BigTV English

Martin: ఆడియన్స్ ను ఫూల్స్ చేసిన చిత్ర బృందం.. ఫ్యాన్స్ ఫైర్..!

Martin: ఆడియన్స్ ను ఫూల్స్ చేసిన చిత్ర బృందం.. ఫ్యాన్స్ ఫైర్..!

Martin.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun sarja) బంధువు కన్నడ హీరో ధ్రువ సర్జ (Dhruva sarja) తాజాగా నటించిన చిత్రం మార్టిన్. వైభవి శాండిల్య, సుకృత వాగ్లే , అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏపీ అర్జున్ దర్శకత్వం వహించగా.. ఉదయ్ కే మెహతా నిర్మాతగా వ్యవహరించారు. దాదాపు 5 సంవత్సరాల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే అటు నిర్మాతకు ఇటు డైరెక్టర్ కు మధ్య వివాదాలు, కోర్టు కేసులు ఎన్నో ఎదురయ్యాయి. దీనికి తోడు గత వారం క్రితం తన పేరు లేకుండానే సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు అంటూ డైరెక్టర్ ఏపీ అర్జున్ సినిమా విడుదలను ఆపివేయాలని నేరుగా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే..


ఆడియన్స్ ను ఫూల్స్ చేసిన చిత్ర బృందం..

ఇంతకుముందే తెలుగులో కూడా ఒక ఈవెంట్ నిర్వహించి మరీ ప్రమోట్ చేశారు. ఇక ఏపీ అర్జున్ అలా కోర్టులో కేసు వేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. కానీ సమస్యలన్నీ సద్దుమణిగాయని ఎప్పటిలాగే ప్రకటించిన తేదీ అక్టోబర్ 11వ తేదీని ఈ సినిమా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. ఈరోజు థియేటర్లలోకి రాబోతోందని అందరూ ఆశాభవం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినిమా థియేటర్లకు వెళ్లిన ఆడియన్స్ ని చిత్ర బృందం ఫూల్స్ చేసిందని తెలుస్తోంది.


థియేటర్లకు రాని ప్రింట్..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. థియేటర్లలో వేయాల్సిన షోస్ అన్ని క్యాన్సిల్ అయ్యాయట. ముఖ్యంగా థియేటర్లకు ఇప్పటి వరకు ప్రింట్ రాకపోవడం గమనార్హం. దీంతో అక్టోబర్ 11వ తేదీన మార్టిన్ సినిమా రాబోతోందని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. ఇప్పుడు థియేటర్లకు వెళ్లి ఆడియన్స్ అంతా ఫూల్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సినిమా వస్తుందని, తమ హీరో ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోతాడని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఎట్టకేలకు థియేటర్లలోకి ప్రింట్ రాకపోవడంతో ఇంకా నిర్మాత, దర్శకుడు మధ్య వివాదం సద్దుమనగలేదనే వార్త ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.. మరి ఎప్పుడు థియేటర్లలో విడుదల చేస్తారో చూడాలి. మొత్తానికైతే డబ్బు విషయంలోనే నిర్మాత , డైరెక్టర్ తమ సినిమా విడుదలను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

దర్శక నిర్మాతలు గొడవ ధృవ కెరియర్ పై పడనుందా..

ధ్రువ సర్జా విషయానికి వస్తే.. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీకి పరిమితమైన ఈయన మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే మొదట్లోనే దర్శక నిర్మాతల మధ్య పోటీ ఆయన కెరీర్ కు ఆటంకం కలిగిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ధ్రువ సర్జ కెరియర్ పై వీరు నీళ్లు చల్లారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు దర్శక నిర్మాతలు మధ్య గొడవ సద్దుమణిగి, సినిమా విడుదల చేస్తారో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×