BigTV English

Intinti Ramayanam Today Episode: ఆశ్రమంలో అవని పుట్టినరోజు వేడుకలు.. అవని తల్లి ఎవరో తెలిసిపోతుందా?

Intinti Ramayanam Today Episode: ఆశ్రమంలో అవని పుట్టినరోజు వేడుకలు.. అవని తల్లి ఎవరో తెలిసిపోతుందా?

Intinti Ramayanam Today Episode October 11th: నిన్నటి ఎపిసోడ్ లో చూస్తే.. రాజేంద్ర ప్రసాద్ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అవని అక్కడకు రావడంతో అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. ఇక అక్షయ్, అవని ఆరాధ్య లకు ఒక చెక్కును ఇస్తాడు. ఇక పల్లవి ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటుంది. ఇక అందరు కలిసి ఆశ్రమానికి వెళ్తారు. అప్పుడే ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడుతుంది. ఆమెను చూసుకున్న అవని నీళ్లు ఇచ్చి వెళ్తుంది. అందరు ఆశ్రమంలోకి ఎంట్రీ ఇస్తారు. అక్కడ పిల్లలతో కలిసి అవని కేకును కట్ చేస్తుంది. కమల్ అవని చిన్నప్పటి ఫోటోను గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసిన అనాదాశ్రమం ఆవిడ ఎక్కడో చూసాను అనుకుంటుంది. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ లో.. అందరు కలిసి అవని బర్త్ డే వేడుకలను చెయ్యడానికి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత పల్లవి ఇలాంటి చోటుకు రావాలంటే ఏదోలా ఉంది అని చిరాగ్గా ఫీల్ అవుతుంది.. ఇక అవని లోపలికి రాగానే అక్కడ ఉన్న పిల్లలు అందరు అవనికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. ఇక లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక భరత్ రోడ్డు మీద వెళ్తుంటే కారు వచ్చి గుద్దేస్తుంది. ముందుకి వెళ్లి కారు ఆపుతారు. ఎవరు రోడ్ల మీద కార్లతో మనుషులను గుద్దేస్తారా అని అడుగుతాడు. అప్పుడు అందులో అమ్మాయి ఉండటం చూసి దిగు బయటకు అంటాడు. నేను కావాలని గుద్దలేదు అంటుంది. నీకు ఎంత పొగరు అంటాడు. నిన్న వంద ఇవ్వమంటే ఇవ్వలేదు.. కానీ ఈరోజు ఇంత పొగరుగా సమాధానం చెబుతావా అని అంటాడు భరత్.. సారి బ్రేక్ పడలేదు అంటుంది. దానికి ఆ అమ్మాయి దాబాయిస్తుంది.. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. ఇక భరత్ ఆమెను వదిలేసి వెళ్ళిపోతుంది.

ఇక ఆశ్రమ లోపలికి అవని తీసుకెళ్తారు. అప్పుడు అవనీకి కేక్ కటింగ్ కోసం అంతా ఏర్పాటు చేస్తారు. ఎందుకండీ ఇవన్నీ అని అవని అక్షయ్ ని అడుగుతుంది. కాకపోయినా పిల్ల కోసమైనా కట్ చెయ్ అని అక్షయ్ అంటాడు. అప్పుడు కమల్ అన్నయ్య నువ్వు ఇది కట్ చేయకపోతే ఇలాంటివి వంద కేకులు తీసుకొస్తాడు వదిన నువ్వు ముందు కట్ చేయు అనేసి అంటాడు. ఇప్పుడు పల్లవి ఈ మొఖానికి ఒక కేకే అవసరం లేదు ఇంక 100 కేకలు కూడానా అని పల్లవి మనసులో అనుకుంటుంది. ఇక అవని కేకు కట్ చేసి అందరికీ ఇస్తుంది. కమల్ నీకో సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చావు వదిన అంటాడు. చిన్ననాటి ఫోటోని ఫ్రేమ్ కట్టించి కమల్ అవనీకి గిఫ్ట్ గా ఇస్తాడు అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఒక అమ్మాయి పల్లవి శారీకి కేక్ పూస్తుంది. తనకి పల్లవి సీరియస్ అవుతుంది కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు అంటూ అమ్మాయి పై అరుస్తుంది. అప్పుడు అనాధాశ్రమం హెడ్ అమ్మాయికి మతిస్థిమితం లేదండి అని చెప్తుంది. కడిగితే పోయేదానికి ఎందుకు ఇంత అరుస్తావు అక్కడ బాత్రూం ఉంది వెళ్లి కడుగు అనేసి అక్షయ్ పల్లవితో అంటాడు. ఇక కడుక్కోవడానికి వెళుతుంది పల్లవి.


రాజేంద్రప్రసాద్ ఇచ్చిన చెక్కుని అవని ఆశ్రమానికి ఇస్తుంది. ఇక అక్కడి నుంచి అందరూ ఇంటికి బయలుదేరుతారు. దారిలో ఒక ఆవిడ కింద పడిపోతుంది. అక్షయ్ కారు అప్పడంతో అవని బయటకు వచ్చి ఆమె ఎవరా అని చూస్తుంది. ఆమెను లేపుతారు. అప్పుడు పల్లవి తాను యాక్సిడెంట్ చేసిన ఆమె అని చూసి డబ్బులు గుంజడానికి కారు కింద పడుతూ ఉంటారా అని అనుకుంటుంది. అప్పుడు ఆమె నేను ఎవరో తెలియక పోయిన సాయం చేశావు అని అంటుంది. మీకు ఏమైనా అయిందేమో అని టెన్షన్ పడ్డాము. మీకు బాగోలేదు హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళమంటారా అని అంటుంది. అవనిని ఆశీర్వాదిస్తుంది. ఇక ఆమెను చూసి ఇద్దరు మధ్య ఏదో బంధం ఉందని అనుకుంటారు అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవనికి ఆశ్రమం వార్డెన్ ఫోన్ చేస్తుంది.. రేపటి ఎపిసోడ్ లో అవని తల్లీ ఎవరో తెలిసిపోతుందేమో చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×