Intinti Ramayanam Today Episode January 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఎలాంటిదో తెలుసుకోవడానికి చెంచులమ్మను పార్వతి పిలిచిందనే నిజాన్ని తెలుసుకున్న భానుమతి పల్లవి తో చెప్తుంది. మనిద్దరం కలిసి ఇలా ప్లాన్ చేస్తున్నామని అవన్నీ నిరికిస్తున్నామని తెలిస్తే మనల్ని చంపేస్తుంది ఇంట్లో ఈ విషయాన్ని చెప్పి మనల్ని గెంటెయించిన గెంటేస్తుంది ఇక నీ మొగుడు గురించి నువ్వు ఆలోచించు. వాడు కనీసం బతకనివ్వడు అనేసి హెచ్చరిస్తుంది.. నా పెద్ద కోడలుకి ఆస్తి మీద మోజు పడింది. అందుకే ఇలా చేస్తుంది ఇంటిని ముక్కలు చేస్తుందని భయంగా ఉందని అంటుంది.. నీకు ఫోన్ చేసి పిలిపించడానికి ఇదే కారణం అని పార్వతి అంటుంది. నేను చూశాను కదా నేను చెప్తాను ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి చెంచులమ్మ అంటుంది.. ఇక అవని వంట చేస్తుంటే చెంచులమ్మ అక్కడికి వెళ్లి వంటను రుచి చూస్తుంది. నేను అంతగా బాగా చేస్తానని చెప్పలేదు కానీ అందరూ తినేలానే చేస్తానండి అని అనగానే చెంచులమ్మ ఇల్లాలు వంటలోనే ఆమె గుణం ఏంటో చెప్పగలము అని అంటారు కదా అవన్నీ చేసిన వంటల్ని రుచి చూస్తుంది. ఇదేంటి అవని ఉప్పు కారం లేకుండా చప్పగా ఉన్నాయనేసి అంటుంది.. అవని షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో వంటను బట్టే ఆడవాళ్ళు ఎలాంటివాళ్ళు వాళ్ళ మనసు ఎలాంటిదో చెప్పేయచ్చని పెద్దలంటారు అది నిజమే కదా అవని అనేసి చెంచులమ్మ ఆ వంటల్ని టేస్ట్ చేస్తుంది అని చెప్పగానే చేస్తున్నావ్ అంటే నీకు ఇంట్లో వాళ్ళ మీద గౌరవం లేదా అని చెంచులమ్మ అవన్నీ అడుగుతుంది. అదేం లేదండి నేను బాగానే చేశానే అనేసి అంటుంది. ఇక మెల్లగా మాటల్లో పెట్టి ఆస్తి అంటే నీకు మోజు ఉందా అనేసి అడుగుతుంది. కావాలంటే నీకు గౌరవం లేదా అని ఒక్కో ప్రశ్నతో నిజాలను బయట పెట్టేందుకు చెంచులమ్మ ప్రయత్నం చేస్తుంది. అవని మాట్లాడిన తీరుతో చెంచులమ్మ ఫిదా అయిపోతుంది ఇక అవన్నీ తప్పు ఉందా లేదా అని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అటు పల్లవి చెంచులమ్మకు అనుమానం రాకుండా ఉండాలని ఫోన్లు కూడా మాట్లాడకుండా ఉండాలని అనుకుంటుంది.
చెంచులమ్మ విషయం తన డాడీకి చెపుతుంది. ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి తన డాడీతో పంచుకుంటుంది. అది విన్న చెంచులమ్మ పల్లవి నిజస్వరూపం గురించి ఎలాగైనా బయట పెట్టాలని అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఒక పూజ చెప్పి ఆ పూజ చేయమని అందరితో అంటుంది చెంచులమ్మ. ఆ పూజ కోసం చేసిన దీపం ఆరిపోతే ఆ దొంగ ఎవరో తెలిసిపోతుందని అంటుంది.. ఈ దీపం ఆరిపోతే అరిష్టం జరుగుతుందని అంటుంది. ఇక అందరూ ఆ దీపం గురించి ఆలోచిస్తారు పార్వతి మాత్రం ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని ఆలోచనలోనే ఉంటుంది. ఇక అనుకున్నట్టుగానే పూజను పూర్తి చేసి దీపాన్ని పూజగదిలో పెడుతుంది. అయితే ఆ దీపం ఆరిపోయి ఉంటుంది. ఆ దీపం ఆరిపోయింది ఎందుకని చెంచులమ్మ అనుకుంటగానే పల్లవి ఆ దీపాన్ని ఆర్పేసినట్టు తెలుసుకుంటుంది. ఈ విషయాన్ని పార్వతికి ఎలాగైనా చెప్పాలని అనుకుంటుంది. ఇక రాత్రి అవని పడుకొని నిద్రపోతుంది. చెంచులమ్మ ఉదయం పల్లవినే అంతా చేసిందని నిజం చెప్పినట్టు కలగంటుంది.. ఇక ఉలిక్కిపడి లేచి చెంచులమ్మ కోసం వెతుక్కుంటూ బయటకు వస్తుంది.. చెంచులమ్మ దగ్గరికి వెళ్లి చెంచులమ్మ గారు మీరు ఇంకా పడుకోలేదు ఏంటి అనగానే అవని నువ్వేంటి ఇప్పుడొచ్చావ్ అనేసి అడుగుతుంది.
ఇంట్లో అసలు దొంగ ఎవరో నీకు తెలుసా అని అంటే నాకు తెలుసు కానీ నేను చెప్పను అంటుంది ఎవరు పల్లవి నే కదా ఆ దీప మారిపేసింది కూడా పల్లవినేని నాకు తెలుసు. రేపు ఇదే విషయాన్ని నేను అందరి ముందర చెప్పాలని అనుకుంటున్నాను అని అంటుంది కానీ అవని మాత్రం అలా చేస్తే ఈ కుటుంబం చీలిపోతుంది ఇప్పటికే మా మామయ్యకు రెండుసార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఇంకొకసారి వస్తే ఆయనకు ఏమవుతుందని భయంగా ఉంది అత్తయ్య పల్లవి మీద పెట్టుకుని నమ్మకం పోతుంది ఇంట్లో వాళ్ళందరూ పల్లవిని గెంటేస్తారు అనేసి అంటుంది. పల్లవిని ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను మార్చుకుంటాను నా సొంత బిడ్డ లాగా చూసుకుంటాను అనేసి అవని చెంచులమ్మతో అంటుంది.. ఉదయం లేవగానే చంచలమ్మ అందర్నీ పిలుస్తుంది. ఎవరు అనేది నాకు తెలుసు కానీ నిజం చెప్పను అన్నట్టుగా మాట్లాడుతుంది అవని చాలా మంచిది అవని ఇంటిని చక్కదిద్దడంలో ఒక అడుగు ఎక్కువగానే చదివింది అనేసి అవని గురించి పొగిడేస్తుంది. ఇక రాజేంద్రప్రసాద్ అదే చెప్తాడు అవని ఈ ఇంటిని కాపాడుతుంది ఇంటిని ఒంటి చేత్తో నడిపిస్తుందని దీమాగా చెప్తాడు అది విన్న చెంచులమ్మ అదే నిజమండి అనేసి చెప్పి వెళ్ళిపోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అవని ఏడుస్తూ ఉంటే కమల్ వస్తాడు. కమల్ మా వదిన ఏడిపించింది ఎవరు అని అందర్నీ నిలదీసి అడుగుతాడు ఇక రేపటి ఎపిసోడ్ లో పల్లవి భానుమతి బయటపడతారేమో చూడాలి..