E-Paper
Advertisement

నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!

నా భార్య అందుకే నన్ను వదిలేసింది. సుధీర్ ఎమోషనల్!
Advertisement

Bigg boss 10 Sudheer Reddy:బిగ్ బాస్ సీజన్ 10 ప్రేక్షకులకు ఎంతటి వినోదాన్ని పంచుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ముఖ్యంగా గత సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది. దశావతారం అనే థీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోలో గొడవలు, లవ్ ట్రాక్ ఇలా ఒక్కటేమిటి ఆడియన్స్ కి కావాల్సిన వినోదం ఇక్కడ లభిస్తోందనే చెప్పాలి. ఇకపోతే తాజాగా 9వ వారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగానే ముగిసింది. మరోవైపు ఒకరినొకరు తమ ఎమోషనల్ విషయాలను అభిమానులతో పంచుకునే సమయం వచ్చింది. అందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కంటెస్టెంట్స్ కోసం.. హౌస్ లోకి వచ్చిన ఫోటోలలో .. తమ కుటుంబ సభ్యులతో ఉన్న బాండింగ్ గురించి చెప్పుకుంటూనే, తమ జీవితంలో తాము ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు.

నా తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గరుండి మరీ చూసాను..

అందులో భాగంగానే సుధీర్ రెడ్డి కూడా తన ఎమోషనల్ జర్నీని అభిమానులతో పంచుకున్నారు. “ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. ఫ్యామిలీ పరంగా ఒక అమ్మాయిని చూసి నాకు పెళ్లి చేశారు. అప్పుడు నాకు ఇంకొక ట్రామా మొదలయ్యింది. నా లైఫ్ లో నేను ఎక్కువగా మనుషులను నమ్ముతుంటాను. అదే మనుషుల దగ్గర మోసపోతుంటాను. కానీ ఇది చాలా పర్సనల్ స్పేస్. ఈ స్పేస్ లోకి వచ్చేవాళ్ళు మనల్ని కంప్లీట్ గా అర్థం చేసుకొని రావాలి అని చాలా నమ్మాను. కానీ నా వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు మనస్పర్ధలు రావడం సహజమే. అయితే ఈ జర్నీలోకి వచ్చాక మీరు ఒకరన్నారు చూడండి ..ఇల్లు కట్టి పెళ్లి చేసుకోవాలి అని. అదే టైంలో ఇల్లు తీసుకున్నాము. నా పెళ్లి కూడా జరిగింది. పెళ్లి టైం లో ఇల్లు అంటే తల్లిదండ్రులకు ఎంత భారమో నేను నా కళ్ళతో చేశాను.

కట్టుకున్న భార్య చెప్పకుండా వెళ్ళిపోయింది..

Advertisement

ఇంటి విషయంలో లోన్ కోసం తిరిగాము.. ఇంకొక సైడ్ పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందులు చూసి ఒకానొక సమయంలో పెళ్లి చేసుకోవాలా? వద్దా? అనే భయం కూడా కలిగింది.. ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో డిజిటల్ కంటెంట్ గా పని చేస్తున్నాను. ఎన్నో రూమర్స్, గాసిప్స్ వస్తాయి. ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకుంటారా? లేదా ? అనే భయం కూడా నాలో ఎక్కువగా కలిగింది. నాకు కాబోయే భార్య అవన్నీ అర్థం చేసుకోవడంతోనే నేను పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి చేసుకున్నాక నా జీవితమే మారిపోయింది. ముఖ్యంగా నా జీవితాన్ని కంపేర్ చేస్తూ నన్ను చాలా ఇన్సల్ట్ చేసింది. ఆ మాట కూడా నేను తీసుకున్నాను. ఒకవైపు నేను నిద్రపోతుంటాను.. మరొకవైపు అర్ధరాత్రిలో లేచి కూర్చుని ఏడుస్తూ అనవసరంగా వీడిని వివాహం చేసుకున్నాను . వీడిని చేసుకోవడం వల్ల నా జీవితం నాశనం అయ్యింది అని కూడా ఎన్నోసార్లు అన్నది . ఇలా ఇంట్లో ఈ సమస్య జరుగుతూనే మరొకవైపు నేను ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాలి. ఆ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ సెలబ్రిటీ గురించి నేను మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అక్కడ నేను సరిగ్గా పని చేయకపోతే పది రూపాయలు రావు.. ఆ పది రూపాయలు వస్తేనే కదా దాన్ని తీసుకెళ్లి నేను నా భార్యకు ఇవ్వగలను. ఇవన్నీ జరుగుతున్న సమయంలో మా మధ్య గ్యాప్ మరింత పెరిగిపోయింది. వీడు ఇంతే ఇంతకంటే ఎక్కువ ముందుకు వెళ్ళలేడు అనే ఒక అభిప్రాయం ఏర్పడి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. ఇక ఆరు నెలల తర్వాత ఇంటికి వస్తుందనుకున్నాను. కానీ ఆమె యూఎస్ వెళ్ళిపోయింది.

ALSO READ:బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంట్ వెనుక ఇంత స్టోరీ ఉందా?

కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచిన సుధీర్ రెడ్డి..

Advertisement

కట్ చేస్తే మా అమ్మ నాన్న ఎదురుగా వచ్చారు. వారు ఎప్పుడూ కూడా నా గురించే ఆలోచించారు. కనీసం ఇప్పుడైనా నేను జీవితంలో నిరుదొక్కుకోవాలి అనుకున్న సమయంలో నా భార్య కూడా నన్ను నమ్మకుండా వదిలి వెళ్ళిపోయింది ” అంటూ తన జర్నీ గురించి చెప్పుకొని అందరినీ ఎమోషనల్ చేశారు సుధీర్ రెడ్డి. ఇకపోతే సెలబ్రిటీలనే కాదు సాధారణ ప్రజలను కూడా ఆయన ఇంటర్వ్యూ చేస్తూ.. ఒక అమ్మాయి తన కూతుర్లతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. ఒక అమ్మాయికి ఏడాది పాటు ఉచితంగా స్కూల్ ఫీజు కూడా కట్టాను. ఆమెకు ఐదు లక్షల రూపాయలను 24 గంటల్లోనే బ్యాంకు డిపాజిట్ కూడా చేశాను అని కూడా చెప్పుకొచ్చారు. వైజాగ్ లో ఒక ముసలావిడకు కూడా తాను ఆర్థిక సహాయం చేశాను అంటూ చెప్పుకొచ్చారు.

Related News

తెలుగు సీరియల్స్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూడు అవుట్..

కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన వంటలక్క.. కొత్త హీరోయిన్ ఎంట్రీ..?

సీరియల్స్ కు మరో హీరోయిన్ గుడ్ బై.. అస్సలు ఊహించని ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవి కోసం కన్నీళ్లు.. పల్లవి మాటతో షాక్.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..

Karthika Deepam 2 Serial Today Episode November 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, దీప   

Podarillu Today Episode : ఛీ.. చక్రీ మారాడు.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. అడ్డంగా బుక్కయ్యాడే..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ఫ్యూజుల్ అవుట్.. చింతామణికి దిమ్మతిరిగే షాక్.. శభాష్ శృతి..

Big Stories

Advertisement
×