Ninnu kori serial today Episode: దామోదర్‌ను రూంలోకి తీసుకెళ్లి వార్నింగ్ ఇచ్చిన దాక్షాయణి సామ్రాట్ తిరిగి ప్రాణాలతో వచ్చాడు. అదంతా నీ చేతకాని తనమే అంటూ ఇక ఈ విషయం ఎవరికైనా తెలిసిందా..? నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. దాక్షాయణి.. అయితే సామ్రాట్‌ను చంపే అవకాశం మీకు ఉన్నా ఎందుకు చంపలేదు అని దామెదర్ అడుగుతే.. వాడిప్పుడు కోరలు పీకేసిన పాము లాంటివాడు. వాడికి శ్రీజకు పెళ్లి చేస్తాను.. వాడికి గతం గుర్తుకు వచ్చినా చేసేది ఏమీ ఉండదు ఇప్పుడు సామ్రాట్‌ను ఏం చంపొద్దు అని దామోదర్‌ను పంపిస్తుంది దాక్షాయణి.
అందరూ డిన్నర్ చేయడానికి రెడీ అవుతుంటే.. గిరిజ, నీలగిరి హడావిడిగా వస్తారు. వాళ్లను చూసిన జీవన్ ఈరోజు డిన్నర్ చేయకుండా వెళ్లారు అనుకున్నాను వచ్చేశారా..? అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అందుకు నీలగిరి నువ్వు ఉండరా అమ్మ ఎక్కడ అల్లుడు అంటూ సామ్రాట్‌ను అడిగితే.. అప్పుడే దాక్షాయణి వస్తూ.. ఏంటి అన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నారు అని అడుగుతుంది. అందుకు నీలగిరి అదే చెల్లెమ్మా నెల రోజుల తర్వాత నువ్వు శ్రీజ, సామ్రాట్ పెళ్లి అన్నావు కదా అందుకే చాలా సంతోషంగా ఉందమ్మా అందుకే పంతులు గారిని కలిసి వీరిద్దరి జాతకాలు చూపించాను.. అనగానే..
వదిన వచ్చే నెలలో వీరిద్దరి జాతకాలకు సరిపోయే ఐదు ముహూర్తాలు ఉన్నాయని చెప్పారు అంటుంది గిరిజ. అప్పుడే సామ్రాట్ కు పులమారుతుంది. చంద్ర మెల్లగా తాగండి.. ఎందుకు అంత తొందర అంటుంది. వెంటనే అందరికీ సారీ చెప్తుంది. గిరిజ కోపంగా ఏం చేస్తున్నావు నువ్వు పరాయి మగాడు అన్న విషయం మర్చిపోకు అంటుంది చంద్ర సారీ చెప్పి వెళ్లిపోతుంది. దాక్షాయణి, గిరిజను మందలిస్తుంది. చంద్ర కేర్ టేకర్‌లా వచ్చింది. కానీ సామ్రాట్‌ను చాలా బాగా చూసుకుంటుంది. అంతే కానీ నువ్వు అనవరసరంగా అనుమానిస్తున్నావు అంటూ చెప్తుంది.
బయటకు వెళ్లి బాధపడుతున్న చంద్ర దగ్గరకు దాక్షాయణి వెళ్తుంది. ఇక్కడేం చేస్తున్నావు నేను నీకోసం అంతా వెతుకుతున్నాను అని చెప్పగానే.. గిరిజ గారు ఏమైనా చెప్పారేమో అని మనసులో అనుకుంటూ భయంగా చెప్పండి మేడం అంటూ చంద్ర అడిగితే.. ఎందుకు అంతలా భయపడుతున్నావు.. నేను నిన్ను ఏమైనా అన్నానా..? నాకో డౌట్ వచ్చింది అది అడుగుదామనే వచ్చాను.. సామ్రాట్‌కు గతం గుర్తుకు రావడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అని అడగ్గానే.. ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ చాలా బాగా పని చేస్తున్నాయి.. కానీ ఎప్పుడు గతం గుర్తుకు వస్తుంది అని కచ్చితంగా చెప్పలేమని చంద్ర చెప్పగానే.. దాక్షాయణి షాక్ అవుతుంది. దానికి తొందరేం లేదు వాడిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్తూ.. సామ్రాట్‌కు గతం గుర్తు చేయకుండా జాగ్రత్త పడాలి అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది.
గిరిజ, నీలగిరి ఇద్దరూ కలిసి చంద్ర గురించి మాట్లాడుకుంటారు. పరిస్థితులు చేయి దాటకముందే తామే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవుతారు. చంద్రను బెదిరిద్దామా అని నీలగిరి అడిగితే ఆ పిల్ల తెగించింది. మనం బెదిరిస్తే భయపడదు. పైగా అల్లుడికి మనం బెదిరించామని చెప్పి అల్లుడి దృష్టిలో మనల్ని చెడ్డవాళ్లను చేస్తుంది అంటూ గిరిజ చెప్తుంది. అదీ కరెక్టే అని నీలగిరి చెబితే.. మనం డైరెక్టుగా అల్లుడితోనే మాట్లాడదాం.. సామ్రాట్ మన చేయి దాటిపోకుండా చూసుకోవాలి అంటుంది గిరిజ.
అప్పుడే సామ్రాట్ ఏదో ఆలోచిస్తూ వస్తుంటే.. నీలగిరి చూస్తూ.. ఎలా పరధ్యానంలో ఉన్నాడో చూడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడో తెలియడం లేదు అంటూ తిడుతుంటాడు. సామ్రాట్ ఆలోచిస్తూ.. నడుస్తూ.. గార్డెన్‌లోకి వెళుతూ పగిలిన అద్దం ముక్కపై కాలు పెట్టబోతుంటే.. దూరం నుంచి గమనించిన చంద్ర బావ అని గట్టిగా పిలుస్తుంది. దగ్గరకు పరుగెడుతుంది. గిరిజ, నీలగిరి కోపంగా చంద్రను తిడతారు. సామ్రాట్ ను బావ అంటావేంటి అంటే శ్రీజ నాకు చెప్పడంతో అదే ప్లోలో అన్నాను అంతే అంటూ చెప్పి శ్రీజ, విరాట్‌ను పిలిచిందని సామ్రాట్‌ను లోపలికి పంపిస్తుంది.
లోపలికి వెళ్లిన సామ్రాట్, శ్రీజతో వెటకారంగా మాట్లాడుతుంటాడు. శ్రీజ మాత్రం నీకు గతం గుర్తొచ్చినా గుర్తు రాకున్నా నేనే నీ భార్యను అని ఫిక్స్ అయిపోయాను నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం బావ అని చెప్తుంది. సామ్రాట్ మాత్రం పెళ్లి విషయంలో తనను తొందర పెట్టొద్దని నేనేంటో నాకు తెలియదు.. నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించలేను అంటూ చెప్పగానే.. శ్రీజ ఏడుస్తుంది. అంతా దూరం నుంచి విన్న చంద్ర, మదన్ పక్కకు వెళ్లిపోతారు. పాపం శ్రీజను చూస్తుంటే జాలేస్తుంది. రేపు నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆలోచిస్తుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.