E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన మాలిని            

Karthika Deepam 2 Serial Today Episode September 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన మాలిని            
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఇంటికి వెళ్లాక సూరజ్‌ పర్స్‌ చెక్‌ చేస్తుంది మాలిని. పర్స్‌లో జ్యోత్స్న చెప్పినట్టు తన ఫోటో ఉండదు. దీంతో మాలిని అనవసరంగా సూరజ్‌ను అనుమానించాను అనుకుంటుంది. అప్పుడే వచ్చిన సూరజ్‌ ఏమైందమ్మా అని అడుగుతాడు. అప్పుడు కార్తీక్‌ చెప్పాడని అనుమానించావు.. ఇప్పుడు జ్యోత్స్న ఏం  చెప్పిందని అనుమానిస్తున్నావు.. అంటూ అడగ్గానే.. నేను నీ తల్లినిరా నిన్ను జాగ్రత్తగా ఉంచుకోవడం నా బాధ్యత ఇంకో విషయం నమ్మకం ఎక్కువ ఉన్నప్పుడే అనుమానం కూడా వస్తుంది అంటూ చెప్పగానే.. సూరజ్‌ కూడా అయితే నేను నిన్ను అనుమానించొచ్చా అమ్మా అని అడుగుతాడు. అందుకు మాలిని తల్లి కొడుకును అనుమానించడం తప్పు కాదు కానీ కొడుకు తల్లిని అనుమానించడం తప్పు అవుతుంది నాన్న అంటూ వెళ్లిపోతుంది.

కార్తీక్‌, దీపల దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న ఎందుకు మాలిని ఆఫీసకు వెళ్లారు.. ఎవరి దగ్గర ఊడిగం చేద్దామని వెళ్లారు.. మీరు ఇలాగే చేస్తే ఇంకా నిందలు ఎక్కువ పడతారు దీప. వెంటనే నువ్వు రిజైన్‌ చేసేయ్‌ అని చెప్తుంది. అందుకు కార్తీక్‌ వద్దని ఇప్పుడే అసలైన ఆట మొదలైందని ఇప్పుడు మన ముగ్గురి జీవితాలు ఒకే సర్కిల్లో తిరుగుతున్నాయని నువ్వు అగ్రిమెంట్‌ చేసుకున్నందుకు మంచే జరిగింది. ఇప్పుడు కూడా మంచే జరుగుతుంది అంటూ కార్తీక్‌ చెబితే.. అసలు మీరేం చేస్తున్నారో అదైనా చెప్పండి అని జ్యోత్స్న అడిగితే సారీ చెప్పలేమని కార్తీక్‌ అంటాడు. అయితే సరే ఏమైనా చేయండి మీకు అడ్డు రాను.. నా కుటుంబం కోసం నేను కూడా చేసేది చేస్తున్నాను.. నాకు మీరు అడ్డు రాకండి అంటూ జ్యోత్స్న చెప్పడంతో కార్తీక్‌, దీప ఆశ్చర్యంగా చూస్తుంటారు.

Advertisement

మరుసటి రోజు జ్యోత్స్న రెస్టారెంట్ లో వెయిటర్‌గా జాయిన్‌ అవుతుంది. వెయిటర్‌ డ్రెస్‌ వేసుకుంటూ తాను మిస్‌ హైదరాబాద్‌ అయినప్పటి రోజులు గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అవుతుంది. తర్వాత కస్టమర్ల దగ్గరకు వెళ్లి ఆర్డర్ తీసుకుంటుంటే కొంతమంది పోకిరీలు జ్యోత్స్నను చాలా అందంగా ఉన్నావని ఫోన్‌ నెంబర్‌ ఇవ్వమని అల్లరి చేస్తుంటారు. జ్యోత్స్న అన్ని భరిస్తూ మౌనంగా తన పని తాను చేసుకుంటుంది. అప్పుడే అదే రెస్టారెంట్‌కు సూరజ్‌ వెళ్తాడు. జ్యోత్స్న వెళ్లి ఆర్డర్‌ అడుగుతుంది. జ్యోత్స్నను అక్కడ అలా చూసి సూరజ్‌ షాక్‌ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే.. నా కుటుంబాన్ని పోషించకోవడానికి ఇలా మారాల్సి వచ్చిందని జ్యోత్స్న చెప్తుంది. మీ ఇంట్లో వాళ్లకు తెలుసా ఈ విషయం అని సూరజ్‌ అడిగితే.. తెలియదు మీ ఆర్డర్‌ ఏంటో చెప్పండి సార్‌ అంటుంది జ్యోత్స్న.. సూరజ్‌ కాఫీ అని చెప్పగానే.. జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది.

జ్యోత్స్న రెస్టారెంట్‌ సీఈవోగా దీప బాధ్యతలు తీసుకుంటే దీపకు కార్యదర్శిగా కార్తీక్‌ జాయిన్‌ అవుతాడు. వాళ్లను చూసిన మాలిని దగ్గరకు వచ్చి కంగ్రాట్స్‌ చెప్తుంది. వాళ్లను ఎలాగైనా అవమానించాలని తన దగ్గర ఉన్న రూపాయి కాయిన్‌ తీసి వాళ్లకు జీతం అని ఇస్తుంది. రూపాయి చూసి కార్తీక్‌ మౌనంగా ఉండిపోతే.. అవమానంగా ఉందా..? అని మాలిని అడిగితే.. ఏం లేదని తాము జీతం కోసం జాబ్‌ చేయడం  లేదని అసలు కథ ముందుందని కార్తీక్‌ చెప్తాడు. కార్తీక్‌ మాటలకు మాలిని షాక్‌ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం టెన్షన్.. వల్లికి షాక్.. ప్రేమ, ధీరజ్ కు శాశ్వతంగా దూరం..?

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..సెప్టెంబర్ హైలెట్ ఎపిసోడ్స్..

Intinti Ramayanam Today Episode: అవని దెబ్బకు పల్లవికి షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పార్వతికి షాక్..

Ninnu kori Serial Today Episode September 26th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దామోదర్ కు వార్నింగ్ ఇచ్చిన దాక్షాయణి 

Saturday Tv Movies : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. డోంట్ మిస్..

రేబీస్‌తో బాలుడు మృతి.. అధికార వర్గాలను ప్రశ్నించిన యాంకర్ రష్మి గౌతమ్!

మిథిలేష్ రెడ్డి వర్సెస్ రామకృష్ణ.. బిగ్ బాస్ లోకి వెళ్లేదెవరు?

Big Stories

Advertisement
×