Jabardasth Ram Prasad: జబర్దస్త్ (Jabardast)కార్యక్రమం ద్వారా కమెడియన్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు ఆటో రామ్ ప్రసాద్ (Auto Ram Prasad). తాజాగా ఈయన ప్రమాదం బారిన పడినట్లు సమాచారం. రామ్ ప్రసాద్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ కావడంతో స్వల్ప గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎప్పటిలాగే గురువారం షూటింగ్ కు వెళ్తుండగా.. తుక్కుగూడ సమీపంలో ఆటో రాంప్రసాద్ ముందున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ తరుణంలోమే జబర్దస్త్ కమెడియన్ కారును వెనుక నుంచి ఆటో ఢీ కొట్టడంతో రామ్ ప్రసాద్ కార్ ముందు ఉన్న మరో కారుని ఢీ కొట్టినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటో రాంప్రసాద్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటగానే ఉందని, కేవలం చిన్నపాటి గాయాలు మాత్రమే అయినట్లు సన్నిహితులు తెలిపినట్లు సమాచారం.
ఆటో రామ్ ప్రసాద్ కెరియర్..
ఇక ఆటో రాంప్రసాద్ విషయానికి వస్తే.. జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటీ అందుకున్నారు. తన ఆటో పంచ్ లతో బుల్లితెర ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ, స్టార్ కమెడియన్ గా పేరు దక్కించుకున్నారు.
ముఖ్యంగా జబర్దస్త్ వేదికపై సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లతో కలిసి రామ్ ప్రసాద్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన స్కిట్స్ మాత్రం ఒక రేంజ్ లో షో కి మంచి టిఆర్ రేటింగ్ ను తీసుకొచ్చాయి. ఇక సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోయినా.. ఇప్పటికీ ఆటో రాంప్రసాద్ టీం లీడర్ గా కొనసాగుతూనే ఉన్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు టీవీ షోలో కూడా సందడి చేస్తున్నారు. ఇక వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుస్తూ స్టార్ స్టేటస్ ను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆటో రాంప్రసాద్.
స్నేహితులతో కలిసి కొత్త సినిమా..
ఇకపోతే ఆ మధ్యలో సుధీర్ గెటప్ శ్రీనులను హీరోగా పెట్టి ఆటో రాంప్రసాద్ ఒక సినిమా కూడా తీయనున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనే తమ సినిమాను అధికారికంగా కూడా పట్టాలెక్కిస్తామని ఆటో రాంప్రసాద్ ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. కానీ ఏమైందో తెలియదు కానీ ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడం గమనార్హం.ఇకపోతే వీరి ముగ్గురు కాంబినేషన్లో త్రీ మంకీస్ సినిమా వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మళ్ళీ వీరి ముగ్గురు కాంబినేషన్లో ఒక మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు మీరు ముగ్గురు ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంటారో చూడాలి.