Karthika Deepam 2 serial today Episode: అరోజు వచ్చిన లాభాల డబ్బును లెక్కపెడుతూ పాత రోజులను గుర్తు చేసుకుంటాడు శివనారాయణ. డబ్బు కన్నా పేరు ముఖ్యం అనుకున్నాన కానీ డబ్బే ముఖ్యం అని ఇప్పుడు అర్థం అవుతుంది. డబ్బు పోగానే మర్యాద పోయింది. డబ్బు పోగానే గౌరవం పోయింది. డబ్బు పోగానే ఫ్రెండ్స్ పోయారు. డబ్బుతో సలక సౌకర్యాలతో పాటు సర్వం పోయింది. ధనమే అన్నింటికి మూలం అన్న మాట మరోసారి నిజం అయింది అంటూ శివనారాయణ చెబితే.. అదే కాదు తాత మనిషికి మరోకటి కూడా ముఖ్యం అంటూ కార్తీక్ చెబితే.. తన చేతిలో ఆ డబ్బు ఉండటానికి కారణం నువ్వే అంటూ శివనారాయణ, కార్తీక్‌కు థాంక్స్ చెప్తాడు.
నువ్వు తాతవు కాబట్టి వాడు నీకు సాయం చేశాడు నాన్న అంటూ కాంచన చెప్పగానే.. అవునమ్మా అకౌంట్‌లో ఎన్ని డబ్బులు ఉన్నాయో లెక్కపెట్టని ఈ శివనారాయణను చిల్లర లెక్కపెట్టే స్థాయికి దిగజార్చి సాయం చేశాడు అంటూ వెటకారంగా మాట్లాడితే గతం శవం లాంటిది ఎన్ని రోజులు మోస్తాము.. ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది అంటాడు శ్రీధర్. కానీ శవం లాగా ఉన్నది మేము అంటూ దశరథ, సుమిత్ర బాధపడుతుంటారు. జ్యోత్స్న ఇంకా రాలేదని బాధపడుతుంది సుమిత్ర అది వస్తానన్న సమయం దాటిపోయి ఇరవై నాలుగు గంటలు అవుతుంది కానీ అది ఇంకా రాలేదు అంటూ బాధపడుతుంది. దీంతో దశరథ మళ్లీ అడుగుతున్నాను జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో చెప్పరా..? అంటే కార్తీక్ తెలియదు అంటాడు. అప్పుడే సుమిత్రకు దక్షిణమూర్తి జ్యోత్స్న గురించి చెప్పబోతూ ఆగిపోయిన విషయం గుర్తు చేసుకుని దశరథకు చెప్తుంది. దక్షిణమూర్తికి తెలియదని కార్తీక్ కు తెలిసి ఉండొచ్చని అనుమానిస్తాడు శివనారాయణ.
కార్తీక్ మాటలు గుర్తు చేసుకుంటూ మాలిని ఆలోచిస్తుంటే.. నీళ్లు తీసుకొచ్చి ఇస్తాడు సూరజ్. మాలిని కోపంగా సూరజ్‌ను తిడుతుంది. ఆ కార్తీక్ ఏం మాట్లాడాడొ తెలుసా..? అంటుంది. అందుకు సూరజ్ తాతయ్య చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి..? అంటూ నిలదీస్తాడు. దీంతో మాలిని కోపంగా ఇప్పుడు నేను ఒంటరిని అయిపోయాను అంటుంది. మరి నేను ఎవరు..? అంటూ సూరజ్ అడిగితే.. నువ్వు ఇప్పుడు జ్యోత్స్న ప్రేమించిన వాడివి అంటుంది. అందుకు సూరజ్ కోపంగా ఏం మాట్లాడుతున్నావమ్మ అంటాడు. అందుకు నీ బెడ్ రూంలో నీ ఫిల్లో కింద జ్యోత్స్న ఫోటో చూశాను అంటూ నిజం చెప్తుంది. అప్పుడు సూరజ్ షాక్ అవుతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో సూరజ్ ఇక జ్యోత్స్న ఆఫీసులో కనిపించకుండా చేస్తాను.. నీ అనుమానాలకు పులిస్టాప్ పెట్టేస్తాను అంటాడు సూరజ్. ఏం చేస్తావని మాలిని అడిగితే.. చేశాక చెప్తాను అంటాడు సూరజ్.
కాంచన ఇంట్లో అందరూ జ్యోత్స్న గురించి ఆలోచిస్తుంటే సూరజ్ వెళ్తాడు. సూరజ్‌ను చూసి దశరథ కోపంగా తిడితే.. నేను వచ్చింది మీ కోసం కాదు కార్తీక్ అన్నయ్య, దీప వదినల కోసం అంటాడు. ఆ మాటలకు సుమిత్ర ఏం వరసలు కలుపుతున్నావురా అంటే.. ఇది మన ఇల్లు కాదు వచ్చింది మన బంధువు కాదు వాళ్ల బంధువు అంటాడు. సూరజ్ మీతో మాట్లాడాలి బయటకు రండి అంటే.. మీరే ఇంట్లో మాట్లాడుకోండి.. మేమే బయటకు వెళ్తాము అంటే కార్తీక్ కోపంగా శివనారాయణను తిడుతుంటే.. అన్నయ్య బయటకు వస్తావా..? నేను నీతో వదినతో మాట్లాడాలి ఒక్కసారి బయటకు వస్తే మాట్లాడి వెళ్లిపోతాను అంటూ రిక్వెస్ట్ చేస్తాడు సూరజ్.
కాంచన వెళ్లి వాడేం చెప్తాడో వినరా కార్తీక్ అని చెప్తుంది. దీప, కార్తీక్ బయటకు వెళ్తారు. వాళ్లతో సూరజ్ మీరిక ఆఫీసు రావొద్దని జ్యోత్స్న కూడా రావొద్దని అందుకోసం పదిహేను కోట్లు ఇస్తున్నాను అంటూ చెప్తాడు సూరజ్. అందుకు కార్తీక్ ఒప్పుకోడు.. చెక్ తిరిగి ఇస్తూ.. మేము ఎందుకు ఆఫీసుకు వచ్చామో నీకు ఇప్పుడు అర్థం కాదు సూరజ్. నేను మీ దగ్గరి నుంచి అన్ని అధికారాలు లాక్కుంటాను. నువ్వు నా దగ్గరి నుంచి లాక్కున్న నా మంచిపేరుతో సహా అంటూ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నాకంటూ ఒకరోజు వస్తుంది. ఆరోజు మీకు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి.
నువ్వు పిన్ని తాత అందరూ లెక్కపెట్టుకోవాల్సిందే.. జ్యోత్స్న ఏం చేస్తుందో మేము ఆపలేము ఇక నువ్వు కూడా ఆపలేవు అంటాడు కార్తీక్. ఇదే మీ ఆఖరి మాటా అంటే కార్తీక్ అవును అంటాడు. అయితే నేను కూడా మా అమ్మ చేసే ఆటలు నేను ఆపలేను మీరు ఊహించలేరు కూడా అంటే కార్తీక్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. అందుకు అయితే నేను చూస్తాను అంటూ సూరజ్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.