BigTV English

YS Sharmila: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల

YS Sharmila: దమ్ముంటే అడుగు పెట్టు.. ఆపై మాట్లాడు.. ఇచ్చిపడేసిన షర్మిల

YS Sharmila: ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య జగడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంటి పోరు ఇంతింత కాదనేట్టు.. అన్న చెల్లెలి మధ్య డైలాగ్ వార నడుస్తూనే ఉంటుంది. సందు దొరికినప్పుడల్లా.. తన స్టైల్లో వాయించేస్తున్నారు. కుదిరితే ట్వీటు.. వీలైతే ప్రెస్ మీటు.. వేదిక ఏదైనా సరే.. అన్న జగన్ మీద.. అంతెత్తున్న లేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న సోషల్ మీడియా పోస్టుల అరెస్టులపై.. అన్న జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.


సోషల్ మీడియాలో తమపై జరుగుతున్న ద్రుష్పచారాలకు జగనే కారణమని షర్మిల ఫైర్ అయ్యారు. తనతో పాటు విజయమ్మ, చెల్లెలు సునీతపై.. నీచంగా పోస్ట్‌లు పెట్టించింది జగనేనని సంచలన ఆరోపణలు చేశారు. తమపై సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయడమే కాదు.. అక్రమ సంబంధాలు కూడా అంటగట్టారని అసహనం వ్యక్తం చేశారు.

Also Read: వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డిలపై మరో కేసు నమోదు..


అలానే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి వెళ్లనప్పుడు మీకూ, మాకూ తేడా లేదని కౌంటరిచ్చారు. ఓట్లేసిన 38శాతం ప్రజలు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని షర్మిల ధ్వజమెత్తారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా దక్కకపోవడం ఆయన స్వయంకృతాపరాధమేనన్నారు షర్మిల. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారన్నారు.

అసెంబ్లీకి వెళ్లకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న షర్మిల వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ స్పందించారు. తన సోదరి గురించి ఇక్కడ మాట్లాడవద్దని మీడియాతో అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదని.. 1.7 శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉందన్నారు.

 

 

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×