Intinti Ramayanam Today Episode November 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ అవనికి ఇచ్చిన టైం అయిపోతుందని ఇంట్లో అందరు టెన్షన్ పడుతుంటారు. ఆయన మహా మొండి మనిషి అని ఎవరు చెప్పినా వినడు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. ఇక మరి ఏ ఈయన నిర్ణయం తీసుకుంటాడో అని పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆయన ఇచ్చిన టైం అయిపోతుంది ఇంకా తెలియలేదని టెన్షన్ పడిపోతుంది పార్వతి. అవని నీకు ఇచ్చిన టైం అయిపోవడానికి ఇంకా అరగంట మాత్రమే ఉంది మరి ఆ భరత్ నిర్దోషిని నిరూపించడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. కానీ అవని ఏం మాట్లాడదు. ఇంట్లో అందరు అవనిని చూసి టెన్షన్ పడతారు. కానీ పల్లవి మాత్రం క్లాస్ పీకుతుంది. టైం అయిపోవడంతో రాజేంద్రప్రసాద్ నిర్ణయం చెప్పే లోపు చక్రధర్ ఆ ఇద్దరినీ తీసుకొచ్చి అవని తప్పులేదని చెప్పి పల్లవికి షాక్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. తన తండ్రి ఎందుకు తప్పు చేశాడు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అవని అక్కడికొస్తుంది. ఏంటి పల్లవి ఇదంతా ఎలా జరిగింది. అని జుట్టు పీక్కుంటున్నావా ఏంటి అనేసి పల్లవి అడుగుతుంది. మీ నాన్న ఎందుకు వాళ్ళని తీసుకొచ్చాడు ఎందుకు నిజం చెప్పేలా చేశాడని ఆలోచిస్తున్నావు కదా అందుకు కారణం ఈ వీడియోనే ఇదంతా నువ్వు చేసావని నా తమ్ముని వాడుకొని నన్ను దోషిని చేద్దామని అనుకున్నావు ఇది ఒకసారి చూస్తే నీకే అర్థమవుతుందని అవని చెప్తుంది. ఆ వీడియోని చూసిన పల్లవి షాక్ అవుతుంది. ఈరోజు నువ్వు నా మీద గెలిచావని ఆనందపడకు పల్లవి అంటుంది. దానికి అవని నా అమ్మ తమ్ముడు గురించి నిజం చెప్పాలనుకుంటున్నావా అయితే చెప్పుకో ఈ విషయాన్ని నేను ఇంట్లో చెప్పలేకపోతున్నాను అంటే దానికి కారణం మా అమ్మకి ఇచ్చిన మాటే అని అంటుంది. నువ్వు చెప్తానంటే నాకే ప్రాబ్లం లేదు నేను చెప్పలేంది నువ్వు చెప్పావని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. కొన్ని రోజులుగా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా అని పల్లవికి కౌంటర్ ఇస్తుంది.
ఇక ముందు నా గురించి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించు. ఇప్పటికైనా నీ గురించి నిజం చెప్పాలని నాకు లేదు. ఇంట్లో వాళ్లకి చూపిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇంట్లో వాళ్ళు నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారని అవని అంటుంది. నీ భర్త నీ ఇల్లు నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు అని పల్లవికి అవని వార్నింగ్ ఇస్తుంది. అవని ఇంట్లోకి రాగానే అందరూ సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు. కమల్ స్వీట్స్ తీసుకొని వస్తారు. ఇదేంటి కమల్ అంటే నువ్వు సూపర్ హీరో వదిన నేను చెప్పినట్టుగానే నువ్వు దీంట్లో గెలిచావు అనేసి స్వీట్ పెడతాడు. అలాగే ప్రణవి నీ ధైర్యాన్ని మెచ్చుకొని నీకు ఈ స్వీట్ వదిన అనేసి అంటుంది. ఇక పార్వతి అక్షయ్ నువ్వు స్వీట్ పెట్టమని చెప్తుంది. అక్షయ్ ముందుకొచ్చి ఆగుతాడు. పార్వతి అవనికి షుగర్ ఏం లేదు నువ్వు స్వీట్ పెట్టొచ్చు అనేసి అంటుంది. అవనికి హారతి ఇచ్చి ఇంట్లో వాళ్ళ దిష్టే నీకు తగిలిందనేసి చెప్తుంది. ఇక పల్లవి బామ్మను కూడా కమల్ స్వీట్ పెట్టమని చెప్తాడు.
ఇక చక్రధర్ తన ఫ్రెండ్ కు ఆ వీడియోని చూపిస్తాడు. చెప్పాను కదా అవని తెలివి తక్కువదేమీ కాదు అని అని అంటాడు. అతనికి తన ఫ్రెండు నువ్వు చెప్తే నేను ఏదో అనుకున్నాను కానీ అవని చాలా తెలివైనది నువ్వు అనుకున్నట్టు మీ తెలివిని మించిపోయింది అనేసి అంటాడు. అవని నీ కట్టడి చేయాలంటే కొత్తగా వచ్చిన బంధాలని దూరం చేయాలని సలహా ఇస్తాడు. తన తమ్ముడు అమ్మని చంపేయాలని సలహా ఇవ్వడంతో చక్రధర్ అలానే చేస్తానని అంటాడు. మీనాక్షి తో పాటు ఆ భరత్ ని కూడా దూరం చేయాలని చక్రధరనుకుంటాడు. ఇక అక్షయ్ కోసం తన ఫ్రెండు వెయిట్ చేస్తూ ఉంటాడు. ముందు ఇది తీసుకోరా నీకు ఒక నిజం చెప్పాలి అనేసి అంటాడు. కానీ అక్షయ్ నాకొద్దు అని అంటాడు. ఆ భరత్ నీ భార్య తమ్ముడు అని అంటున్నావు కదా వాళ్ళిద్దరి మధ్య నిజానికి ఎఫైర్ నడుస్తుంది అనేసి చెప్తాడు. మాట వినగానే అక్షయ్ తన ఫ్రెండ్ ని కొడతాడు. భార్య గురించి నువ్వు ఇంత తప్పుగా మాట్లాడుతావా అసలు నీకేం తెలుసు అవని గురించి అని అంటాడు. కొడతావని నేను ఊహించాను కాకపోతే ఈ ఫోటోలను చూడు ఒకసారి అనేసి అంటాడు. పక్కపక్కనే నిల్చుని ఫోటో దిగినంత మాత్రాన ఎఫైర్ అంట కడతావా అనేసి అనగానే అక్షయ్ మరోసారి తనని కొడతాడు. అక్షయ్ మనసులో అనుమానం మొదలవుతుంది. అవని దాస్తున్న ఆ నిజం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..