Intinti Ramayanam Today Episode November 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవని అక్షయ్ అన్న మాటలకి బాధపడుతున్నావా అని పార్వతి అడుగుతుంది. అసలు పొరపాటు ఎక్కడ జరిగింది అనగానే ఏమో అదే అర్థం కావడం లేదమ్మా అని అవని అంటుంది.. తప్పు ఎక్కడ జరిగిందో తెలియట్లేదు అని ఆలోచిస్తున్నాను అని అంటుంది. పార్వతి అవని మాట్లాడుకోవడం పల్లవి వింటుంది. ఆయనకు ఈమధ్య నామీద చిన్న విషయానికి విసుక్కుంటున్నాడు కోప్పడుతున్నాడు అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అనేది అంటుంది. ఆఫీసులో ఏదో టెన్షన్ ల వల్ల వాడు అలా మాట్లాడుతున్నాడు.. ఇక ఆఫీస్ లో అందరు అలా అనడంతో భాద కోపడ్డాడు. అంతే వాడి ఆవేశం తగ్గితే మళ్లీ వాడే వచ్చి సారీ చెబుతాడు అని అంటుంది. ఇక ఆ విషయాన్ని పల్లవి వింటుంది. అవని దగ్గరకు పల్లవి వస్తుంది. నువ్విలా బాధపడుతుంటే చూడలేని అక్క అనేసి పల్లవి అంటుంది. ఈ చిన్నదానికే ఇంతగా బాధపడితే ముందు ముందు ఇంకెన్ని చూడాలో అనేసి పల్లవి అనగానే ఇదంతా చేసింది నువ్వేనా అని అడుగుతుంది. నువ్వు తెలివైన దానివి అక్క ఇదంతా చేసింది నేనే అని పల్లవి అవనితో అంటుంది. దానికి చెంప పగలగొడుతుంది. ఇక అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. అవని విషయంలో మరోసారి అక్షయ్ కోపడుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కమల్ పల్లవిని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాడు. పల్లవి కోసం ప్రూట్ సలాడ్ ను చేసి తీసుకొని వస్తాడు. దానికి పల్లవి నాకొద్దు అంటుంది. కానీ కమల్ బలవంతంగా తినమని అంటాడు. కానీ పల్లవి నాకొద్దు అనేసి అంటుంది. అంతలోకే బామ్మ అక్కడికి వస్తుంది. ఏమైందమ్మా అంటే చూడు బామ్మ వద్దంటున్న కూడా నాకు బలవంతంగా పెడుతున్నాడని పల్లవి అంటుంది. దానికి నేను ప్రేమగా చూసుకునే భర్త ప్రేమగా తినిపించే భర్త దొరకడం అదృష్టం అనగానే కమల్ ఇకనైనా తింటావా అనేసి పల్లవి నంటాడు. భార్యాభర్తల ప్రేమగా ఉంటే మధ్యలో నువ్వు ఎందుకని కమలంటున్నాడు బామ్మ వెళ్లి పోతుంది. ఇక భరత్ అవని కలిసి వెళ్లడం చూసిన చక్రధర్ వాళ్ళను ఫాలో చేస్తూ వెళ్తాడు.. హాస్పిటల్ ని చూడగానే చక్రధర్ ఇది మీనాక్షి ఉండే హాస్పిటల్ కదా అనేసి వెనక్కి వెళ్ళిపోతుంటాడు.
మీనాక్షి ఉంటే నాకేంటి నేను అవినీ ఎందుకు వెళ్తుంది అని చూసి వీరిద్దరు ఎవరితో మాట్లాడుతున్నారని పల్లవికి ఒక ఫోటో పెడితే సరిపోతుంది కదా అనేసి కర్చీఫ్ కట్టుకొని లోపలికి వెళ్తాడు. అవని మీనాక్షి కూతురు అని నిజం తెలుసుకుంటాడు చక్రధర్.. వీరికంటే నేను పడకుండా బయటికి వెళ్లాలని బయటకు వెళ్ళిపోతాడు. ఇక పల్లవి డాడీ ఇంకా ఫోటో పెట్టలేదని కాల్ చేస్తుంది. చక్రధర్ కాల్ కట్ చేస్తాడు. ఇక ఇంట్లోకి అవని వస్తుంది. అప్పుడే బామ్మ వెళ్లి ఎక్కడకు వెళ్ళావు? ఇంత పొద్దున్నే ఎక్కడకు వెళ్ళావు అని అడగ్గానే, కమల్ కూడా నువ్వు లేవని ఆరాద్యను స్కూల్ కు తీసుకెళ్ళలేదు అని కమల్ అనగానే పార్వతి వచ్చి ఎక్కడకు వెళ్ళావు అవని ఒక మాట చెప్పి వెళ్తే బెటర్ కదా అని అంటుంది. అప్పుడే అక్కడకు అక్షయ్ అక్కడకు వస్తాడు. అసలు నిజం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అని అక్షయ్ అంటాడు. నువ్వు ఎలాగో నిజం చెప్పవు.. నేనే చెప్తాను అని అక్షయ్ అంటాడు. మనం పోలీసులకు పట్టించిన ఆ భరత్ ను విడిపించింది అని అక్షయ్ అంటాడు. దానికి అందరు తలా ఒక మాట అంటారు. ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని పల్లవి రెచ్చిపోతుంది. పార్వతి కూడా అంటుంది.. ఇక రాజేంద్ర ప్రసాద్ కు ఈ విషయం తెలియకుండా ఉండాలని అనుకుంటారు.
ఇక రాత్రి వినోద్, ప్రణవి, కమల్ అందరు కలిసి రాజేంద్ర ప్రసాద్ కు నిజం తెలియనివ్వొద్దు అని అనుకుంటారు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అక్కడ వస్తాడు. అందరు మౌనంగా ఉండటంతో ఏమైందని అడుగుతారు. పల్లవి నోరు జారుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..