BigTV English

Maharashtra Election Results: మహాయుతికే మళ్లీ పట్టం.! ఆరుగురిలో ఎవరు సీఎం.?

Maharashtra Election Results: మహాయుతికే మళ్లీ పట్టం.! ఆరుగురిలో ఎవరు సీఎం.?

Maharashtra Election Results: ఇంకెంతో సమయం లేదు. మరికొన్ని గంటల్లోనే.. మహా ధమాకా చూడబోతోంది ఇండియా. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. జనం.. మళ్లీ మహాయుతికే పట్టం కడతారా? లేక.. మహా వికాస్ అఘాడీకే అధికారం అప్పగిస్తారా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిని మించి.. ఇటు ముగ్గురు, అటు ముగ్గురు.. మొత్తం.. మహారాష్ట్ర పాలిటిక్స్‌కి ఫేస్‌గా ఉన్న ఆరుగురు కీలక నేతల్లో.. సీఎం అయ్యేదెవరన్న దానిపై మహా ఉత్కంఠ నెలకొంది. హంగ్ గనక వస్తే.. మహారాష్ట్ర రాజకీయం ఎలా మారబోతోంది?


మహారాష్ట్ర ఫలితాలపై దేశమంతటా ఉత్కంఠ!

ఎగ్జిట్ పోల్స్ ఎన్నొచ్చినా.. ఎగ్జాక్ట్ పోల్స్‌ని మ్యాచ్ చేయలేవ్. కొన్ని కొన్ని సార్లు అవి ఫలితాలకు దగ్గరగా ఉండొచ్చు. అప్పుడప్పుడు మొత్తం తారుమారైపోవచ్చు. కాబట్టి.. ఇప్పుడు.. మహారాష్ట్రలోనూ ఏదైనా జరగొచ్చు. జనం తీర్పు ఎలా ఉండబోతుందనేది.. ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ఈసారి.. మహారాష్ట్రలో మెజారిటీ ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై.. ఆ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఉత్కంఠ నెలకొంది. అధికారంలో ఉన్న మహాయుతి కూటమే జనం జై కొడతారా? లేక.. మహా వికాస్ అఘాడీకి అధికార పగ్గాలు అప్పజెబుతారా? అనే ఆసక్తి నెలకొంది. మరీ ముఖ్యంగా.. ఈసారి సీఎం ఎవరు అవుతారనేది.. మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్. పోలింగ్ ముగిసిన తర్వాత.. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటములు.. ఈసారి అధికారంలోకి వచ్చేది తామేనన్న కాన్ఫిడెన్స్‌తో కనిపించాయ్. అందువల్ల.. ప్రజలు పవర్ ఎవరికి ఇచ్చి ఉంటారనే దానిపై.. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.


మహా వికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందా?

ఈసారి మహారాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచే సూచనలున్నాయని.. కూటమి ప్రభుత్వం గనక ఏర్పడితే.. అది కాంగ్రెస్ నేతృత్వంలోనే ఉంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చెప్పారు. దీనిపై.. మహా వికాస్ అఘాడీలో కొత్త వివాదం తలెత్తింది. మిత్రపక్షం శివసేన నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వచ్చింది. సీఎం ఎవరనే దానిపై.. కూటమి భాగస్వాములంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని.. సంజయ్ రౌత్ చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ గనక నానా పటోలేను ఎంపిక చేస్తే.. ఆ విషయం మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ లాంటి సీనియర్లు ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రజలు గనక మహా వికాస్ అఘాడీకి పట్టం కడితే.. సీఎం పగ్గాలు శరద్ పవార్‌కు అప్పగిస్తారా? లేక.. మళ్లీ ఉద్ధవ్ ఠాక్రేనే ఆ పీఠాన్ని అధిష్టిస్తారా? అనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే.. మహా వికాస్ అఘాడీ.. మహాయుతి ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేస్తూ వచ్చింది. మరి.. దానికి అనుగుణంగా.. ప్రజలు తీర్పు ఇచ్చారా? లేదా? అనేదే.. ఆసక్తి రేపుతోంది.

ఆరుగురు కీలక నేతల్లో సీఎం అయ్యేదెవరు?

