Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ పిల్లలతో కలిసి రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆడుకుంటూ వెళ్లిన అంజు పక్క ఇంట్లో తీవ్రవాదులను చూస్తుంది. వెంటనే భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి మిస్సమ్మకు చెప్తుంది. మిస్సమ్మ కంగారు పడుతూ అమర్‌కు ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్తుంది. దీంతో అమర్ మిస్సమ్మకు జాగ్రత్తలు చెప్తాడు. వెంటనే మీరందరూ మీ నాన్నతో సహా అందరూ మన ఇంటికి వెళ్లిపోండి. మీరు వెళ్లేటప్పుడు ఎక్కువ హడావిడి ఉండకూడదు. వాళ్లెవరికీ డౌట్ కూడా రాకూడదు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ సరేనండి వీలైనంత త్వరగా వెళ్లిపోతాము.. అని చెప్తుంది. కేర్‌ఫుల్ భాగీ మేము బయలుదేరుతున్నాం అని చెప్తాడు. మిస్సమ్మ రామ్మూర్తిని పిలిచి నాన్నా ఆయన వీలైనంత త్వరగా మనల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మన్నారు.. మనం వెళ్దాం పద నాన్నా అంటుంది. సరే అని అందరూ బయలుదేరతారు.
ఇంతలో టెర్రరిస్టుల దగ్గరకు ఇన్‌ఫార్మర్ వచ్చి అమరేంద్ర ఇక్కడకు వస్తున్నారట అని మీరు వెళ్లిపోండి అని చెప్తాడు. అమరేంద్రనా..? వాడి వల్ల మా టీం మొత్తం డిస్టర్బ్ అయింది. వాడి ఫ్యామిలీ డీటెయిల్స్ ఉన్నాయా..? అని అడగ్గానే.. మొత్తం వివరాలు చెప్తాడు ఇన్‌ఫార్మర్. ఇప్పుడు అమరేంద్ర ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారు.. మన ప్లాట్‌కు ఎదురు ఫ్లాట్‌లో ఉంటున్నారు అని చెప్పగానే తీవ్రవాదులు గన్స్ తీసుకుని రామ్మూర్తి ప్లాట్‌లోకి వెళ్తారు. అందరినీ బందీలుగా తీసుకుంటారు. ఇంతలో అమర్ తన ఫోర్స్‌తో అక్కడికి వస్తాడు. తీవ్రవాది అమర్‌కు ఫోన్ చేస్తాడు.
హలో అమరేంద్ర నీ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు నా దగ్గర ఉంది. నువ్వు లోపలికి వస్తే వీళ్లను బయటకు పంపిస్తా.. శవాలుగా నీకు అరగంట టైం ఇస్తున్నాను.. మేము వెళ్లిపోవడానికి రూట్ క్లియర్ చేయ్.. లేదంటే అరగంట తర్వాత ప్రతి అయిదు నిమిషాలకు ఒక డెడ్ బాడీ కిందకు వస్తుంది అని బెదిరించడంతో అమర్ ఫోర్స్‌ను తన దగ్గరకు పిలుస్తాడు. రాథోడ్ ఏమైంది సార్ అని అడగ్గానే.. మనం వచ్చినట్టు మిలిటెంట్లకు తెలిసిపోయింది రాథోడ్ అని చెప్తాడు అమర్. లోపల తీవ్రవాది.. ఏయ్ మేము అరగంట టైం మాత్రమే ఇచ్చాం.. అప్పటి వరకు ఎవరైనా కదిలారో కాల్చి చంపేస్తాను అంటూ అంజును లాక్కుని గన్ ఎయిమ్ చేస్తాడు.
మరోవైపు టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తారు చిత్ర, మనోహరి. హ్యపీగా ఫీలవుతుంది మనోహరి.. వాట్ ఏ న్యూస్ చిత్ర అంటుంది మనోహరి.. ఇది నీకు అంత హ్యపీ న్యూసా అని చిత్ర అడగ్గానే.. అవును సూపర్ న్యూస్ తీవ్రవాదుల కాల్పుల్లో భాగీ ఆ నలుగురు పిల్లలు చనిపోతే అమరేంద్ర ఒంటరి వాడై పోతాడు. అప్పుడు నా సొంతం అవుతాడు. నాకు అమర్‌కు మధ్యలో అడ్డుగా ఇంకెవ్వరూ ఉండరు అని సంతోషిస్తుంది. అంటే నీకు కాలమే ఇలా కలిసి వస్తుందన్న మాట. కలిసొచ్చే కాలానికి ఎదురొచ్చే అదృష్టం అంటే ఇదే మనోహరి.. ఈసారి నువ్వు ఏమీ చేయకుండానే.. నువ్ఉవ అనుకున్నది సాధించబోతున్నావు. పాపం భాగీ పిల్లలు బలి అవ్వబోతున్నారు. అంటూ చిత్ర అనగానే.. ఇన్నాళ్లు నేను పడిన కష్టానికి ఫలితం ఇది. నా కోసం ఆ దేవుడే ఈ మిలిటెంట్లను పంపించాడు.. అంటూ హ్యాపీగా ఫీలవుతుంది.
కానీ అక్కడ బావ అంత తేలిగ్గా వదిలిపెట్టడు కదా మను.. పైగా ఇలాంటి ఎంతో మంది తీవ్రవాదులను ఆయన కాల్చి చంపేసి ఉంటారు.. అని చెప్తుంది చిత్ర. కానీ ఈ సారి ఆ తీవ్రవాదుల చేతుల్లో చిక్కుకున్నది భాగీ పిల్లలు.. అమరేంద్ర రిస్క్ తీసుకోలేడు. అలాగని ఆ తీవ్రవాదులను వదిలిపెట్టనూ లేడు.. కుటుంబమా దేశమా అంటే అమర్ దేశానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని చెప్తుంది మను. అంటే అమర్ బావ ఆ తీవ్రవాదులను కాల్చేస్తారు అంటావు.. అప్పుడు వాళ్లు భాగీని పిల్లలను చంపేస్తారు అంటావు అంతేనా..? అని చిత్ర అనగానే.. అవును అదే జరగబోతుంది. తీవ్రవాదులు భాగీని పిల్లలను చంపేస్తారు.. ఆ తర్వాత అమర్ తీవ్రవాదులను చంపేస్తాడు.. ఆ తర్వాత అమర్ నా సొంతం అవుతాడు అని వెళ్లిపోతుంది మను.
ఇక అమర్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తారు పై అధికారులు దీంతో అమర సొంతంగా ప్లాన్ రెడీ చేసుకుని అపార్ట్‌మెంట్‌లోకి వెళ్తాడు. తీవ్రవాదులు కాలుస్తున్నా.. బాంబులు వేస్తున్నా లెక్క చేయకుండా అమర్ వెళ్తుంటాడు. లోపలికి వెళ్లిన అమర్ డోర్ పగుల గొట్టి తీవ్రవాదులను కొట్టి వారి చేతుల్లో గన్స్ లాక్కుంటాడు. ఇంతలో ఒక తీవ్రవాది చాటు నుంచి అమర్‌ను కాలుస్తాడు అది గమనించిన అంజు బుల్లెట్‌కు అడ్డుగా వెళ్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.