Brahmamudi serial today Episode: జగదీష్ చంద్ర ప్రసాద్‌తో డీల్ సెట్ చేసుకుని ఆయన్ని పంపిస్తాడు రాజ్. కావ్య సైలెంట్ గా ఉండిపోతుంది. కావ్య దగ్గరకు వచ్చిన రాజ్ పందెంలో గెలిచిన వాళ్లు ఏం చేయాలో తెలుసు కదా..? అటాడు. స్టాఫ్‌ను పిలవగానే వచ్చి సార్ మీరు చెప్పినట్టే రిజైన్ లెటర్ రెడీ చేశాను అంటాడు. ఆవిడకు ఇవ్వు అంటాడు రాజ్. లెటర్ తీసుకుని అందులో సైన్ చేస్తుంది కావ్య. ఇక ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా..? ఓడిపోయిన నువ్వు ఈ కంపెనీ నుంచే కాదు నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్లిపోవాల్సిందే అని చెప్పడంతో కావ్య బాధగా చూస్తుంటుంది. సీఈవో పదవి పోయింది ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తున్నావా..? నువ్వేం బాధపడకు నీకు సరిపడా జాబ్ ఎక్కడైనా తెలిసిన కంపెనీలో చూస్తునులే అంటాడు రాజ్.
దీంతో కావ్య కోపంగా నా తల్లిదండ్రులు నన్ను ఆత్మాభిమానంతో బతికేలా పెంచారు. ఇంకొకరి దగ్గరకు వెళ్లి దేహి అని బతికేలా పెంచలేదు అంటూ తిడుతుంది. అయితే మరీ సంతోషం. మళ్లీ నా కంపెనీ నా చేతుల్లోకి వచ్చింది. ఈ కంపెనీకి మళ్లీ పూర్వవైభవం రాబోతుంది. ఒక్క నిమిషం వెళ్లే ముందు నీకో చిన్న అప్రిషియేషన్. అంటూ అందరిని పిలుస్తారు. స్టాఫ్ అందరూ వచ్చి డల్లుగా అలాగే చూస్తుండిపోతారు. ఏంటి మీ మేడం వెళ్లిపోతుందని బాధపడుతున్నారా..? సరే మీ మేడంకు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి.
ఓ బాధపడుతున్నారా..? సరే మేడంతో పాటు వీళ్లు వెళ్లిపోతారేమో అందరికీ టెర్మినేషన్ లెటర్ రెడీ చేయ్ శృతి అని చెప్పగానే అందరూ కావ్యకు ఆల్ ది బెస్ట్ చెప్తారు. రాజ్ కూడా కావ్యకు బొకే ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. కావ్య బాధగా ఆఫీసులోంచి వెళ్లిపోతుంది. శృతి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. నువ్వు ఇక్కడే ఉండు ఇక నుంచి నువ్వు నా పక్కనే ఉండాలి. ఇఇక్కడ జరిగేవన్నీ అక్కడకు అదే మీ మేడంకు చేరవేయాలి. అలాగే నా ఎదుగుదలను కూడా మొత్తం మీ మేడమ్ కు నువ్వే చెప్పాలి అంటాడు. శృతి బాధగా చూస్తుంటుంది.
లిరిక్ రైటర్ లక్ష్మీకాంత్ దగ్గరకు వెళ్తాడు కళ్యాణ్. కళ్యాణ్‌ను చూసిన రైటర్ నేను చెప్పిన పాటలు రాశావా? అని అడుగుతాడు. రాశాను సార్ అంటూ పేపర్స్ తీసి లక్ష్మీకాంత్‌కు ఇస్తాడు. పాటలు చూసిన రైటర్ నాకు తెలుసు నీకిచ్చిన అవకావం నువ్వు సద్వినియోగం చేసుకుంటావని. ఎదిగే వాళ్ల లక్షణం ఇదే. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలారా దీవిస్తాను. మా లాంటి వాళ్ల దీవెనలు నీకు ఉపకరిస్తాయి. అనగానే కళ్యాణ్ అయోమయంగా చూస్తుంటాడు. నిన్నేనయ్యా ఇలా రా దీవిస్తాను అనగానే కళ్యాణ్ వెళ్లి రైటర్ పాదాల దగ్గర కూర్చుంటాడు.
