E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవికి షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పార్వతికి షాక్..

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవికి షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పార్వతికి షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode September 26th : భానుమతి వంటగదిలో స్వీట్లు ఎక్కడున్నాయని వెతుకుని మరి తినడానికి ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి స్వీట్ డబ్బాని తీసుకొని పెట్టుకుంటుంది అయితే అప్పుడే ఆరాధ్య ఎదురుగా రావడంతో ఈ పిల్ల రాక్షసి వచ్చేసి నీకు సీట్లు కూడా తిననివ్వదు. అని ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు స్వీట్లు తినడానికి నేను అస్సలు ఒప్పుకోను బాబాయ్ కి ఇప్పుడే చెప్తాను అని ఆరాధ్య చెప్తుంది. కమల్ ప్రవర్తన చూసి భానుమతికి అనుమానం కూడా మొదలవుతుంది. కానీ కమల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా స్వీట్ తినాలనిపిస్తుందా అయితే తినేసేయని పెద్ద క్లాస్ పీకి మరి తినడానికి ఇస్తాడు. భానుమతికి కమల్ పై అనుమానం ఇంకాస్త పెరిగిపోతుంది. అయితే కమల్ ఎందుకు మాట్లాడాడో తెలియలేదు కానీ వాడు మాత్రం నాకు స్వీట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని భానుమతి సంతోష్ పడిపోతూ ఉంటుంది.

పల్లవికి అవని షాక్..

అవని ఏంటమ్మా వంటగదిలో నువ్వు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటావు. నువ్వేమీ పనిచేయదమ్మా అని ఎంత చెబుతున్నా సరే.. మీనాక్షి మాత్రం అస్సలు వినకుండా నేను జస్ట్ సాయి మాత్రమే చేస్తున్నాను మిగతా పనులన్నీ నువ్వే చేస్తున్నావు అని అంటుంది. అయితే పల్లవికి నాన్ వెజ్ అంటే ఇష్టం కదా మా చికెన్ తీసుకొని వచ్చాను తనకోసం చికెన్ కర్రీ చేస్తాను అని అవనితో అనగానే దానికి చికెన్ కాదమ్మా మనుషుల మనసులని విడగొట్టి ఎంజాయ్ చేశారు రాక్షసి అని ఆలోచిస్తూ ఉంటుంది. చికెన్ కన్నా మటన్ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది కదమ్మా పాయ చేసి పెట్టేదాన్ని అని అవని అంటుంది. నెక్స్ట్ టైం నుంచి అలానే చేసి తీసుకొని వస్తానమ్మా అని మీనాక్షి అంటుంది అప్పుడు అక్కడికి వచ్చిన పల్లవి నాకు తలనొప్పిగా అందుకు కాఫీ ఇవ్వమని అడుగుతుంది. అయితే పల్లవికి ఎలాగైనా సరే దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అవని కాఫీలో కారం కలిపి పల్లవికి తీసుకొని వెళుతుంది..

పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

పల్లవి కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అవని కాఫిని తెచ్చి ఇస్తుంది. అదేంటక్క నువ్వు తెచ్చావు అమ్మకే కదా నేను కాఫీ ఇవ్వమని చెప్పాను మరి నువ్వు తీసుకొచ్చావ్ ఏంటి అని అవని తో పల్లవి అడుగుతుంది. నేను తీసుకొస్తే కాఫీ తాగావా? ఏ ఎందుకని ఎన్ని రోజులు నేను తెస్తేనే తాగావు కదా అని అవని పల్లవితో అడుగుతుంది. పల్లవి ఆ కాఫీ ని ఒక చుక్క తాగగానే అందులో కారం కలపడంతో ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయి ఉమ్మేస్తుంది. ఐ బాబోయ్ ఇంత కారం వేసారేంటి.. అసలు ఈ కాఫీ ఎవరు కలిపారు అని నేనే కారం కలిపాను నువ్వు అందరిని చంపాలి అని ప్రతికారంతో ఉన్నావు కదా ఈ కారం నీకేం చేస్తుంది అని అంటుంది.. మొత్తానికి అవని పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

తల్లి కోసం కమల్ కన్నీళ్లు..

