BigTV English

Kannappa : “కన్నప్ప” నుంచి ప్రభాస్ లుక్ లీక్… ఫ్యాన్స్ డిసప్పాయింట్

Kannappa : “కన్నప్ప” నుంచి ప్రభాస్ లుక్ లీక్… ఫ్యాన్స్ డిసప్పాయింట్

Kannappa : ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) గురించే చర్చ నడుస్తోంది. నిన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే (Hombale Films) బ్యానర్ నుంచి వచ్చిన వరుస అప్డేట్లు ప్రభాస్ ఫ్యాన్స్ ను సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ అభిమానులకు భారీ షాక్ ఇచ్చే లీక్ ఒకటి జరిగింది. అది కూడా ‘కన్నప్ప’ (Kannappa) నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ లుక్ లీక్ కావడం అన్నది డిసప్పాయింట్ చేసింది.


ఇండియాలోనే మోస్ట్ బిజియెస్ట్ హీరోగా ఉన్న ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుసగా పలు భారీ ప్రాజెక్టుల్లో భాగమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కేవలం హీరోగానే కాకుండా సాలిడ్ క్యామియో ఒకటి చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa) మూవీ లో పాన్ ఇండియా వైడ్ గా చాలా మంది బిగ్ స్టార్స్ భాగమైన సంగతి తెలిసిందే. అందులో ప్రభాస్ కూడా ఉన్నారు. ఆయన ఈ సినిమాలో నందిగా కనిపించబోతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభాస్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ను ఇవ్వలేదు మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ లో కూడా కేవలం ప్రభాస్ కళ్ళను మాత్రమే చూపించి భారీ హైప్ పెంచారు. ఆ కళ్ళను చూసే అభిమానులు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోయారు. దీంతో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అప్పటినుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ తాజాగా బయటకు వచ్చిన లీక్ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లింది.

అందరికీ షాక్ ఇచ్చే విధంగా ‘కన్నప్ప’ (Kannappa) మూవీ నుంచి ప్రభాస్ (Prabhas) లుక్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో కొంతమంది అభిమానులు ప్రభాస్ లుక్ చూసి సంతోష పడినప్పటికీ, చాలామంది ప్రభాస్ లుక్ ఇలా లీక్ అవ్వడంతో సినిమాపై ఉన్న అంచనాలు,  ప్రభాస్ లుక్ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న తమ మూడు, ఉత్సాహం అన్నీ నీరుగారేలా చేశారు అంటూ లీక్ రాయుళ్లపై మండిపడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి లీక్స్ ను స్వయంగా చిత్ర బృందంలో నుంచి ఎవరో ఒకరు లీక్ చేస్తే తప్ప బయటకు రావని, మరి మేకర్స్ జాగ్రత్త పడకుండా ఏం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రభాస్ (Prabhas) తాజాగా హోంబలే ఫిలిమ్స్ తో వరుసగా మూడు బిగ్ ప్రాజెక్ట్స్ డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాల కోసం ఆయన 600 కోట్ల భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మూవీతో బిజీగా ఉండగా, మరోవైపు హోంబలే ఫిలిమ్స్ ‘సలార్ 2’ షూటింగ్ మొదలైంది అంటూ నిన్ననే అప్డేట్ ఇచ్చింది. అలా నిన్న మొత్తం ట్రెండింగ్ లో ఉన్న ప్రభాస్ ఈరోజు ‘కన్నప్ప’ లీక్ తో ట్రెండ్ అవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×