నీలో ఉన్న సాహిత్యం ఇలాగే దినదినాభివృద్ది చెందాలని.. అది నాకు ఉపయోగపడాలని దీవిస్తాడు. కళ్యాణ్ నిరాశగా చూస్తుంటే జీవితాంతం కాదులేవయ్యా.. జస్ట్ మూడేళ్లే కదా..? అంటాడు. ఇంతలో ఒక ప్రొడ్యూసర్ సాంగ్ కోసం వస్తే కళ్యాణ్ రాసిన పాటను ఆయను ఇచ్చి ఆయనకు కళ్యాణ్ చేత కాఫీ తెప్పిస్తాడు. ప్రొడ్యూసర్ వెళ్లిపోయాక కళ్యాణ్‌కు పదివేల రూపాయలు ఇస్తూ.. మరో పాట రాయమని చెప్తాడు.
ఇంట్లో కనకం హడావిడి చేస్తుంది. కావ్య వస్తువులన్నీ బ్యాగులో సర్దుతుంది ఇంకేమైనా మర్చిపోయానా..? అంటూ అనుమానంగా చూస్తుంది. ఇంతలో మూర్తి వచ్చి బ్రష్, నాలుక గీసుకునే బద్ద పెట్టావా? అని అడుగుతాడు. దీంతో కనకం అది కాదయ్యా మళ్లీ అక్కడ అమ్మాయికి ఏమైనా అవసరం పడుతుందేమోనని అంటుంది. నువ్వు అమ్మాయిని అమెరికా పంపిచటం లేదే..అత్తారింటికి పంపిస్తున్నావు అని మూర్తి చెప్పగానే అత్తారింటికి పంపిస్తున్నాము కాబట్టే ఈ కంగారు అంటుంది కనకం.
ఇప్పుడు చూడు నా కూతురు పందెంలో గెలిచానని సంతోషంగా వస్తుంది చూడు అని కనకం చెప్తుండగానే కావ్య డల్లుగా వస్తుంది. పందెంలో ఓడిపోయానని చెప్తుంది. కనకం, మూర్తి షాక్ అవుతారు. ఇక జీవితంలో నేను ఎప్పటికీ ఆ ఇంటికి వెళ్లలేనని.. మా బంధం తెగిపోయిందని.. బాధగా చెప్తుంది. బాధపడుతున్న కనకం, మూర్తిలను ఇదంతా ఒక పీడకల అనుకుని మర్చిపోండి అంటూ చెప్పి లోపలికి వెళ్తుంది. కావ్య బాధను చూడలేక కనకం, మూర్తి ఎమోషనల్ అవుతారు.
పందెంలో ఓడిపోయిన రాజ్ మాట ప్రకారం కావ్యను తీసుకుని ఇంటికి వస్తాడని కావ్యకు ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తుంది అపర్ణ. ఇంతలో సుభాష్ వచ్చి ఏం చేస్తున్నావని అడిగితే మన కొడుకు పందెంలో ఓడిపోయి ఇంటికి వస్తాడు కదా..? అందుకే హారతి ఇద్దామని రెడీ చేస్తున్నాను అంటుంది. ఓడిపోయిన వాడికి హారతి పట్టడం ఏంటని సుభాష్ అడిగితే పందెంలో ఓడిపోయిన రాజ్ తనతో కావ్యను తీసుకుని వస్తాడని అందుకే కావ్యకు హారతి ఇస్తాను అంటుంది.
ఇంతలో ఇందిరాదేవి అక్కడకు వచ్చి ఏంటి రాజ్ ఓడిపోయాడా..? అంటుంది. ప్రకాష్ వచ్చి న్యూస్ ఆఫీసును నుంచి వచ్చిందా..? అని అడుగుతాడు. రాలేదని ఎలాగైనా అదే కదా జరిగేది అని స్వప్న చెప్తుంది. ఇంతలో రాజ్ ఒక్కడే కారులో వస్తాడు. కారు సౌండ్ విని అందరూ రాజ్, కావ్యను తీసుకొచ్చినట్టు ఉన్నాడు బయట వెళ్దాం పదండి అని వెళ్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.