కమల్ మాత్రం తన తల్లికి కాళ్లు నొక్కుతూ నువ్వు పడుకో అమ్మ నేను నీకోసం కాళ్ళు నొక్కుతాను అని ఎమోషనల్ అయిపోతాడు.. అయితే పార్వతీ మాత్రం నన్ను చూసుకోవడానికి మీరు ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ మీ నాన్నని చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు మీ నాన్న ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాబట్టి త్వరలోనే కోలుకొని ఇంటికి వస్తారు కదా.. అప్పుడు మీరందరూ నా కన్నా ఎక్కువ మీ నాన్నని చూసుకోవాలి అని పార్వతి ఎడగానే కమల్ లో లోపల బాధ పడిపోతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతూనే ఉంటావా నిద్రపోవా అని కమల్ పార్వతిని అడుగుతాడు. నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉంటే ఎప్పుడూ నిద్రపోతావు పడుకో అమ్మ అని కమల్ పార్వతిని పడుకోబెడతాడు. నువ్వు మంచిగా లేవు అని బాధపడి పోతున్నాం అమ్మ నాన్న లేడు అన్న ఇది నిజం నీకు చెప్తే నువ్వు తట్టుకుంటావో లేదో అని భయంగా ఉంది ఎమోషనల్ అయిపోతాడు.

ఆరాధ్య మాటతో షాక్..

Advertisement

ఆరాధ్య బాబుని పడుకోబెడుతూ అన్ని నేర్పిస్తూ ఉండడం చూసి శ్రీకర్, శ్రియ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎవరైనా ఆరాధ్య లాంటి అక్క దొరకడం బాబు అదృష్టం అంటూ పొగిడేస్తూ ఉంటారు. ఇక ఆరాధ్య కూడా బాబుతో చాలా సరదాగా ఉంటూ ఎలాగైనా బాబు నీ నిద్రపుచ్చాలి అని అనుకుంటారు.. మా మీద ఆరాధ్య లాంటి అక్క బాబుకు దొరకడం నిజంగానే చాలా అదృష్టం. అసలు ఆరాధ్య బాబుకి మాటలు వచ్చే టయానికి పాటలు కూడా పాడడం నేర్పిస్తుందేమో అని శ్రీకర్ చాలా సంతోషంగా ఉంటాడు. ఇకపోతే బాబు పడుకున్నాడు అని చెప్పగానే ఆరోగ్య పాట పాడడం కాదు వాడికి నిద్ర రావడంతోనే పడుకున్నాడు అని శ్రీకర్ చెప్పగానే ఆరాధ్య చాలా ఫీల్ అవుతుంది.. నేను ఇప్పుడే బాబును నిద్రలేపి మళ్లీ జోల పాడి పడుకోబెడతానని ఆరాధ్య అనగానే వద్దు వద్దు నువ్వే పడుకో పెట్టావు పడుకొని ఇవ్వు లేదంటే రాత్రి అంతా వాడు మమ్మల్ని పడుకోనివ్వడు అని శ్రీయ అంటుంది మొత్తానికి ఆరాధ్య సాటిస్ఫై అవుతుంది. ఇక మొత్తానికి అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. డోంట్ మిస్..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Karthika Deepam 2 Serial Today Episode September 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన మాలిని            

Ninnu kori Serial Today Episode September 26th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దామోదర్ కు వార్నింగ్ ఇచ్చిన దాక్షాయణి 

Saturday Tv Movies : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. డోంట్ మిస్..

రేబీస్‌తో బాలుడు మృతి.. అధికార వర్గాలను ప్రశ్నించిన యాంకర్ రష్మి గౌతమ్!

మిథిలేష్ రెడ్డి వర్సెస్ రామకృష్ణ.. బిగ్ బాస్ లోకి వెళ్లేదెవరు?

Big Stories

Advertisement
×