మహాయుతి క్యాంప్‌లోనూ నెక్ట్స్ సీఎం ఎవరనే దానిపై అప్పుడే చర్చ మొదలైపోయింది. ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లారు కాబట్టి.. సీఎంగా ఆయనే ఉంటారని శివసేన ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ కామెంట్స్ కూటమిలో కొత్త సెగ పుట్టించాయ్. మరోవైపు.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిసే.. ఈసారి సీఎం అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అదేవిధంగా ఎన్సీపీ నేతలు కూడా తమ అధినేత అజిత్ పవార్‌కు సీఎం పగ్గాలు అప్పజెప్పాలనే ఒత్తిడి తెస్తున్నారు. అయితే.. మహాయుతి కూటమి పక్షాలన్నీ కలిసే ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని ఇంకొందరు నేతలు చెబుతున్నారు. ఈసారి మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదని.. మహాయుతి కూటమి నేతలు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఇందుకు.. ఆ కూటమిలో ఉన్న అంతర్గత చీలికల్ని ఎత్తి చూపుతున్నారు. సోలాపూర్‌లో శివసేన యూబీటీ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ.. ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతివ్వడం లాంటివి గుర్తుచేస్తున్నారు.

Also Read: ఇండియాకు పంపవద్దు.. అమెరికా సుప్రీం కోర్టుకు చేరిన ముంబై పేలుళ్ల కుట్రదారుడు

అయితే.. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ మహాయుతి విజయాన్ని అంచనా వేయగా.. ఇంకొన్ని మాత్రం మహా వికాస్ అఘాడీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ.. ఆశ్చర్యమేమిటంటే… రెండు కూటములు ఎగ్జిట్ పోల్స్‌ని తోసిపుచ్చుతున్నాయ్. పైగా.. హంగ్ వస్తే.. ఇండిపెండెట్లుగా గెలిచిన వారు ఎవరికి మద్దతిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. పైగా.. పెరిగిన పోలింగ్ శాతం కూడా ఈసారి ఫలితాల్లో కీలకంగా మారబోతోంది. 2019 ఎన్నికల్లో 61 శాతం నమోదైన పోలింగ్.. ఈసారి 66 శాతానికి పెరిగింది. మహిళా ఓటర్లు.. ఈసారి ఎవరికి మద్దతుగా నిలబడ్డారనేది కూడా కీలకంగా మారింది. రెండు కూటముల్లో.. అంతర్గత ఉద్రిక్తతలు ఉన్నా.. ఎవరికి వారు విజయం సాధించేది తామే అన్న నమ్మకంతో ఉన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే అనే విషయాన్ని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. ఎన్నికల మాదిరిగానే సీఎం కుర్చీకి కూడా పోటీ గట్టిగానే ఉంటుందనే విషయం అర్థమవుతోంది.

శివసేన, ఎన్సీపీలో ఏది ఒరిజినలో తేలిపోతుందా?

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో కేవలం అధికారం ఎవరిదనేదే కాదు.. ఇంకా చాలా లెక్కలు తేలుతాయ్. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారే అవకాశాలున్నాయ్. ఎందుకంటే.. శివసేన, ఎన్సీపీ చీలికల తర్వాత జరిగిన తొలి ఎన్నికలివి. జనం.. ఏ వర్గానికి అనుకూలంగా ఉన్నారనేది కూడా ఇప్పుడు తేలిపోతుంది. పైగా.. ఇండియా కూటమి భవిష్యత్‌ని కూడా మహారాష్ట్రనే డిసైడ్ చేయబోతోంది.

ఎన్నికల మాదిరిగానే సీఎం కుర్చీకి కూడా గట్టి పోటీ

2019 ఎన్నికల తర్వాత.. మహారాష్ట్రలో పెద్ద పొలిటికల్ హైడ్రామానే నడిచింది. ఐదేళ్ల పాటు పాలన సాగిస్తుందనుకున్న మహా వికాస్ అఘాడీ కూటమి మధ్యలోనే కుప్పకూలింది. ఏక్ నాథ్ షిండే దెబ్బకు.. శివసేన రెండుగా చీలింది. తర్వాత.. బీజేపీ మద్దతుతో షిండే శివసేన అధికార పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు.. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలో శివసేన యూబీటీ నడుస్తోంది. షిండే నాయకత్వంలో మరో శివసేన కొనసాగుతోంది. ఈ చీలిక.. మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. తర్వాత.. రాజకీయం పూర్తిగా మారిపోయింది. మరోవైపు.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్సీపీలోనూ చీలిక వచ్చింది. అజిత్ పవార్ నాయకత్వంలో.. ఎన్సీపీలోనే మరో వర్గం ఏర్పాటైంది. అజిత్ పవార్ తన వర్గంతో.. మహాయుతిలో చేరిపోయారు. మరోవైపు.. శరద్ పవార్ నాయకత్వంలో ఉన్న ఎన్సీపీ అలాగే కొనసాగుతోంది. ఇలా.. గడిచిన ఐదేళ్లలో మహారాష్ట్ర పాలిటిక్స్.. లెక్కలేనన్ని ట్విస్ట్‌లు, టర్న్‌లతో కొనసాగింది.

