Shikhar Dhawan: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్ ( Shikhar Dhawan) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బ్యాట్ పట్టేందుకు మళ్లీ వస్తున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధవన్. అయితే టీమిండియాలోకి మాత్రం శిఖర్ ధవన్ ( Shikhar Dhawan) రావడం లేదు. నేపాల్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్లో ఆడబోతున్నాడు శిఖర్ ధవన్ ( Shikhar Dhawan).
Also Read: Arjun Tendulkar: భయంకరమైన బౌలింగ్ తో రెచ్చిపోయిన సచిన్ కొడుకు..వేలంలో భారీ ధర పక్కా !
Also Read: South Africa vs India, 3rd T20I: బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా.. అవేశ్ ఖాన్ పై వేటు ?
ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ కు ( Nepal T20 League ) సంబంధించిన కర్నాలి యాక్స్ ( Karnali Yaks) అనే ఫ్రాంచైజీకి ఆడబోతున్నాడు.
Also Read: South Africa vs India, 3rd T20I: మూడో T20 లో టీమిండియా గ్రాండ్ విక్టరీ
ఇది ఇలా ఉండగా….. 38 ఏళ్ల శిఖర్ ధవన్ ( Shikhar Dhawan) 34 టెస్టు మ్యాచ్‌లు, 167 వన్డేలు, 68 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఎడమచేతి వాటం ఓపెనర్ ఫార్మాట్లలో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు శిఖర్ ధవన్ ( Shikhar Dhawan). భారతదేశ అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో ఒకరిగా పరిగణించబడతాడు శిఖర్ ధవన్ ( Shikhar Dhawan). ఈ ఏడాది ఆగస్టు 24న అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైరయ్యాడు.
Also Read: BCCI on Indian Team Coach: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ముగ్గురు హెడ్ కోచ్‌లు?
6,769 పరుగులతో, శిఖర్ ధావన్… ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ర్యాంక్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు శిఖర్ ధవన్ ( Shikhar Dhawan). ఐపీఎల్ లీగ్‌లో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలు కొట్టిన మొదటి ఆటగాడు. IPLలో పంజాబ్ , హైదరాబాద్ ఫ్రాంచైజీలకు కెప్టెన్‌గా ఉన్నాడు శిఖర్ ధవన్ ( Shikhar Dhawan). ధావన్ చేరిక కర్నాలీ జట్టును బలోపేతం చేయడమే కాకుండా NPL ప్రారంభ ఎడిషన్‌కు గణనీయమైన విలువను పెంచనుంది.
Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !
మార్టిన్ గప్టిల్, జేమ్స్ నీషమ్, బెన్ కట్టింగ్ వంటి ఆటగాళ్లు ఇప్పటికే వివిధ ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్నారు. కర్నాలీతో నాల్గవ ఓవర్సీస్ ఆటగాడిగా ధావన్… సంతకం చేశారు. వారు ఇప్పటికే పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ హుస్సేన్ తలాత్, హాంకాంగ్‌కు చెందిన బాబర్ హయత్, వెస్టిండీస్‌కు చెందిన చాడ్విక్ వాల్టన్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక నేపాల్ ప్రీమియర్ లీగ్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 21 వరకు జరగాల్సి ఉంది.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !