Jabardast Edukondalu:ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ (Jabardast) ద్వారా ఎంతోమంది కమెడియన్స్, డైరెక్టర్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ఉన్నాయి కానీ జబర్దస్త్ మాత్రం ఒక బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యాం ప్రసాద్ రెడ్డి ప్రొడ్యూసర్ గా ఈ జబర్దస్త్ షోని స్టార్ట్ చేశారు. మొదట్లో ఈ షోకి రోజా (Roja), నాగబాబు (Nagababu) లు జడ్జిలుగా ఉన్నారు. అలా ఓ 10 సంవత్సరాల పాటు ఈ షో చాలా సక్సెస్ఫుల్గా సాగింది. అంతే కాదు ఈ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అందులో కిర్రాక్ ఆర్పీ ఒకరు.కానీ కిర్రాక్ ఆర్పీ అవసరం తీరాక జబర్దస్త్ షోపై ఎన్ని ఆరోపణలు చేశారో చెప్పనక్కర్లేదు. అయితే ఈ ఆరోపణలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు.
కామెడీ షో చేస్తూ కోట్లు సంపాదిస్తారా – జబర్దస్త్ మేనేజర్..
ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం అని కిర్రాక్ ఆర్పీ అన్నాడు. అసలు వాడికి అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాడు.. ధనరాజ్ టీం లో ఉన్నప్పుడు వాడు నాతో మాట్లాడడానికే భయపడేవాడు. బాత్రూంలు కడిగాను.. ఆ పని చేసా.. ఈ పని చేసా అని చెబుతున్నాడు. అసలు మేం ఛాన్స్ ఇవ్వకపోతే ఎక్కడుండేవాడు. కొంతమంది డైరెక్టర్లు కూడా మా ఐడియాలు వాడుకొని కోట్లు సంపాదిస్తున్నారు అంటున్నారు. అసలు ఈ డైరెక్టర్లకి, కమెడియన్లకి ప్రొడ్యూసర్లు అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవారు. ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన వారిని మర్చిపోవద్దు అంటూ జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు చెప్పుకొచ్చారు.
కిర్రాక్ ఆర్పీ పై మండిపడ్డ జబర్దస్త్ ఏడుకొండలు..
అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డిని నేను దగ్గరుండి చూసాను. ఆయన అరుంధతి సినిమా హిట్ అయ్యాక నాకు రూ. 30 లక్షలు ఇచ్చి ఇల్లు కొనుక్కోమని చెప్పారు. అలాగే కిర్రాక్ ఆర్పి ఉన్నన్ని రోజులు జబర్దస్త్ లో ఉండి ఫేమస్ అయ్యాక బయటికి వెళ్లి షోపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు. ముందే ఈ ఆరోపణలు ఎందుకు చేయలేదు. అప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు.. శ్యాంప్రసాద్ గురించి ఏం తెలుసని వాడు మాట్లాడుతున్నాడు. ఆర్పీ గాడికి పేమెంట్ ఇచ్చాం కదా.. అప్పుడు ఎందుకు మాట్లడలేదో చెప్పమనండి అంటూ కిర్రాక్ ఆర్పీ పై ఫైర్ అయ్యారు జబర్దస్త్ ఏడుకొండలు. అయితే జబర్దస్త్ నుండి బయటికి వచ్చాక కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ షోపై, ప్రొడ్యూసర్ శ్యాం ప్రసాద్ రెడ్డి పై, మేనేజర్ ఏడుకొండలుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి మనకు తెలిసిందే.అలాగే జబర్దస్త్ జడ్జిగా చేసిన రోజాపై కూడా ఇప్పటికీ ఎన్నో అసభ్య కామెంట్లు చేస్తున్నాడు. ఇకపోతే ఆర్పి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ పెట్టి ఈ రెస్టారెంట్ కి పలు బ్రాంచ్లు ఏర్పాటు చేసి భారీగానే సంపాదిస్తున్నారు. స్టార్ సెలబ్రిటీలకు కూడా అప్పుడప్పుడు ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ నుండి పార్సిల్స్ బహుమతిగా వెళుతున్నట్లు సమాచారం.
also read:Fans War: మహేష్ బాబు ఫ్యాన్ ని దారుణంగా కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో వైరల్..!