Gully Boys Bhaskar: ఈమధ్య కాలంలో జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఒకరి తర్వాత ఎవరు వివాహం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక జబర్దస్త్ కమెడియన్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేశారు. పటాస్, జబర్దస్త్ కామెడీ షో లలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తనదైన కామెడీ పంచ్ లతో, ప్రాసలతో బుల్లితెర ఆడియన్స్ ను బాగా కవ్వించారు. ఇక ఆయన ఎవరో కాదు గల్లీ భాయ్ భాస్కర్. పటాస్ షోలో స్టాండ్ అప్ కమెడియన్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన.. సద్దాం, యాదమ్మ రాజు తో కలిసి స్కిట్స్ చేస్తూ ఆడియన్స్ ను మెప్పించారు.
గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్..
ఇక ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ ప్రోగ్రాంలో కూడా కనిపిస్తున్నాడు. ఇలా ఒకవైపు టీవీ షోలు, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే.. మరొకవైపు అడపా దడపా చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా భాస్కర్ తన ప్రియురాలిని పరిచయం చేశారు. ఆమె పేరు మానస (Manasa )అయితే ఆమె ఎవరు అనే విషయాలు పూర్తిగా తెలియలేదు. కానీ ఆమె తో కలిసి వీడియోలు కూడా చేస్తున్నారు భాస్కర్. అంతేకాదు ఆమెతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. మై లవ్ అంటూ లవ్ ఎమోజీలను కూడా పంచుకుంటున్నారు. ఇకపోతే భాస్కర్ , మానస గత రెండేళ్ల క్రితం తొలిసారి కలుసుకున్నారట. ఇక అప్పటినుంచి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు రెండేళ్ల తర్వాత బహిర్గతం చేశారంటే.. ఇంట్లో కుటుంబ సభ్యులను ఒప్పించారేమో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రేయసి పై ప్రేమ కురిపిస్తున్న గల్లీ బాయ్స్ భాస్కర్..
ఇకపోతే తరచూ మానసతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో భాస్కర్ షేర్ చేస్తున్నారు. అందులో ఆమెపై ప్రేమ వర్షం కురిపిస్తూ..” మనం ఈ రెండేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు.. కానీ నువ్వు అన్ని సందర్భాలలో కూడా నా వెంట నిలచావు.. తోడుగా ఉన్నావు.. థాంక్యూ మానస..లవ్ యు ” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు భాస్కర్. ప్రస్తుతం భాస్కర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇకపోతే మానస, భాస్కర్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని తెలియడంతో అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంతేకాదు క్యూట్ జోడి అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇకపోతే గత కొన్ని నెలల క్రితం గల్లీ భాయ్ భాస్కర్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు. పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్గా గృహప్రవేశం కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేశారు. మొత్తానికి అయితే స్పీడ్ మీదున్న భాస్కర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎప్పుడు వివాహం చేసుకుంటారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.