Deepika Rangaraju:దీపిక రంగరాజు(Deepika Rangaraju) .. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పేరుకే తమిళ నటి అయినప్పటికీ.. ఇటు తెలుగు బుల్లితెరపై విపరీతమైన ప్రజాధారణ సొంతం చేసుకుంది. బుల్లితెర టాప్ సీరియల్స్ లో ఒకటైన ‘బ్రహ్మముడి’ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తూ కావ్య పాత్రతో తెలుగు ఆడియన్స్ కు దగ్గర అయిన ఈమె.. ఈ సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది కూడా ఈమె కావడం గమనార్హం.అలా బ్రహ్మముడి కావ్యగా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న దీపిక ..తమిళ నటి అయినప్పటికీ.. మన పక్కింటి అమ్మాయిలా.m తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువైంది. టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో వచ్చీ రాని తెలుగుతో ఈమె చేసే సందడి మామూలుగా ఉండదు.
అలా బుల్లితెరపై జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న దీపిక సడన్గా అభిమానులకు షాక్ ఇచ్చింది. మొన్నటి వరకు ఒక సీరియల్ నటుడిని ప్రేమించిందని, తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యింది అంటూ గత రెండు సంవత్సరాలుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్గా పెళ్లికూతురు గెటప్ లో.. మెడలో తాళి, తలమీద జీలకర్ర, బెల్లం పెట్టించుకుని మరీ ఆ ఫోటోలను షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే దీపిక పెళ్లి చేసుకుందా? ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా సడన్గా పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి దీపికాను పెళ్లి చేసుకున్న ఆ అబ్బాయి ఎవరు?. ఇలా పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మరి కొంతమంది దీపిక పెళ్లికూతురు గెటప్ లో కనిపించడంతో అసలు ఈ ట్విస్ట్ ఏంటి తల్లి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీపికా పదుకొనే సడన్గా ఇలా పెళ్లికూతురు గెటప్ లో కనిపించేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి దీపిక సడన్గా ఇలా పెళ్లికూతురు గెటప్ లో కనిపించడం వెనుక అసలు కారణం కూడా ఆమె ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.” పెళ్లి అయితే లైఫ్ అయిపోతుందా.. అయిపోదు కదా.. అలాగే సీరియల్ లో మ్యారేజ్ అయితే కూడా సీరియల్ అయిపోదు.. చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి?? స్టార్ మా లో బ్రహ్మముడి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది” అంటూ కామెంట్లు చేసింది . మొత్తానికైతే ఇది బ్రహ్మముడి సీరియల్ లో భాగంగానే ఈమె ఇలా పెళ్లికూతురు గెటప్ లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది.
ALSO READ:ముఖేష్ – త్రిగుణ్ మీ పంతం వీడరా?
దీపిక రంగరాజు విషయానికి వస్తే.. తమిళనాడుకు చెందిన ఈమె మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఒక తమిళ్ ఛానల్లో న్యూస్ ప్రెజెంటర్ గా తన కెరియర్ ప్రారంభించిన దీపిక.. ఆ తర్వాత చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత బ్రహ్మముడిలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఇకపోతే తమిళంలో ఈమె ఒక సినిమాలో కూడా నటించడం గమనార్హం. ప్రస్తుతం దీపిక బ్రహ్మముడి సీరియల్ తో పాటు ఆహా ఒరిజినల్ ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న చెఫ్ మంత్ర ప్రాజెక్టు కే లో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.