు ఇక దూరమైపోతుంది అని అనుకుంటుంది. ఇక అప్పుడే అక్షయ్ ఇంట్లోకి వస్తాడు. ప్రణవి అన్నయ్య వచ్చాడు అని అంటుంది. అక్షయ్ రాగానే కోపంగా అందరు వంక చూస్తాడు.
అవని ముందుకొచ్చి ఏమైందండీ అని అడుగుతుంది. బాక్సుల ఇవ్వండి అని అనగానే అక్షయ్ ఆ బాక్స్ ను నేలకు విసిరి కొడతాడు. ఏమైంది ఎందుకంత కోపం ఉన్నావని అందరూ అడుగుతారు. ఈ బాక్స్ చేసిందెవరు పెట్టిందెవరు అని అడుగుతారు. నేనే చేశాను నేనే పెట్టాను ఏమైందండీ అని అవని అడుగుతుంది. మనుషులు తినడానికి ఇది పెట్టావా అనేసి అవని నోటికొచ్చినట్లు అంటాడు. బయట వాళ్ల మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో భర్త మీద లేదు అందుకే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయేమో అనేసి అందరు ముందర అవనిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. మధ్యలో పార్వతి కలగజేసుకుని ఏమైంది రా నీకు ఎందుకిలా మాట్లాడుతున్నావ్ ఇంట్లో అందరూ అదే అన్నం తిన్నారు మరి ఎవరికీ ఏమీ కాలేదు. నువ్వు ఎందుకిలా కోపంగా ఉంటున్నావని అంటుంది. దాంతో ఏం మాట్లాడలేక అక్షయ్ లోపలికి వెళ్ళిపోతాడు. అక్షయ్ అవని పై అరవడం చూసి పల్లవి సంతోషంతో చిందులేస్తుంది.
అవని వంట గదిలో కెళ్ళి బాధపడుతుంటే పార్వతి అక్కడికి వెళ్తుంది. అక్షయ్ అన్న మాటలకి బాధపడుతున్నావా అమ్మ అనేసి పార్వతి అనగానే లేదు అత్తయ్య అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియట్లేదు అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. పార్వతి అవని మాట్లాడుకోవడం పల్లవి వింటుంది. ఆయనకు ఈమధ్య నామీద చిన్న చిన్న విషయానికి విసుక్కుంటున్నాడు కోప్పడుతున్నాడు అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అనేది అంటుంది. ఆఫీసులో ఏదో టెన్షన్ ల వల్ల వాడు అలా మాట్లాడుతున్నాడు కానీ వాడికి నీ మీద ప్రేమ లేదా చెప్పు అని పార్వతి ఓదారుస్తుంది. ఇక ఉదయం లేవగానే అవని బయటికి వెళ్లడం చూసి బామ్మ పార్వతి అడుగుతారు. ఎక్కడికెళ్లావ్ అవని అని అడగ్గాని వెనకాల అక్షయ్ వచ్చి తను ఎక్కడికెళ్ళిందో నాకు తెలుసు నేను చెప్తానని అంటాడు. ప్రణవి ఏడిపించినందుకు మనం ఆ భరత్ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం అని విడిపించడానికి వెళ్ళింది. లాయర్ నాకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు అని నిజం చెప్తాడు. అసలు భరత్ కి నీకు ఏమైనా సంబంధం ఏంటి ఒక అనాధ కోసం ఇంతగా ఫీల్ అవుతున్నావా ప్రణవి నేర్పించింది నువ్వు మర్చిపోయావని అక్షయతో పాటు ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. ఇక అవని ఈ సమస్యల నుంచి బయటపడేందుకు అమ్మకు ఇచ్చిన మాటను పక్కనపెట్టి అసలు నిజాన్ని బయట పెట్టబోతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..