ఏ కూటమి గెలిచినా.. రెండో వర్గం ఉండదనే చర్చ

ఈ పొలిటికల్ డ్రామా మధ్యే.. ఐదేళ్లు గడిచిపోయాయ్. ఇప్పుడు రాబోయే ఫలితాలతో.. శివసేన, ఎన్సీపీలో ఏది ఒరిజినల్ అనేది తేలిపోతుంది. ఏ కూటమి గెలిచినా.. ఈసారి రెండో వర్గం ఉండదనే చర్చ కూడా జరుగుతోంది. ఎన్సీపీలో అజిత్ పవార్ వర్గం, శరద్ పవార్ వర్గం భవిష్యత్‌ అంతా.. ఈ ఫలితాల మీదే ఆధారపడి ఉంది. ఈ గ్రూప్ అయినా, ఆ గ్రూప్ అయినా.. తక్కువ ఎమ్మెల్యేలు గెలిస్తే.. మరో వర్గంలో గెలిచిన ఎమ్మెల్యేలు.. వెంటనే జంప్ అయిపోతారు. అప్పుడు.. రెండోది ఉండదు. ఒకటే.. మిగులుతుంది. మరోవైపు.. శివసేన ప్యూచర్ కూడా ఈ రిజల్ట్‌తోనే ముడిపడి ఉంది. మహాయుతి గనక మళ్లీ గెలిస్తే.. షిండే శివసేన మరింత బలపడుతుంది. అదే.. మహా వికాస్ అఘాడీ గనక అధికారంలోకి వస్తే.. శివసేన యూబీటీకి పూర్వ వైభవం వస్తుంది. అందువల్ల.. మహారాష్ట్ర ప్రజలు ఏ శివసేనకు మద్దతుగా నిలిచారన్నది ఆసక్తిగా మారింది. మెజారిటీ పబ్లిక్.. ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నారా? లేక షిండేకే మద్దతిచ్చారా? అనేది క్లియర్‌గా తేలిపోతుంది.

ఇండియా కూటమి ఆశలన్నీ మహారాష్ట్ర మీదే!

ఇక.. ఇండియా కూటమికి కూడా మహారాష్ట్ర విజయం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గెలిస్తే.. దేశవ్యాప్తంగా మరింత బలపడే చాన్స్ దొరుకుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేకపోయినా.. బలమైన ప్రతిపక్షంగా నిలిచింది ఇండియా కూటమి. మళ్లీ లోక్ సభ ఎన్నికల వరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితేనే.. ఇండియా కూటమి దేశంలో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు చాన్స్ ఉంటుంది. ఇప్పటికే.. హర్యానా మిస్సైపోయింది. అందుకే.. వాళ్ల ఆశలన్నీ ఇప్పుడు మహారాష్ట్ర మీదే ఉన్నాయ్. ఇక్కడ గనక గెలిస్తే.. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి ఓ పాజిటివ్ వైబ్ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ బలపడే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌లోనూ మళ్లీ కొత్త ఆశలు చిగురిస్తాయ్. ఆ పార్టీకి మరింత బూస్ట్ వస్తుంది. తర్వాత జరిగే మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా మహారాష్ట్ర ఫలితం అనుకూలంగా మారే చాన్స్ ఉంటుంది. ఫలితం తేడాకొడితే మాత్రం ఇండియా కూటమి మరింత డౌన్ అవుతుందనే చర్చ నడుస్తోంది.

మహారాష్ట్ర జనం తీర్పు క్లియర్ కట్‌గా ఇచ్చేశారా?

ఇప్పటికే.. మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల నాయకులు.. ఎవరికి వారు అధికారం ఆశల్లో తేలిపోతున్నారు. కానీ.. ఎగ్జిట్ పోల్స్ చూశాక.. మహారాష్ట్ర జనం తమ తీర్పుని క్లియర్ కట్‌గా ఇచ్చేశారా? లేక.. సగం సగం ఇచ్చారా? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. దాంతో.. అందరిలోనూ ఉత్కంఠ అమాంతం పెరిగిపోయింది. ఎన్నికల ఫలితం వన్ సైడ్ క్లియర్‌గా వచ్చేస్తుందా? లేక.. హంగ్ ఏర్పడుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. హంగ్ గనక వస్తే.. మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. అప్పుడు.. మొదలయ్యే క్యాంప్ పాలిటిక్స్.. మరో స్థాయిలో ఉంటాయ్. ఎవరు.. ఏ గ్రూపులో ఉంటారో.. ఎవరు బలపడతారో.. ఎవరి రాజకీయ రంగేమిటో అప్పుడే తేలిపోతుంది. ఈ ఫలితాలు.. మహారాష్ట్ర రాజకీయాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయనే దానిపై.. దేశమంతటా ఉత్కంఠ నెలకొంది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×